అంతర్జాతీయ మార్కెట్ లో భారీగా బంగారం, వెండి ధరలు భారీగా పతనం అయ్యాయి. ఔన్స్ బంగారం ధర 220 డాలర్లు తగ్గింది. ప్రస్తుతం 4,122 డాలర్లకు దిగొచ్చింది. భారత కరెన్సీలో తులం బంగారం ధర రూ. 7 వేలు పతనం అయ్యే అవకాశం ఉంది. అటు వెండి ఔన్స్ ధర 48.39 డాలర్లు తగ్గింది. బంగారం, వెండి ధరలు 2013 తర్వాత ఈ స్థాయిలో తగ్గడం ఇదే తొలిసారి కావడం విశేషం.
ఇవాళ బంగార ధర విషయానికి వస్తే, ప్రారంభ ట్రేడింగ్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.10 తగ్గి, 10 గ్రాముల ధర రూ.1,27,200కి చేరుకుందని గుడ్ రిటర్న్స్ వెబ్ సైట్ వెల్లడించింది. వెండి ధర రూ. 100 తగ్గి, కిలో ధర రూ.1,63,900 పలుకుతుంది. 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.10 తగ్గి, 10 గ్రాముల ధర రూ.1,16,600 పలుకుతుంది.
⦿ ముంబై, కోల్ కతాలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,27,200 ఉండగా, చెన్నైలో రూ. 1,27,420 పలుకుతుంది.
⦿ ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,27,350గా ఉంది.
⦿ ముంబైలో10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,16,600గా ఉంది.
⦿ కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్, చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,16,800గా ఉంది.
⦿ ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,16,750గా ఉంది.
⦿ ఢిల్లీ, కోల్ కతా, ముంబైలలో ఒక కిలో వెండి ధర రూ. 1,63,900గా ఉంది.
⦿ చెన్నైలో ఒక కిలో వెండి ధర రూ.1,81,900 పలుకుతుంది.
ఇవాళ అమెరికా బంగారం ధరలు మరింత తగ్గాయి. అమెరికా-చైనా వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పడతాయనే సంకేతాల నేపథ్యంలో స్పాట్ బంగారం 0.4 శాతం తగ్గి ఔన్సుకు 4,109.19 డాలర్లుగా ఉంది. ఆగస్టు 2020 తర్వాత బులియన్ మంగళవారం 5 శాతానికి పైగా పడిపోయింది. డిసెంబర్ డెలివరీ కోసం US గోల్డ్ ఫ్యూచర్స్ 0.4 శాతం పెరిగి ఔన్సుకు 4,124.10 డాలర్లుగా ఉంది. మిగతా చోట్ల స్పాట్ సిల్వర్ 0.1 శాతం పెరిగి ఔన్సుకు 48.82గా డాలర్లుగా ఉంది. ప్లాటినం 1.5 శాతం తగ్గి 1,528.15గా డాలర్లుగా ఉంది.
Read Also: 2.5 బిలియన్ డాలర్లతో అమెజాన్ సెటిల్మెంట్, యూజర్లు డబ్బులు ఎలా పొందాలంటే?