Rashi Khanna: రాశి ఖన్నా (Rashi Khanna) ప్రస్తుతం తెలుసు కదా(Telusukada) సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో ఎంతో బిజీగా ఉన్నారు. సిద్దు జొన్నలగడ్డ(Siddu Jonnalagadda) హీరోగా రాశిఖన్నా, నేహా శెట్టి (Neha Shetty)హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ సినిమా దీపావళి పండుగను పురస్కరించుకొని అక్టోబర్ 17 వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇక ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా నటి రాశిఖన్నా తన లవ్ స్టోరీ గురించి ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు.
నటి రాశి ఖన్నా రిలేషన్ గురించి తరచూ ఇండస్ట్రీలో వార్తలు వినపడుతూనే ఉన్నాయి. అయితే తాజాగా ఈమె తన లవ్ రిలేషన్ గురించి ఓపెన్ కావడమే కాకుండా తనకు ఒకటి కాదు ఏకంగా రెండు లవ్ స్టోరీలు ఉన్నాయి అంటూ అందరికీ షాక్ ఇచ్చారు. ఈ సందర్భంగా లవ్ రిలేషన్ గురించి రాశి ఖన్నా మాట్లాడుతూ..ప్రేమ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటుంది. నా జీవితంలో కూడా ప్రేమ అనుభవాలు ఉన్నాయని తెలిపారు. నేను నా జీవితంలో రెండుసార్లు ప్రేమలో పడ్డానని, మొదటిది సినిమా ఇండస్ట్రీలోకి రాకముందు, రెండోది సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ప్రేమలో పడ్డానని తెలిపారు. మరి ఆ ప్రేమ కొనసాగుతుందా లేదా అనేది చూడాలి అంటూ ఈమె తన ప్రేమ గురించి మాట్లాడటంతో ఈ వ్యాఖ్యలు కాస్త వైరల్ అవుతున్నాయి.
ఇక రాశిఖన్నా తన లవ్ స్టోరీ గురించి మాట్లాడటంతో.. ఈమె ప్రేమలో ఉందని తెలియడంతో ఆ వ్యక్తి ఎవరు? ఏంటీ? అంటూ సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. మరి ఈమె పూర్తి లవ్ స్టోరీ తెలియాలి అంటే అన్ని విషయాలు స్వయంగా రాసి ఖన్నా వెల్లడించాల్సి ఉంటుంది. ఇక తెలుసు కదా సినిమా విషయానికి వస్తే ఈ సినిమా నుంచి ఇది వరకు విడుదల చేసిన అప్డేట్స్ అన్ని సినిమా పట్ల మంచి అంచనాలనే పెంచేసాయి. ఇక ఈ సినిమా ట్రయాంగిల్ లవ్ స్టోరీగా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని స్పష్టమవుతుంది.
దర్శకురాలిగా కాస్ట్యూమ్ డిజైనర్..
ఇక ఈ సినిమాకు ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన దర్శకురాలిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇలా తన తొలి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈమె ఎలాంటి సక్సెస్ అందుకుంటారో తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇక ఈ సినిమా పై నటుడు సిద్దు జొన్నలగడ్డ ఎంతో ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల జాక్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి డిజాస్టర్ సినిమాని తన ఖాతాలో వేసుకున్నారు. తెలుసు కదా సినిమా మాత్రం ఎంతో విభిన్నంగా ఉండబోతుందని కచ్చితంగా ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని సిద్దు జొన్నలగడ్డ వెల్లడించారు. మరి ఈ సినిమా ద్వారా ఈయన ఎలాంటి సక్సెస్ అందుకుంటారో తెలియాల్సి ఉంది.
Also Read: Priyanka Arul Mohan: పద్ధతి మార్చుకోండి.. హాట్ ఫోటోలపై ఫైర్ అయిన ప్రియాంక మోహన్!