Gold Prices: గత కొద్ది రోజులుగా తగ్గుతూ వస్తున్న పసిడి ధరలు.. శనివారం (ఆగస్టు 1) సైతం మరోమారు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.380 తగ్గగా, 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ.350 దిగి వచ్చింది. అయితే వెండి ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు చోటుచేసుకోలేదు. ప్రస్తుతం మార్కెట్లో కిలో వెండి ధర రూ.2,35,000 పలుకుతోంది.
దేశంలో 24 క్యారెట్ల గోల్డ్ ధర (10 గ్రా) రూ.380 తగ్గడంతో పసిడి రేటు రూ.1,44,220కి చేరింది. అటు 22 క్యారెట్ల ధర (10 గ్రా) రూ.1,32,200 పలుకుతోంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల విభాగంలో దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరలు చూస్తే.. దిల్లీలో రూ.1,32,250, చెన్నైలో రూ.1,32,560, కోల్ కత్తాలో రూ.1,32,200, బెంగళూరులో రూ.1,32,200 పలుకుతోంది.
Also Read: కాసేపట్లో భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభం.. మోడీ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేకతలు ఇవే!
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోనూ పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ.1,44,220 పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రూ.1,32,200 సేల్ చేస్తున్నారు. అటు ఏపీలోని విజయవాడలో సైతం 24 క్యారెట్ల గోల్డ్ (10 గ్రా) రూ.1,44,220, 22 క్యారెట్ల పసిడి (10 గ్రా) రూ.1,32,200కి తగ్గింది.
ఇదిలా ఉంటే పసిడి ధరలు గత కొద్ది రోజులుగా తగ్గుతూ రావడానికి అంతర్జాతీయ మార్కెట్లో చోటుచేసుకుంటున్న ఒడిదొడుకులే కారణమని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రధానంగా డాలర్ బలపడటం.. పసిడిపై ప్రతీకూల ప్రభావం చూపుతోందని పేర్కొంటున్నారు. అధిక వడ్డీలు వచ్చే బాండ్ల వైపు మదుపరులు ఆకర్షితులవుతున్నారని తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బంగారం ధర దాని రికార్డు గరిష్ట స్థాయి కంటే 25 శాతం మేర తగ్గటం గమనార్హం. ఈ ఏడాది జనవరిలో బంగారం ఔన్స్ ధర అత్యధికంగా 5,595 డాలర్లు పలికింది. ఆ తర్వాత నుంచి క్రమంగా తగ్గుతూ వస్తోంది.
Also Read: విమానం ఎగరకముందే రచ్చ.. భోగాపురం ఎయిర్‌పోర్ట్ క్రెడిట్ ఎవరిది?