ఈ పండుగ సీజన్ కోసం BSNL కొత్త ఆఫర్‌ను ప్రకటించింది. ప్రత్యేకంగా కొత్త సీనియర్ సిటిజన్ వినియోగదారుల కోసం ఈ అద్భుతమైన ఆఫర్ ను పరిచయం చేసింది. ఈ ఆఫర్ కింద రీఛార్జ్ చేసుకున్న వినియోగదారులు 365 రోజుల పాటు సర్వీసులు పొందే అవకాశం ఉంటుంది. ఈ ప్యాకేజీలో 2GB రోజువారీ డేటా, అపరిమిత కాలింగ్, రోజుకు 100 SMS, ఉచిత సిమ్, 6 నెలల BiTV సబ్ స్క్రిప్షన్ లాంటి బెనిఫిట్స్ ఉన్నాయి.
పండుగ సందర్భంగా BSNL తీసుకొచ్చిన సమ్మాన్ ప్లాన్ ధర కేవలం రూ. 1812గా నిర్ణయించింది. అంటే, నెలకు దాదాపు రూ.149. ఈ ఆఫర్ అక్టోబర్ 18న అందుబాటులోకి రాగా, నవంబర్ 18, 2025 వరకు చెల్లుబాటు అవుతుంది. కొత్త సీనియర్ సిటిజన్ వినియోగదారులకు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది.
అటు BSNL దీపావళి బొనాంజా అనే మరో పండుగ ఆఫర్ ను కూడా ప్రవేశపెట్టింది. ఈ ఆఫర్ కొత్త వినియోగదారుల కోసం అందబాటులోకి తెచ్చింది. దీనికి ఎలాంటి వయోపరిమితి లేదు. ఈ ఆఫర్ కింద.. వినియోగదారులు కేవలం 1 రూపాయితోని నెల రోజుల పాటు 4G సేవలను పొందే అవకాశం కల్పిస్తోంది. ఈ ప్లాన్ లో అపరిమిత కాల్స్, 2GB రోజువారీ డేటా, 100 SMS, ఉచిత సిమ్ కూడా ఉన్నాయి. ఈ ప్లాన్ వినియోగదారులు BSNL దేశీయంగా అభివృద్ధి చేసిన 4G నెట్ వర్క్ ను పొందేందుకు అవకాశం కల్పిస్తుంది.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ ఏడాది సెప్టెంబర్ 27న దేశ వ్యాప్తంగా BSNL 4G నెట్ వర్క్ ను ప్రారంభించారు. అప్పటి నుంచి BSNL తన నెట్ వర్క్ ను శరవేగంగా విస్తరిస్తుంది. ఇప్పటి వరకు ఏకంగా 98,000 సైట్ లకు విస్తరించింది. ఇది అన్ని రాష్ట్రాలలో హై స్పీడ్ కనెక్టివిటీని అందుబాటులోకి తెచ్చింది. BSNL ఇప్పుడు ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లతో నేరుగా పోటీపడుతుంది. దేశ వ్యాప్తంగా బలమైన 4G కవరేజీని అందిస్తుంది.
Read Also: 2.5 బిలియన్ డాలర్లతో అమెజాన్ సెటిల్మెంట్, యూజర్లు డబ్బులు ఎలా పొందాలంటే?
ఈ దీపావళి సందర్భంగా సీనియర్ సిటిజన్ అయినా, కొత్త వినియోగదారు అయినా ఈ BSNL ఆఫర్లు మీకు హై క్వాలిటీ 4G ఎక్స్ పీరియెన్స్ అందించనుంది. అంతేకాదు, బడ్జెట్ లోనే వినోదాన్ని అందించనుంది. ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఈ రీఛార్జ్ చేసుకుని, ఎంజాయ్ చేయండి!
Read Also: బంగారం ధర భారీగా పతనం, ఒకే రోజు రూ. 7 వేలు తగ్గుదల, అదే బాటలో వెండి కూడా!