AFG vs PAK: పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు ( Pakistan Team) మరో ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఇప్పటికే పాకిస్తాన్ కు చుక్కలు చూపిస్తున్న ఇండియా, ఇటీవల కాలంలో షేక్ హ్యాండ్ ఇవ్వకుండా అవమానించింది. ఇప్పుడు అదే బాటలో ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు నడిచేందుకు సన్నద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. పాకిస్తాన్ అలాగే ఆఫ్ఘనిస్తాన్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఇలాంటి నేపథ్యంలో ఇకపైన పాకిస్తాన్ తో ద్వైపాక్షిక సిరీస్ లు రద్దు చేసుకోవాలని ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డ్ నిర్ణయం తీసుకుందట. అలాగే ఐసీసీ టోర్నమెంటులో ఇండియా తరహాలో షేక్ హాండ్స్ ( Shake Hands) ఇవ్వకూడదని అనుకుంటున్నారట.
Also Read: IND-W vs SA-W: రీల్స్ పైన ఉన్న ఫోకస్, బ్యాటింగ్ పైన లేదు…లేడీ కోహ్లీ అనుకుంటే, నట్టేట ముంచింది!
పాకిస్తాన్ దేశం ఎప్పుడూ వివాదాల్లోనే చిక్కుకుంటూ ఉంటుంది. ఆ దేశంలో విపరీతంగా ఉగ్రవాదులు ఉన్న నేపథ్యంలో ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయింది. ఆ దేశంలో పెట్టుబడులు పెట్టే వాళ్లే ఉండరు. పక్క దేశమైన మన ఇండియాతో కూడా వైరం పెట్టుకుంది. తాజాగా ఆఫ్ఘనిస్తాన్ దేశాన్ని కూడా గెలికింది పాకిస్తాన్. అక్టోబర్ 9వ తేదీ అర్ధరాత్రి సమయంలో ఆఫ్గనిస్తాన్ రాజధాని కాబుల్ లో పెద్ద పేలుళ్లు జరిగాయి. ఈ సంఘటన నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్ ఉక్కిరిబిక్కిరి అయింది. దీనంతటికీ కారణం పాకిస్తాన్ వైమానిక దళం అని తేలడంతో తీవ్ర ఆగ్రహంతో ఆఫ్గనిస్తాన్ ఉంది. ఈ పేలుళ్ల నేపథ్యంలో పాకిస్తాన్ అలాగే ఆఫ్ఘనిస్తాన్ మధ్య విభేదాలు మరోసారి రాజు కున్నాయి.
ఇలాంటి నేపథ్యంలో, పాకిస్తాన్ కు ఊహించని షాక్ ఇచ్చింది ఆఫ్గనిస్తాన్ క్రికెట్ బోర్డు. ఇకపైన పాకిస్తాన్ క్రికెట్ జట్టుతో ద్వైపాక్షిక టోర్నమెంట్లు ఆడకూడదని నిర్ణయం తీసుకుంది ఆఫ్గనిస్తాన్ క్రికెట్ బోర్డు. అలాగే ఐసీసీ టోర్నమెంట్లలో పాకిస్తాన్ తో మ్యాచ్ లు జరిగితే షేక్ హ్యాండ్ ఇవ్వకూడదని నిర్ణయం తీసుకున్నారట. ఆఫ్ఘనిస్తాన్ కు చెందిన తాలిబన్ ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకుందట క్రికెట్ బోర్డు. ఇప్పటికే టీమిండియా కూడా పాకిస్తాన్ విషయంలో ఇలాగే వ్యవహరిస్తోంది. ద్వైపాక్షిక సిరీస్ లతో పాటు షేక్ హ్యాండ్ ఇవ్వడం కూడా బంద్ చేసింది.
పాకిస్తాన్ వర్సెస్ ఆఫ్గనిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణ నెలకొన్న సంగతి తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలో ఓ పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా మహమ్మద్ అసిఫ్ కీలక ప్రకటన చేశారు. ఆఫ్ఘనిస్తాన్ పట్ల ఎంతో ప్రేమ మేం చూపిస్తున్నాం.. కానీ ఆఫ్ఘనిస్తాన్ మాత్రం కుట్రలు పన్నుతోందని మండిపడ్డారు. తమకు శత్రువులుగా ఉన్న దేశాలకు వాళ్లు మిత్రులుగా మారుతున్నారని నిప్పులు జరిగారు. ముఖ్యంగా తెహ్రిక్-ఇ తాలిబన్ పాకిస్థాన్ (TTP) కు మద్దతిస్తున్నారని ఆఫ్ఘనిస్తాన్ పై సీరియస్ అయ్యారు. ఇటు పాకిస్థాన్ పై యుద్దం చేసేందుకు కూడా ఏ మాత్రం ఆఫ్ఘన్ వెనుకాడటం లేదు.
🚨BREAKING NEWS🚨
– Afghanistan Cricket Board has formally suspended all future bilateral cricket matches with Pakistan and adviced players not to shake hands with Pakistani players in ICC events.
– Another cricket board interfering politics in the game…!!! (Hello Pakistan) pic.twitter.com/lrm9I0nbl9
— Rayham (@RayhamUnplugged) October 10, 2025