Rashmika – Vijay:గత కొన్ని సంవత్సరాలుగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో రూమర్డ్ కపుల్స్ గా పేరు తెచ్చుకున్న జంటలలో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), రష్మిక మందన్న(Rashmika Mandanna) కూడా ఒకరు. గీతగోవిందం సినిమాతో మొదలైన వీరి పరిచయం.. ఆ తర్వాత డియర్ కామ్రేడ్ సినిమాలో కూడా నటించేలా చేసింది. ఈ రెండు చిత్రాల సమయంలోనే వీరిద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారిందని, పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి కానీ ఈ జంట ఎప్పుడూ కూడా ఈ వార్తలను ఖండించలేదు. అలా అని స్పందించనూ లేదు.
కానీ ఎక్కడపడితే అక్కడ మీడియా కంట పడడం, వెకేషన్ కి వెళ్లడం, రష్మిక విజయ్ దేవరకొండ ఫ్యామిలీతో సినిమాలు చూడడం.. అటు విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ తో ఏకంగా పబ్లిక్ ఈవెంట్లో నువ్వు నా ఫ్యామిలీ అని చెప్పడంతో.. ఇక నిజంగానే వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారని అందరూ అనుకున్నారు. దీనికి తోడు అక్టోబర్ మూడవ తేదీన ఇరు కుటుంబ సభ్యుల మధ్య అత్యంత రహస్యంగా రష్మిక – విజయ్ దేవరకొండ నిశ్చితార్థం చేసుకున్నారు. కానీ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు. అయితే ఇప్పుడు రష్మిక తాజాగా ఈ విషయాన్ని అఫీషియల్ చేసింది.
విషయంలోకి వెళ్తే.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ.. తాజాగా తన ఇంస్టాగ్రామ్ వేదికగా ఒక క్యూట్ వీడియోని పంచుకుంది. అందులో ఆమె తన పెట్ డాగ్ తో ఆడుకుంటున్న సమయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో.. ఆమె చేతికి ఉన్న ఉంగరం ఇప్పుడు హైలైట్ గా మారింది. తాజాగా రష్మిక చేతికి ఉన్న డైమండ్ రింగ్ ను చూస్తే.. తమకు ఎంగేజ్మెంట్ అయిందని విషయాన్ని అఫీషియల్ గా చెప్పేస్తుందని చెప్పవచ్చు. అలా రష్మిక మందన్న తన చేతి వేలికి ఉన్న డైమండ్ రింగుతో తనకు నిశ్చితార్థం అయిపోయిందని అఫీషియల్ గా ప్రకటించేసింది..
మొన్న విజయ్ దేవరకొండ కూడా ఎంగేజ్మెంట్ రింగ్ తో కనిపించారు. ఎంగేజ్మెంట్ తర్వాత తమ కుటుంబ సభ్యులతో కలిసి.. సత్యసాయిబాబా మహాసమాధిని సందర్శించడానికి పుట్టపర్తి వెళ్లారు. అక్కడ ఈయనను ఆహ్వానించడానికి పలువురు స్థానికులు, ఆశ్రమ అధికారులు బొకేలు ఇచ్చి వీరికి ఆహ్వానం పలికారు. ఆ సమయంలో తీసుకున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. దాంతో ఆ ఫోటోలలో విజయ్ దేవరకొండ చేతికి ఉన్న ఉంగరం స్పష్టంగా కనిపించింది. అప్పుడే విజయ్ దేవరకొండ తన చేతి వేలికి ఉన్న ఉంగరంతో ఎంగేజ్మెంట్ కన్ఫామ్ చేశారు. ఇప్పుడు రష్మిక కూడా రింగ్తో కనిపించేసరికి ఇక ఎంగేజ్మెంట్ అయిపోయింది అంటూ అందరూ నిర్ధారణకు వచ్చేస్తున్నారు.
ఎంగేజ్మెంట్ ఎలాగో అయిపోయింది కాబట్టి పెళ్లి కూడా త్వరగా చేసుకోండి అని అభిమానులు సలహాలు ఇస్తున్నారు. ఇదిలా ఉండగా 2026 ఫిబ్రవరి నెలలో మాఘమాసంలో వీరి వివాహం జరగబోతున్నట్లు సమాచారం. ఏది ఏమైనా ఎన్నో రోజులుగా ఈ జంట పెళ్లి చేసుకోవాలని అభిమానులు ఎంతో కోరారు. ఇక వారి కోరికను నిజం చేస్తూ ఈ జంట వచ్చే ఏడాది ఏడడుగులు వేయబోతున్నారు.
also read:Bigg Boss 9 Promo : భరణి గెట్ అవుట్ ఫ్రం హౌస్… హీటెక్కిన వీకెండ్ ఎపిసోడ్
?utm_source=ig_web_copy_link