E-Paper
Advertisement

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు
Advertisement

Fixed Deposits: స్టాక్‌మార్కెట్ రోజుకో విధంగా ఉండడంతో సామాన్యులు బ్యాంకుల వైపు మొగ్గు చూపుతున్నారు. వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అయితే ఒక్కో బ్యాంకులకు చెందిన శాఖలు ఒక్కో దగ్గర ఒక్కో విధంగా వడ్డీ రేట్లు ఇస్తున్నాయి. ఇకపై ఆ సమస్య ఉండదు. కస్టమర్లు అందరికీ ఒకే విధమైన వడ్డీ రేట్లు అమలులోకి రాబోతున్నాయి. ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్ అమల్లోకి రానున్న కొత్త రూల్స్ ఏంటి?

ఫిక్స్‌డ్ డిపాజిట్ల కస్టమర్లకు గుడ్‌న్యూస్

పెట్టుబడికి స్థిరమైన రాబడి కావాలంటే తొలుత గుర్తుకు వచ్చేవి బ్యాంకుల ఫిక్స్‌డ్ డిపాజిట్లు. వడ్డీ రేట్ల విషయంలో ఒక్కో బ్యాంక్ ఒక్కో విధంగా ఉంటుంది. ఈ విషయంలో ఎక్కడ డిపాజిట్ చేయాలో తేల్చేకోలేకపోతారు కస్టమర్లు. ఇకపై అలాంటి సమస్యకు చెక్ పెట్టింది ఆర్బీఐ. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్ల ప్రకటన, మరింత పారదర్శకతను పెంచేందుకు కొన్ని నిబంధనలను సవరించింది. ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిపాజిట్లపై వడ్డీ రేట్లు సవరణపై బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. కొత్త నిబంధనలు అక్టోబర్ ఒకటి నుంచి అమల్లోకి రాబోతునున్నాయి.

బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

Advertisement

అక్టోబర్ ఒకటి నుంచి వాణిజ్య, స్మాల్ ఫైనాన్స్, ప్రాంతీయ గ్రామీణ, అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులు, పేమెంట్ బ్యాంకులకు కొత్త మార్గ దర్శకాలు వర్తించనున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే ఒకే బ్యాంకుకు చెందిన వేర్వేరు శాఖల్లో ఒకే రకమైన డిపాజిట్లను తెరిచే వినియోగదారులకు వేర్వేరు రేట్లను అందించరాదు. అన్ని బ్రాంచ్‌ల్లో ఒకే రోజు ఆమోదించిన డిపాజిట్లకు సమాన వడ్డీ రేటు వర్తించనుంది.

వెబ్‌సైట్‌లో వడ్డీ రేట్ల ప్రకటన

ఒకే రకమైన డిపాజిట్ల మధ్య ఎలాంటి వివక్ష ఉండకూడదని ఆర్‌బిఐ చెబుతున్నమాట. ఈ మార్పుల వల్ల వినియోగదారులు పెట్టుబడి పెట్టే ముందు డిపాజిట్ రేట్లను పోల్చి చూసుకోవడం సులభతరం అవుతుంది. ఒకే రకమైన డిపాజిట్లపై బ్రాంచ్‌ల వారీగా వ్యత్యాసాలు ఉండే అవకాశం అస్సలు ఉండదు. బ్యాంకులు తమ డిపాజిట్ వడ్డీ రేట్ల వివరాలను ముందుగా తమ వెబ్‌సైట్‌లో ప్రచురించాలి. పబ్లిష్ చేసిన షెడ్యూల్ ప్రకారం కస్టమర్లకు వడ్డీ చెల్లించాలి. అంతేకానీ ఇష్టానుసారంగా వ్యత్యాసాలు చూపడానికి వీల్లేదు.

Advertisement

బల్క్ డిపాజిట్ల మాటేంటి?

రూ.3 కోట్లు అంత కంటే ఎక్కువ మొత్తం ఉండే బల్క్ డిపాజిట్లపై వేర్వేరు వడ్డీ రేట్లను అందించడానికి బ్యాంకులకు వెసులుబాటు కల్పించింది ఆర్బీఐ. లిక్విడిటీ కవరేజ్ నిష్పత్తి-LCR ఆధారంగా బ్యాంకులు బల్క్ డిపాజిట్ల రేట్లు నిర్దేశించవచ్చు. బల్క్ డిపాజిట్ల రేట్లు ప్రతి రోజు ఉదయం 10 గంటలకు తమతమ వెబ్‌సైబ్‌లో తప్పనిసరిగా అప్‌లోడ్ చేయాలి. అందుకు 10 నిమిషాలు అదనపు సమయం కేటాయించారు. ఈ వెసులుబాటు ప్రవాసుల డిపాజిట్లకు విస్తరించారు. RBI తీసుకొచ్చిన కొత్త నిబంధనల వల్ల ఫిక్స్‌డ్ డిపాజిట్ల రేట్లు ఒక్కసారిగా పెరగవు. అలాగని తగ్గవు. బ్యాంకులు ద్రవ్య అవసరాలు, నిధుల సమీకరణ వ్యయాలు, మార్కెట్ పరిస్థితులు వంటి అంశాల ఆధారంగా తమ డిపాజిట్ రేట్లను నిర్ణయించడం కొనసాగిస్తాయి. కొత్త చట్టం కేవలం డిపాజిట్ రేట్ల ప్రకటన, ప్రదర్శన పారదర్శకతలో మార్పులను మాత్రమే.

ALSO READ: రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

Related News

యుపిఐ పేమెంట్స్‌పై ఫ్లాట్ MDR.. పెట్రోల్, రైల్వే, ఇన్‌సూరెన్స్‌ రంగాలకు కొత్త రూల్స్

పేటీఎం, ఫోన్ పే, గూగుల్ ‌పే యాప్‌లకు ఆదాయం ఎలా వస్తుంది? వీటిలో ఏది బెస్ట్?

ప్రపంచంలో UPI ఎక్కువగా వాడే దేశాలివే.. ఇండియా ఇక ఆ స్థానంలో ఉండబోదా?

ఎన్నో జంతువులు ఉండగా.. పాత రూ.10 నోటుపై.. ఏనుగు, ఖడ్గమృగం, పులి బొమ్మలే ఎందుకు?

షేర్లు, మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడుల కోసం UPI ద్వారా పేమెంట్స్ చేస్తున్నారా? కొత్త MDR రూల్స్ ఇవే

ఉద్యోగ ఇంటర్వ్యూలు పోలీసు విచారణలా అనిపిస్తున్నాయి.. భారతీయ అభ్యర్థుల ఆవేదన

బంగారం ధర పతనం.. మహిళల్లో సందడి మొదలు, మార్కెట్లో ఇవాళ ధరలు

యూపీఐపై కొత్త ఛార్జీలు.. రూ.2 వేలు ధాటితే ఇత్తడే, అంతా వ్యాపారికేనట, క్యాష్ చెల్లింపులే బెటరా?

Big Stories

Advertisement
×