E-Paper
Advertisement

ఐఏఎస్, ఐపిఎస్ నియామకాల్లో కేంద్రం కీలక సంస్కరణలు.. ఏం మారబోతోదంటే

ఐఏఎస్, ఐపిఎస్ నియామకాల్లో కేంద్రం కీలక సంస్కరణలు.. ఏం మారబోతోదంటే
Advertisement

UPSC Recruitment| ఐఏఎస్, ఐపిఎస్, ఐఎఫ్‌ఎస్ లాంటి ప్రతిష్టాత్మక ఆఫీసర్ల నియామకాలు చేసే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC), ఇతర కీలక ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలు చేపట్టే స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (SSC) ద్వారా జరిగే నియామక ప్రక్రియలో కేంద్ర ప్రభుత్వం పలు కీలక మార్పులు తీసుకొచ్చింది. ఈ సంస్కరణల ప్రధాన లక్ష్యం నియామకాలను మరింత వేగవంతంగా, పారదర్శకంగా, నిష్పాక్షికంగా, సురక్షితంగా భద్రంగా నిర్వహించడం. ఈ వివరాలను కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానంలో వెల్లడించారు.

నియామక ప్రక్రియను వేగవంతం చేసే చర్యలు

ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను త్వరగా భర్తీ చేయడానికి ప్రభుత్వం.. టెక్నాలజీ ఆధారిత పద్ధతులను అమలు చేస్తోంది. దీంతో నియామక ప్రక్రియలో ఆలస్యం తగ్గి, అభ్యర్థులకు త్వరగా ఫలితాలు అందే అవకాశం పెరుగుతుంది. సిబ్బంది, శిక్షణ శాఖ (డిపార్ట్‌మెంట్ ఆఫ్ ట్రైనింగ్ అండ్ పర్సనెల్) పరిధిలో యుపిఎస్‌సి, ఎస్ఎస్‌సి పనిచేస్తున్నాయి. ఈ రెండు సంస్థలు కొత్త డిజిటల్ విధానాలను అమలు చేస్తున్నాయి.

గ్రూప్ ‘సి’, ‘బి’ పోస్టులకు ఇంటర్వ్యూలు రద్దు

Advertisement

2016 జనవరి 1 నుంచి గ్రూప్ ‘సి’, గ్రూప్ ‘బి’ నాన్ గెజిటెడ్ పోస్టులకు ఇంటర్వ్యూలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో ఎంపిక ప్రక్రియ మరింత నిష్పాక్షికంగా మారింది. ఇప్పుడు అభ్యర్థుల ఎంపిక ప్రధానంగా రాత పరీక్షల ఆధారంగానే జరుగుతోంది. దీనివల్ల అందరికీ సమాన అవకాశాలు లభిస్తున్నాయి.

నియామక పత్రాల జారీ వేగవంతం

ఎంపికైన అభ్యర్థులకు స్వీయ ధృవీకరణ పత్రాల ఆధారంగా తాత్కాలిక నియామక పత్రాలు ఇవ్వడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. నియామకం తర్వాత ఆరు నెలల్లోగా కుల ధృవీకరణ, వ్యక్తిత్వ ధృవీకరణ పూర్తిచేస్తారు. దీంతో అభ్యర్థులు.. ఉద్యోగంలో త్వరగా చేరే అవకాశం ఉంటుంది. అలాగే 2022 అక్టోబర్ నుంచి నిర్వహిస్తున్న నేషనల్ రోజ్‌గార్ మేళాల ద్వారా లక్షలాది నియామక పత్రాలు పంపిణీ చేశారు.

ఎస్‌ఎస్‌సీలో డిజిటల్ సంస్కరణలు

Advertisement

ఎస్‌ఎస్‌సీ నియామక ప్రక్రియలో ప్రభుత్వం అనేక సాంకేతిక మార్పులు చేసింది. గతంలో 15 నుంచి 18 నెలలు పట్టే నియామక ప్రక్రియ ఇప్పుడు సగటున 6 నుంచి 8 నెలల్లో పూర్తవుతోంది. కంప్యూటర్ ఆధారిత పరీక్షలను కూడా నియామక ప్రక్రియలో తీసుకొచ్చారు. పరీక్షల దశలను కూడా తగ్గించారు.
అభ్యర్థుల పత్రాలను భద్రంగా పంపించేందుకు ఈ – డోసియర్ వ్యవస్థను ప్రవేశపెట్టారు. ఖాళీలను మెరిట్ ఆధారంగా భర్తీ చేయడానికి స్లైడింగ్ మెకానిజం ఫ్రేమ్‌వర్క్ అమలు చేస్తున్నారు. పరీక్షల తాత్కాలిక, తుది ఆన్సర్ కీలు విడుదల చేస్తున్నారు. అభ్యర్థులకు అభ్యంతరాలు తెలిపే అవకాశం కూడా కల్పించారు. మార్కులు, ఫలితాలను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతున్నారు.

Also Read: నెలకు రూ.10 లక్షల వరకు జీతం.. ప్రపంచమంతా తిరిగిరావొచ్చు.. ఇంటర్మీడియట్ ఉంటే చాలు

యూపీఎస్సీలో కొత్త సాంకేతిక విధానాలు

యూపీఎస్సీ కూడా నియామక ప్రక్రియను ఆధునికీకరించింది. గతంలో 15 నెలలకు పైగా పట్టే నియామక చక్రం ఇప్పుడు సుమారు 13 నెలలకు తగ్గింది.
మాడ్యులర్ ఆన్‌లైన్ అప్లికేషన్ పోర్టల్‌ను ప్రారంభించారు. దీంతో దరఖాస్తు ప్రక్రియ సులభమైంది. సివిల్ సర్వీసెస్ పరీక్షల ప్రయత్నాలను ధృవీకరించడానికి కృత్రిమ మేధస్సు (AI) ఉపయోగిస్తున్నారు. పరీక్షల్లో వేరొకరి స్థానంలో హాజరుకాకుండా ఉండేందుకు ఫేస్ ఆథెంటికేషన్ కూడా అమలు చేస్తున్నారు.
తాత్కాలిక ఆన్సర్ కీలు విడుదల చేసి, అభ్యర్థుల అభిప్రాయాలను స్వీకరించే విధానాన్ని కూడా తీసుకొచ్చారు.

అభ్యర్థులకు మెరుగైన సౌకర్యాలు

యూపీఎస్సీ ప్రత్యేకంగా అభ్యర్థుల సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. పరీక్షా కేంద్రాల సంఖ్యను కూడా పెంచింది. దివ్యాంగ అభ్యర్థులకు తమకు అనుకూలమైన పరీక్షా కేంద్రాన్ని ఎంపిక చేసుకునే అవకాశం కల్పించింది. దీనివల్ల వారికి మరింత సౌకర్యం లభిస్తుంది.

Also Read: ఫుడ్ డెలివరీ బాయ్‌గా పనిచేశాడు కట్ చేస్తే ఈ రోజు కోటీశ్వరుడు.. రోజుకు రూ.6.3 లక్షల ఆదాయం

సంస్కరణల లక్ష్యం

ఈ మార్పుల ద్వారా నియామక వ్యవస్థను మరింత పారదర్శకంగా, వేగవంతంగా, సౌకర్యవంతంగా, విశ్వసనీయంగా మార్చాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. టెక్నాలజీ వినియోగంతో అభ్యర్థులకు మెరుగైన అనుభవం అందించాలని ప్రభుత్వం భావిస్తోంది.

Related News

అమెరికాలో కస్టమర్లకు వందల కోట్లు పరిహారం చెల్లించిన కంపెనీ.. ఇండియాలో ఎందుకు ఇలా జరగదు?

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. ఈసారి ఎంతంటే?

RRB గ్రూప్ D పరీక్ష షెడ్యూల్ మార్పు.. కొత్త తేదీలు, అడ్మిట్ కార్డ్ వివరాలు ఇవిగో

ఇస్రోలో అప్రెంటిస్ జాబ్స్.. ప్రతిష్టాత్మక సంస్థలో పనిచేసే గోల్డెన్ ఛాన్స్.. వెంటనే అప్లై చేయండి

సామాన్యులకు అలర్ట్.. ఆగస్టు 1 నుంచి కొత్త రూల్స్.. ఇవన్నీ మారిపోతున్నాయి!

ఐటీఆర్ ఫైలింగ్ స్కామ్.. నకిలీ ట్యాక్స్ రీఫండ్ మోసాలతో జాగ్రత్త.. సైబర్ పోలీసుల హెచ్చరిక

అదాయ పన్ను రిటర్న్స్ ఫైలింగ్ జూలై 31 చివరి తేదీ.. కానీ అందరికీ కాదు.. వీరికి మినహాయింపు

Big Stories

Advertisement
×