Actress Son Death: ఇటీవల కాలంలో ఇండస్ట్రీలో వరుస వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా తమిళ ఇండస్ట్రీలో సంగీత దర్శకుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సబేష్(Sabesh) నేడు ఉదయం మరణించారు. గత కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సభేష్ మరణ వార్త తమిళ చిత్ర పరిశ్రమను విషాదంలోకి నెట్టి వేసింది అయితే ఈయన మరణ వార్త మరిచిపోక ముందే మరొక నటి కుమారుడు కూడా మరణించడంతో ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. తమిళ చిత్ర పరిశ్రమలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో దివంగత నటి మనోరమ (Manorama)ఒకరు.
మనోరమ ఎన్నో తమిళ తెలుగు సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. అరుంధతి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల మదిలో నిలిచిపోయిన మనోరమ గత కొంతకాలం క్రితం అనారోగ్య సమస్యలతో మరణించారు. అయితే తాజాగా ఈమె కుమారుడు నటుడు భూపతి (Bhupathi)కూడా మరణించారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న భూపతి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఈయన మరణించారు. ఇక ఈయన మరణ వార్త తెలిసిన పలువురు తమిళ నటీనటుల ఈయన మృతి పట్ల సంతాపం తెలియజేస్తున్నారు. భూపతి మనోరమ కుమారుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి పలు తమిళ సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు.
భూపతి ఎక్కువగా మద్యం సేవించడం వల్లే అనారోగ్య సమస్యలు తలెత్తాయని తెలుస్తోంది. ఈ అనారోగ్య సమస్యల కారణంగానే మరణించినట్లు ఆయన కుటుంబ సభ్యులు తన మరణం పట్ల అధికారక ప్రకటన వెల్లడించారు. ఈ విషయం తెలిసిన అభిమానులు కూడా సోషల్ మీడియా వేదికగా ఈయనకు సంతాపం తెలియజేస్తున్నారు. అయితే గతంలో కూడా ఈయన ఓసారి ఆత్మహత్య ప్రయత్నం చేసిన సంఘటన తెలిసిందే. కరోనా సమయంలో లాక్డౌన్ కారణంగా అందరూ ఇంటికి పరిమితం కావలసి వచ్చింది. లాక్ డౌన్ సమయంలోనే ఈయన నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేశారని అప్పట్లో వార్తలు వచ్చాయి.
గిన్నిస్ బుక్ లో చోటు..
ఇలా మద్యానికి ఎక్కువగా బానిస కావటం వల్లే అనారోగ్య సమస్యలు బారిన పడి మరణించారని తెలుస్తోంది. ఇక మనోరమ విషయానికి వస్తే ఈమె కూడా అనారోగ్య సమస్యల కారణంగా 2015 వ సంవత్సరంలో మరణించారు. నటన పరంగా ఎన్నో అద్భుతమైన, అత్యధిక సినిమాలలో నటించిన నటిగా ఈమె గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో కూడా చోటు సొంతం చేసుకున్నారు. ఇక తెలుగులో కూడా సుమారు 25 కి పైగా సినిమాలలో మనోరమ నటించారు. బొమ్మలాట, భద్రకాళి, శుభోదయం, అల్లరి ప్రియుడు, సింహం, యముడు, అరుంధతి, అరుణాచలం, బావ నచ్చాడు, సాంబయ్య వంటి తదితర సినిమాలలో నటించి తెలుగులో కూడా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. అరుంధతి, యముడు సినిమాలో ఈమెకు తెలుగులో మంచి గుర్తింపును తీసుకువచ్చాయి.
Also Read: Upasana – Ramcharan : మెగా కంపౌండ్‌లో డబుల్ కన్ఫ్యూజన్.. ఈ పజిల్ వెనుక రహస్యం ఏంటి ?