Jio Bumper Offer: ప్రతి రోజు పనిబారి తర్వాత మనకు కావలసింది ఒక్కటే… కాస్త రిలాక్స్ టైమ్. టీవీలో లైవ్ స్పోర్ట్స్ చూడాలి, సినిమాలు చూడాలి, లేదా ఫ్యామిలీతో సిట్ అయ్యి ఫేవరెట్ సీరీస్ బింజ్ చూడాలి. కానీ వీటన్నీ ఒకే చోట, అదీ తక్కువ ఖర్చుతో వస్తే ఎంత బాగుంటుంది అనిపించిందా? అచ్చం అదే జరగబోతోంది ఇప్పుడు! ఎందుకంటే జియో తీసుకొచ్చింది ఓ కొత్త సూపర్ ఆఫర్ జియో ప్లస్ హాట్‌స్టార్ కాంబో ప్యాక్ కేవలం రూ.949కే!
మొత్తం 84 రోజులపాటు
ఈ రూ.949 రీచార్జ్ ప్యాక్ చేస్తే మొత్తం 84 రోజులపాటు అంటే దాదాపు మూడు నెలలు, ప్రతి రోజు 2జిబి డేటా ఇస్తారు. అంటే మీరు సినిమాలు, స్పోర్ట్స్, యూట్యూబ్ లేదా సోషల్ మీడియా ఎంతైనా ఉపయోగించవచ్చు. అదనంగా, ఈ ప్యాక్‌తోనే మీకు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఫ్రీ! అంటే ఇక లైవ్ స్పోర్ట్స్ కోసం వేరే సబ్‌స్క్రిప్షన్ కొనాల్సిన అవసరం లేదు. మీరు క్రికెట్ ప్రేమికులా? కబడ్డీ అభిమానులా? లేదా సినిమాలు, వెబ్ సిరీస్‌లకు బోలెడంత ఇష్టమా? మీకు కావలసిన అన్నీ ఒకే రీచార్జ్‌లో దొరుకుతున్నాయి.
బఫరింగ్ లేకుండా క్లారిటీ స్ట్రీమ్
ఇప్పుడే హాట్‌స్టార్‌లో ప్రో కబడ్డీ లీగ్ జోష్ మీద సాగుతోంది. ప్రతి రోజు సాయంత్రం 7:30కి లైవ్ మ్యాచ్‌లు జరుగుతాయి. ఆ యాక్షన్, ఆ ఉత్సాహం నేరుగా మీ మొబైల్ స్క్రీన్‌లో చూసేయొచ్చు. పెద్ద స్క్రీన్ కావాలంటే టీవీకి కాస్ట్ చేసుకోవచ్చు. జియో డేటా స్పీడ్‌తో ఎలాంటి బఫరింగ్ లేకుండా క్లారిటీగా స్ట్రీమ్ అవుతుంది.
Also Read: Vamu Water Benefits: ఖాళీ కడుపుతో వాము నీరు తాగితే ఈ మార్పులు గ్యారంటీ.. రిజల్ట్ చూసి ఆశ్చరపోతారు
ఎవరికి ఉపయోగం
ఈ ఆఫర్ ఎవరికి ఉపయోగపడుతుంది అంటే, చాలా మంది రోజూ స్పోర్ట్స్ చూడటానికి లేదా సినిమాలు బింజ్ వాచ్ చేయటానికి వేరే సబ్‌స్క్రిప్షన్లు తీసుకుంటారు. వాటన్నింటిని వేరుగా కొనడం కంటే, ఒక్క రీచార్జ్‌తోనే అన్ని లభిస్తే సౌకర్యం కదా! విద్యార్థులు, ఉద్యోగులు, హోమ్‌మేకర్స్ ఎవరికైనా ఇది పర్ఫెక్ట్ ప్యాక్.
బెనిఫిట్ ఏమైనా ఉన్నాయా?
ఇక జియో కస్టమర్లకు మరో బెనిఫిట్ కూడా ఉంది. ఈ రూ.949 ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ కాలింగ్, 100 ఎస్ఎంఎస్‌లు ప్రతీ రోజు, 2జిబి హై స్పీడ్ డేటా ఉంటాయి. డేటా అయిపోయిన తర్వాత కూడా లో స్పీడ్‌లో బ్రౌజింగ్ కొనసాగుతుంది. కాబట్టి పని ఆగదు, ఎంటర్‌టైన్‌మెంట్ ఆగదు. ఇంకా ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే మీరు నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ లాంటి యాప్స్ కంటే తక్కువ ధరలో ఎక్కువ కంటెంట్ పొందుతున్నారు. ప్రస్తుతానికి మార్కెట్లో ఇంత పూర్తి ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాక్ ఉన్న మరో టెలికామ్ లేదు. జియో ఈ ఆఫర్‌తో మరోసారి బడ్జెట్ యూజర్ల హృదయాన్ని గెలుచుకుంది. కేవలం రూ.949తో మూడు నెలలపాటు డేటా, లైవ్ స్పోర్ట్స్, సినిమాలు ఇవన్నీ ఒకే సారి ఇస్తుంది.
ఈ ఆఫర్ ఎలా పొందాలి?
మీరు మై జియో యాప్ ఓపెన్ చేయండి. రీచార్జ్ సెక్ట్‌లోకి వెళ్లి రూ.949 ప్యాక్‌ను సెలెక్ట్ చేయండి. చెల్లింపు పూర్తయ్యాక మీ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఆటోమేటిక్‌గా యాక్టివేట్ అవుతుంది. తర్వాత మీరు హాట్‌స్టార్ యాప్ ఓపెన్ చేసి, జియో నంబర్‌తో లాగిన్ అయితే, ప్రీమియం కంటెంట్ అన్నీ ఓపెన్ అవుతాయి. మరి మీరు కూడా వెంటనే రూ. 949 ప్యాక్ రీచార్జ్ చేసుకుని, మీ ఫేవరెట్ షోలు, మ్యాచ్‌లు ఎంజాయ్ చేయండి.