Honda CB1000F New Bike: హోండా బైక్‌లకు మార్కెట్ డిమాండ్ అంతా ఇంతా కాదు. ట్రెండ్‌కి తగ్గట్టుగా యూత్‌ని ఆకట్టుకునేలా కొత్తవాటిని మార్కెట్లోకి దించుతోంది. తాజాగా కొత్త బైక్‌ని విడుదల చేసింది. హార్నెట్ ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడి ఉంటుంది. 1,000 cc ఇంజిన్‌తో పని చేస్తుంది. మూడు రంగులలో లభిస్తోంది.
యూత్ డ్రీమ్ బైక్
హోండా కంపెనీ టూ వీలర్స్ తన కొత్త CB 1000F బైక్‌ని ఆవిష్కరించింది. కొన్ని నెలల కిందట కాన్సెప్ట్ మోడల్‌గా ప్రదర్శించారు. ఇప్పుడు ఆ కంపెనీ దాని ప్రొడక్షన్ వెర్షన్‌ను ఆవిష్కరించింది. డిజైన్ క్లాసిక్ లుక్‌ను కలిగి ఉంది. అయితే ఈ బైక్ ట్రెండ్ కు తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసింది. హోండా కొత్త బైక్ CB1000F 1,000cc, 4-సిలిండర్, లిక్విడ్-కూల్డ్ ఇంజిన్‌ను కలిగి ఉంది.
గతంలో CBR 1000RR ఫైర్‌బ్లేడ్ (2017) వచ్చింది. ఇది కొత్త క్యామ్ షాఫ్ట్‌లు, ఎయిర్‌బాక్స్, కొత్త 4-2-1 ఎగ్జాస్ట్ సిస్టమ్‌తో సహా అనేక మార్పులు ఉన్నాయి. ఇంజిన్ 123.7 hp, 103 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. గేర్‌బాక్స్ కూడా మార్పులు జరిగాయి. తొలి రెండు గేర్లు అలా ఉంచితే హైవేపై బైక్‌ను మరింత సౌకర్యవంతంగా రైడ్ చేయవచ్చు. మూడు నుంచి ఆరో గేర్ వరకు పొడిగించింది ఆ కంపెనీ.
CB1000 హార్నెట్ మాదిరిగానే ప్రధాన ఫ్రేమ్‌ను పంచుకుంటుంది. బైక్ సీటు ఎత్తు 795mm, ఇది హార్నెట్ కంటే 14mm తక్కువ. రైడ్ చేయడానికి కంఫర్టుబుల్‌గా ఉంటుంది. పూర్తి ట్యాంక్ బరువు 214kg కాగా, 16-లీటర్ ఇంధన ట్యాంక్‌ను కలిగి ఉంది. షోవా యొక్క సర్దుబాటు సెటప్ (ముందు భాగంలో 41mm టెలిస్కోపిక్ ఫోర్క్, వెనుక భాగంలో మోనోషాక్) ద్వారా సస్పెన్షన్ నిర్వహించబడుతుంది. ఇది డ్యూయల్ 310 mm ఫ్రంట్ డిస్క్‌లు, 240 mm వెనుక డిస్క్ బ్రేక్‌ను కలిగి ఉంటుంది.
ఫీచర్లు మామూలుగా లేవు
హోండా CB1000F ఫీచర్ల విషయానికి వద్దాం. డిజైన్ రెట్రోగా ఉన్నప్పటికీ ఫీచర్లు పూర్తిగా ఆధునికమైనవి. 5 అంగుళాల TFT డిస్ప్లే దీని సొంతం. కీలెస్ ఇగ్నిషన్, పూర్తి-LED లైటింగ్‌ను కలిగి ఉంది. ఎలక్ట్రానిక్స్ ప్యాకేజీలో మూడు ప్రీసెట్ రైడింగ్ మోడ్‌లు (స్పోర్ట్, స్టాండర్డ్, రెయిన్), రెండు కస్టమ్ మోడ్‌లు (యూజర్ 1, యూజర్ 2) ఉన్నాయి.
డ్యూయల్-ఛానల్ ABS, ట్రాక్షన్ కంట్రోల్, ఇంజిన్ బ్రేకింగ్ సెట్టింగ్‌లు, క్విక్ షిఫ్టర్ కూడా అందించబడతాయి. మూడు రంగుల్లో రిలీజ్ చేస్తోంది ఆ కంపెనీ. వాటిలో సిల్వర్/బ్లూ, సిల్వర్/బ్లాక్, బ్లాక్/రెడ్. జపాన్‌లో దీని ధర 1,397,000 యెన్లు అంటే భారతీయ కరెన్సీలో సుమారు ₹8.11 లక్షలు, CB1000 హార్నెట్ అయతే ₹7.79 లక్షలు) కంటే కొంచెం ఎక్కువ.