BSNL Offer: బీఎస్ఎన్ఎల్, భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ అంటే మనందరికీ తెలిసిన ప్రభుత్వ టెలికాం సంస్థ. ఈ సంస్థ ప్రైవేట్ కంపెనీల పోటీలో నిలబడటానికి తరచూ కొత్త కొత్త ఆఫర్లు విడుదల చేస్తూ కస్టమర్లను ఆకర్షించడానికి ప్రయత్నిస్తోంది. ఇప్పుడు తాజాగా బీఎస్ఎన్ఎల్ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఇందులో వినియోగదారులకు తక్కువ ధరలో ఎక్కువ సదుపాయాలు లభిస్తున్నాయి.
తక్కువ రీచార్జ్.. ఎక్కువ బెనిఫిట్స్
బీఎస్ఎన్‌ఎల్ వినియోగదారులకు అందుబాటులో తీసుకువచ్చిన ప్లాన్ రూ.199. ఈ ప్లాన్ నెల రోజుల పాటు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. ఈ ప్లాన్‌తో దేశంలో ఎక్కడికైనా ఎలాంటి అదనపు చార్జీలు లేకుండా మాట్లాడొచ్చు. రోజుకు 2జిబి వరకు డేటా వాడుకునే అవకాశం ఉంది. 2జిబి పూర్తయిన తర్వాత స్పీడ్ కొంచెం తగ్గినా కనెక్షన్ మాత్రం కొనసాగుతుంది. అదనంగా రోజుకు 100 ఎస్ఎంఎస్ పంపే సౌకర్యం కూడా ఉంది. ఈప్లాన్‌ను మొత్తంగా చూస్తే ఒక్కసారి రీచార్జ్ చేస్తే నెలంతా నిశ్చింతగా నెట్ వాడుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు.
తగ్గేదే లే అంటున్న బీఎస్ఎన్ఎల్
ఇప్పుడు ప్రస్తుత మార్కెట్లో జియో, ఎయిర్‌టెల్, విఐ లాంటి సంస్థలు కూడా ఇలాంటి ఆఫర్లు ఇస్తున్నాయి. అయినా, బీఎస్ఎన్ఎల్ మాత్రం తక్కువ ధరలో అదే సదుపాయాలను అందిస్తోంది. అంతేకాదు గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్ బలంగా ఉండటంతో అక్కడి ప్రజలు ఈ సంస్థ సేవలపైనే ఆధారపడుతున్నారు. కేవలం రూ.199 ప్లాన్ మధ్య తరగతి వినియోగదారులకు సరైన ఆప్షన్‌గా నిలుస్తోంది. అంతేకాదు, రోజువారీ డేటా వినియోగం ఎక్కువగా ఉన్నవారికి ఇది మరింత ప్రయోజనకరం.
Also Read: Jio vs Airtel: జియో వర్సెస్ ఎయిర్‌టెల్.. 84 రోజుల రీచార్జ్ ప్లాన్‌లో ఎవరు బెస్ట్?
బీఎస్ఎన్ఎల్ మరో ప్లాన్ ఇదే!
ఇంకా తక్కువ బడ్జెట్ ఉన్నవారికి బీఎస్ఎన్ఎల్ మరో ఆకర్షణీయమైన ప్లాన్‌ను అందిస్తోంది. రూ.107 ప్లాన్‌లో 35 రోజుల వాలిడిటీతో పాటు 200 నిమిషాల వాయిస్ కాలింగ్ సదుపాయం, అలాగే 3జిబి డేటా కూడా అందిస్తోంది. ఈ ప్లాన్ తక్కువగా నెట్ వాడే, కానీ మాట్లాడే అవసరం ఉన్నవారికి అనువుగా ఉంటుంది.
రోమింగ్ ఛార్జీలు తక్కువ
బీఎస్ఎన్ఎల్ ప్లాన్‌ల ప్రత్యేకత ఏమిటంటే రోమింగ్ ఛార్జీలు తక్కువగా ఉండటం. ఎక్కడికైనా ప్రయాణం చేసినా టారిఫ్ మారదు. ప్రభుత్వ సంస్థ కావడం వలన నెట్‌వర్క్ స్టాబిలిటీ కూడా బాగుంటుంది. ప్రైవేట్ కంపెనీలతో పోలిస్తే తక్కువ ధరలో సేవలు అందించడం వల్ల చిన్న పట్టణాలు, గ్రామాల్లో ప్రజలు ఇప్పటికీ బీఎస్ఎన్ఎల్ పైనే ఆధారపడుతున్నారు.
ఇప్పటికే 4జి సేవలను
ఇక భవిష్యత్తులో బీఎస్ఎన్ఎల్ తన 4జి, 5జి సేవలను దేశవ్యాప్తంగా విస్తరించడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో 4జి సేవలను ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. త్వరలోనే దేశమంతా 4జి అందుబాటులోకి వస్తుందని సంస్థ ప్రకటించింది. అది ప్రారంభమైతే ప్రైవేట్ కంపెనీలకు గట్టి పోటీగా మారే అవకాశం ఉంది. బడ్జెట్ ప్లాన్‌లు కూడా అందుబాటులో ఉండటంతో ప్రతి ఒక్కరికి మంచి ఆప్షన్ బీఎస్ఎన్ఎల్‌లో లభిస్తోంది.