Gold Rate Today: అంతర్జాతీయ పరిణామాల ప్రభావం బులియన్ మార్కెట్‌పై స్పష్టంగా కనిపిస్తోంది. ఫలితంగా బంగారం ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. తాజాగా బంగారం ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. ఆషాడంలో పసిడి కొనుగోలు చేయాలనుకునేవారికి ఇదొక షాక్. ఎందుకంటే ఫెడ్ ప్రభావం మార్కెట్ పై స్పష్టంగా కనబడుతోంది.
పెరిగిన బంగారం ధర-బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ఊహించని షాక్. మార్కెట్లో రెండో రోజూ ధరలు ఒక్కసారిగా పెరిగాయి. అమెరికా ఫెడ్.. వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ప్రకటన చేసింది. దీంతో బులియన్ మార్కెట్లో ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. ఫలితంగా బంగారం ధరలు మళ్లీ ఆకాశాన్ని తాకాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం మొదలైంది.
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. ఫెడ్ వడ్డీ రేట్ల ప్రకటన తర్వాత స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు 44 డాలర్ల మేరా పెరిగింది. ప్రస్తుతం ఔన్స్ బంగారం ధర 4083 డాలర్ల వద్ద ట్రేడింగ్ అవుతోంది. స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 1.47 శాతం పెరిగి 59 డాలర్ల స్థాయిలో ట్రేడవుతోంది.
తెలుగు రాష్ట్రాల ధరలు ఎలా ఉన్నాయి? వడ్డీ రేట్ల వ్యవహారం, ను పెంచుతారనే అంచనాలు మధ్య తలకిందులు కావడం, పశ్చిమాసియాలో అనిశ్చితులు కొనసాగుతుండడంతో మదుపరులు బంగారం వైపు మొగ్గుచూపారు. ఫలితంగా మార్కెట్లో పసిడి ధరలు పెరిగాయి. తెలుగు రాష్ట్రాలతోపాటు దేశంలోని ప్రధాన నగరాల్లో శుక్రవారం బంగారం, వెండి ధరలను ఒక్కసారి పరిశీలిద్దాం.
హైదరాబాద్ బంగారం మార్కెట్లో ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ఈ వారం ఆరంభంలో మూడు రోజులు తగ్గిన బంగారం ధరలు, గురువారం-శుక్రవారాల్లో సుమారు రూ.2000 మేరా పెరిగింది. 22 క్యారెట్ల బంగారం ధర ఇవాళ రూ. 750 మేరా పెరిగింది. ప్రస్తుతం తులం రూ.1,32,300 స్థాయికి చేరింది. 24 క్యారెట్ల బంగారం రేటు రూ.820 మేరా పెరిగింది. తులం ధర రూ.1,44,330 వద్ద కొనసాగుతోంది.
ALSO READ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సాలరీ పెరిగేది అప్పుడే.. 8వ పే కమిషన్ అప్‌డేట్ ఇదిగో
ఏపీ ప్రధాన వాణిజ్య నగరం విజయవాడలోనూ బంగారం ధరలు పెరిగాయి. 22 క్యారెట్ల బంగారం రేటు రూ.750 పెరిగింది. తులం(10 గ్రాముల) ధర రూ.1,32,300 అమ్ముడవుతోంది. 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.820 మేర పెరిగింది. ప్రస్తుతం రూ. 1,44,330 స్థాయిలో ధర పలుకుతోంది.
దేశంలోని ప్రధాన నగరాలు ఢిల్లీ, ముంభై, చెన్నై మార్కెట్లో బంగారం ధర ఈ విధంగా ఉంది. శుక్రవారం 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,44,340లు ఉంది. అదే 22 క్యారెట్ల బంగారం రేటు రూ.1,32,310లు పలుకుతోంది. వెండి కిలో ధర వంద లేదా రెండు వందలు అటు ఇటుగా రూ.2,34,900 వద్ద ట్రేడింగ్ జరుగుతోంది.