BigTV English

Puri Sethupathi: ఆగిపోయిన పూరీ-సేతుపతి.. నిర్మాణ సంస్థ క్లారిటీ!

Puri Sethupathi: ఆగిపోయిన పూరీ-సేతుపతి.. నిర్మాణ సంస్థ క్లారిటీ!
Advertisement

Puri Sethupathi:టాలీవుడ్ ఇండస్ట్రీలో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న పూరీ జగన్నాథ్ (Puri Jagannath)కి ఒకప్పుడు ఎంతటి క్రేజ్ ఉండేదో చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు స్టార్ దర్శకులలో ఒకరిగా పేరు తెచ్చుకున్న పూరీ జగన్నాథ్ ప్రస్తుతం చేసే సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆడడం లేదు. దాంతో ఆయనతో సినిమాలు చేయడానికి కూడా స్టార్ హీరోలు వెనకడుగు వేస్తున్నారు.. రవితేజ, మహేష్ బాబు,ఎన్టీఆర్, ప్రభాస్ లాంటి హీరోలను స్టార్లుగా మలిచిన పూరీ జగన్నాథ్ ప్రస్తుతం వరుస ఫ్లాపులు ఎదుర్కొంటున్నారు అయితే అలాంటి పూరీ జగన్నాథ్ గురించి తాజాగా ఒక వార్త వైరల్ అవుతోంది. కానీ ఆ వార్త నిజం కాదు.. అదంతా ఫేక్ రూమర్ నమ్మకండి అంటూ పూరి జగన్నాథ్ టీం కొట్టి పారేసింది. మరి ఇంతకీ పూరీ జగన్నాథ్ మీద వైరల్ అవుతున్న ఆ వార్త ఏంటి అనేది చూస్తే..


ఆగిపోయిన పూరీ సేతుపతి మూవీ..

తాజాగా పూరీ జగన్నాథ్ తమిళ నటుడు విజయ్ సేతుపతి (Vijay Sethupathi) తో ఓ సినిమా చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. #పూరీసేతుపతి అనే టైటిల్ తో వస్తున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా పూరీ జగన్నాథ్ పై ఒక రూమర్ వైరల్ అవుతుంది. అదేంటంటే.. పూరీజగన్నాథ్ పూరీ సేతుపతి ప్రాజెక్టును చేస్తూనే వేరే హీరోలతో చర్చలు జరుపుతున్నట్టు కొన్ని ఫేక్ వార్తలు వైరల్ అవుతున్నాయి. పూరీ సేతుపతి సినిమా కంటిన్యూ చేస్తూనే.. మరి కొంతమంది హీరోలతో చర్చలు జరుపుతున్నారని .. మరొకవైపు ఈ సినిమా హీరో విజయ్ సేతుపతి తమిళ్ బిగ్ బాస్ సీజన్ కి హోస్ట్ గా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఈ సినిమాను ఆపేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

క్లారిటీ ఇచ్చిన యూనిట్..

దీంతో అభిమానులు కూడా పలు రకాల కామెంట్లు చేస్తున్న నేపథ్యంలో తాజాగా ఈ విషయంపై పూరీ జగన్నాథ్ చిత్ర బృందం స్పందించింది. పూరీ జగన్నాథ్ తన కాన్సన్ట్రేషన్ మొత్తం పూరీ సేతుపతి సినిమా పైనే పెట్టారు. ఆయన ఇతర ఏ హీరోలతో కూడా సినిమా గురించి చర్చించడం లేదు. ఇతర ప్రాజెక్టులను చేయడం లేదు. అదంతా అవాస్తవం. పూరీ జగన్నాథ్ ఇతర ప్రాజెక్టులు చేస్తున్నారనే వార్తలను ఎవరు నమ్మవద్దు. వాటిని స్ప్రెడ్ చేయవద్దు. అవన్నీ నిరాధారమైనటువంటి వార్తలు. దయచేసి వాటిని నమ్మకండి అంటూ పూరీ జగన్నాథ్ టీం ఈ వార్తలను ఖండించింది. అలా చాలా రోజులుగా పలు వెబ్ పోర్టల్స్ లో పూరీ జగన్నాథ్ గురించి వస్తున్న రూమర్స్ పై ఎట్టకేలకు పూరీ జగన్నాథ్ టీం స్పందించి క్లారిటీ ఇచ్చింది.. అంతేకాదు పూరి జగన్నాథ్ కి సంబంధించినటువంటి ఎలాంటి అఫీషియల్ ప్రకటన అయినా సరే పూరి కనెక్ట్స్ ద్వారా మాత్రమే బయట పడుతుందని వారు వెల్లడించారు. దాంతో అందరికీ ఓ క్లారిటీ వచ్చింది. ఇక ఇప్పటికైనా ఈ రూమర్స్ ఆగుతాయేమో చూడాలి. ఇకపోతే ఈ చిత్రాన్ని పూరీ కనెక్ట్స్ బ్యానర్ పై పూరీ జగన్నాథ్ తో పాటు ఛార్మీ కౌర్ సంయుక్తంగా నిర్మిస్తోంది.


also read: The Girl friend: ట్రైలర్ ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే?

Related News

Upasana -Ramcharan: కవల పిల్లలకు జన్మనివ్వబోతున్న ఉపాసన.. పోస్ట్ వైరల్!

Dude Movie: 100 కోట్ల క్లబ్ లో చేరిన ప్రదీప్ డ్యూడ్.. ముచ్చటగా మూడోసారి!

OG Collections: ముగిసిన థియేట్రికల్ రన్.. ఓజీ టోటల్ కలెక్షన్స్ ఎంతంటే?

RGV : సీడీ లు అమ్ముకునే నేను అలా డైరెక్టర్ అయ్యాను

Yellamma Movie: ఎల్లమ్మకు బడ్జెట్ చిక్కు.. దిల్ రాజు వెనకడుగు?

SYG : సినిమా నిర్మించడానికి అష్ట కష్టాలు, మళ్లీ డిస్ట్రిబ్యూషన్ మీద ఆశలు

Fauzi Movie: ప్రభాస్ ఫౌజీలో మరో ముద్దుగుమ్మ.. లక్కీ ఛాన్స్ కొట్టేసిన నటి!

Big Stories

×