Priyanka Arul Mohan: ఇటీవల కాలంలో టెక్నాలజీ బాగా పెరిగింది అంటూ సంతోషపడాలో లేకపోతే పెరిగిన టెక్నాలజీ కారణంగా జరుగుతున్న సంఘటనలు చూసి బాధపడాలో అర్థం కాని విషయం. ఇటీవల ఎ ఐ టెక్నాలజీ(AI Technology) అందుబాటులోకి వచ్చిన తర్వాత చాలా పనులు ఎంతో సునాయసంగా మారిపోతున్నాయి. ఈ తరుణంలోనే ఈ టెక్నాలజీ ద్వారా మరికొంతమంది ఇబ్బందులను కూడా ఎదుర్కొంటున్నారు. ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కొనే వారిలో సినిమా సెలబ్రిటీలు అధికంగా ఉన్నారు. సోషల్ మీడియాలో సినిమా సెలబ్రెటీలు చాలా యాక్టివ్ గా ఉంటూ వారికి సంబంధించిన ఎన్నో ఫోటోలను షేర్ చేస్తూ ఉంటారు.
ఇక ఏఐ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత సెలబ్రెటీలు నిజంగానే ఆ ఫోటోలను షేర్ చేశారా ?లేకపోతే అది ఏఐ జనరేటర్ ఫోటోలా? అనే సందిగ్ధంలో అభిమానులు ఉన్నారు.. సెలబ్రిటీల ప్రమేయం లేకుండా ఏఐతో జనరేట్ చేసిన హీరోయిన్ల బోల్డ్ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో అభిమానులు షాక్ అవుతున్నారు. ఇలా ఈ ఫోటోలు పై సదరు సెలబ్రిటీలు స్పందిస్తే తప్ప అది నిజమా కాదా అని తెలియడం లేదు. తాజాగా నటి ప్రియాంక అరుళ్ మోహన్(Priyanka Arul Mohan) కి సంబంధించిన కొన్ని హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఏఐ జనరేటర్ బాత్ రూమ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఈ ఫోటోలు పై ప్రియాంక స్పందించారు.
ఈ సందర్భంగా ఈమె ఇంస్టాగ్రామ్ స్టోరీ ద్వారా ఈ ఫోటోలపై స్పందిస్తూ.. ఏఐ ద్వారా తనని తప్పుగా చిత్రీకరిస్తూ కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. దయచేసి ఇలాంటి వాటిని ఆపేయండి. ఏఐ టెక్నాలజీ ద్వారా మంచి సృజనాత్మకత కోసం, నైపుణ్యాన్ని పెంపొందించుకోవడం కోసం ఉపయోగించండి కానీ ఇలాంటి తప్పుడు సమాచారం కోసం కాదు అంటూ ఈమె తన ఏఐ జనరేటెడ్ ఫోటోలపై కాస్త ఆగ్రహం వ్యక్తం చేస్తూ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.ప్రియాంక ఈ విధమైనటువంటి పోస్ట్ చేయడంతో ఎంతోమంది అభిమానులు కూడా ఈమెకు మద్దతుగా కామెంట్లు చేస్తున్నారు.
మరోసారి నానికి జోడిగా…
ప్రియాంక అరుళ్ మోహన్ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కువగా వినపడుతున్న పేరు. ఇటీవల పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఓజి సినిమాలో కన్మణి పాత్ర ద్వారా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈమెకు తెలుగులో కూడా వరుసగా అవకాశాలు క్యూ కడుతున్నాయి. త్వరలోనే సుజిత్ , నాని కాంబినేషన్లో రాబోతున్న బ్లడీ రోమియో సినిమాలో కూడా హీరోయిన్ గా నటించే ఛాన్స్ అందుకున్నారని తెలుస్తుంది. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ పనులు ప్రారంభం కానున్నాయి. ఇదివరకే పూజా కార్యక్రమాలు ఎంతో ఘనంగా జరిగాయి. ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలను చిత్ర బృందం అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. ఇదివరకే ప్రియాంక నానితో కలిసి గ్యాంగ్ లీడర్, సరిపోదా శనివారం వంటి సినిమాలలో నటించారు