E-Paper
Advertisement

INDIA EU Trade Deal: భారత్-ఈయూ ట్రేడ్ డీల్..లగ్జరీ కార్ల నుంచి వైన్ వరకు.. భారీగా తగ్గనున్న ధరలు

INDIA EU Trade Deal: భారత్-ఈయూ ట్రేడ్ డీల్..లగ్జరీ కార్ల నుంచి వైన్ వరకు.. భారీగా తగ్గనున్న ధరలు
Advertisement

INDIA EU Trade Deal: భారత్-ఈయూ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరింది. దీంతో ఇరు దేశాల మధ్య వాణిజ్యం సులభం కానుంది. వాణిజ్య ఒప్పందంతో యూరోపియన్ ఎగుమతుల్లో దాదాపు 97 శాతం వస్తువులపై సుంకాలు తగ్గనున్నాయి. వ్యవసాయ ఉత్పత్తులు, ఆటోమొబైల్స్ రంగాలలోని అనేక ఉత్పత్తులు భవిష్యత్తులో చౌకగా లభించే అవకాశం ఉంది. ఎఫ్టీఏతో యూరోపియన్ ఉత్పత్తులపై సుంకాలు తగ్గిస్తారు. దీంతో ఏడాది 4 బిలియన్ల యూరోల వరకు పన్నులు తగ్గనున్నాయి.

యూరోపియన్ దేశాల నుంచి భారత్ దిగుమతి చేసుకునే… చాక్లెట్లు, వైన్లు, కార్లు సహా చాలా వాటిపై 150 శాతం నుంచి 50 శాతానికి, 20 శాతం నుంచి సున్నా శాతానికి సుంకాలు తగ్గనున్నాయి.

ఏవి చౌకగా దొరుకుతాయంటే?

  • యంత్రాలు, విద్యుత్ పరికరాలపై ప్రస్తుతం ఉన్న 44 శాతం టారిఫ్ ను సున్నాకు తగ్గించే అవకాశం ఉంది.
  • విమానాలు, అంతరిక్ష నౌక ఉత్పత్తులపై ఉన్న 11 శాతం టారిఫ్ లను సున్నకు తగ్గించనున్నారు.
  • ఆప్టికల్, వైద్య, శస్త్రచికిత్స పరికరాలపై ప్రస్తుతం 90 టారిఫ్ విధిస్తున్నారు. దీనిని 27.5 వరకు తగ్గించనున్నారు.
  • ప్లాస్టిక్‌ ఉత్పత్తులపై టారిఫ్ లు 16.5 శాతం నుంచి 0 తగ్గించనున్నారు.
  • ముత్యాలు, విలువైన రాళ్లు, లోహాలు వంటి 20 ఉత్పత్తులపై ప్రస్తుతం 22.5 శాతం టారిఫ్ విధిస్తున్నారు. వీటిపై 36% వరకు సుంకాలు తగ్గనున్నాయి.
  • రసాయన ఉత్పత్తులపై ప్రస్తుతం 22 శాతం టారిఫ్ లు విధిస్తున్నారు. ఈ సుంకాలను సున్నాకు తగ్గించనున్నారు.
  • మోటారు వాహనాలపై విధిస్తున్న 110 శాతం టారిఫ్ ను 10 శాతానికి తగ్గించే అవకాశం ఉంది.
  • ఇనుము, ఉక్కు ఉత్పత్తులపై టారిఫ్ 22 శాతం నుంచి సున్నకు తగ్గించనున్నారు.
Advertisement

భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ప్రపంచ ఆర్థిక సవాళ్లు పెరుగుతున్న సమయంలో ఈ ఒప్పందం ప్రపంచంలోని రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల మధ్య ఆర్థిక, రాజకీయ సంబంధాలను బలోపేతం చేస్తుందని ఈయూ తెలిపింది. ఈ ఒప్పందం సుంకాలు, పరిపాలనా భారాలు తగ్గనున్నాయి. ఇరు ప్రాంతాల మధ్య వాణిజ్యం మరింత సులభతరం కానుంది. ఈయూలోని 27 సభ్య దేశాలతో చౌకగా ఇండియా వ్యాణిజ్యం మెరుగుపడుతుంది.

వాణిజ్య ఒప్పందంపై సంతకం చేసినట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ప్రకటించారు. ప్రపంచంలోని రెండు ప్రధాన ఆర్థిక వ్యవస్థల మధ్య వాణజ్య భాగస్వామ్యానికి ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రపంచ జీడీపీలో 25 శాతం, ప్రపంచ వాణిజ్యంలో 1/3 వంతు ప్రాతినిధ్యం వహించనుంది.

Advertisement

Also Read: అమెరికాకు మాస్టర్ స్ట్రోక్.. భారత్-ఈయూ చేతులు కలిపాయి.. ప్రపంచ వాణిజ్యంలో కొత్త శకం

తగ్గనున్న ధరలు

  • యూరోపియన్ వైన్ -గతంలో రూ.12000, ఇప్పుడు రూ.3000
  • ఇటాలియన్ పెర్ఫ్యూమ్స్, బ్యాగ్స్- గతంలో రూ.30,000 ఇప్పుడు రూ.5000
  • యూరోపియన్ చాక్లెట్స్, చిప్స్, స్కాక్స్, జ్యూస్ -గతంలో రూ.180 ఇప్పుడు రూ.130
  • ఆలివ్ ఆయిల్-గతంలో రూ.1800 నుంచి ఇప్పుడు రూ.650కు తగ్గనున్నాయి.
  • యూరోపియన్ ఫుట్ వేర్ -గతంలో రూ.40,000 ఇప్పుడు రూ.6000లకు తగ్గనున్నాయి.
  • స్విస్ వాచ్ లు -గతంలో రూ.70 వేలు, ఇప్పుడు రూ.28 వేలు
  • లగ్జరీ కార్లు – గతంలో రూ.75 లక్షలు నుంచి ఒక కోటి ఇప్పుడు రూ.35 లక్షల నుంచి రూ.45 లక్షలు

Related News

హోటల్ బిల్లులో సర్వీస్ ఛార్జ్.. 41 రెస్టారెంట్లపై కఠిన చర్యలు

పసిడి ప్రియులకు షాక్.. రెండు రోజులుగా మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు.. ఎంత పెరిగిందంటే?

Credit Cards: షాకింగ్ నిజాలు.. కొత్త క్రెడిట్ కార్డులు, సగానికి జెన్ జీలదే హవా, వారంతా అక్కడి వారే

ఆ 3 సెకన్ల వెనుక కోట్ల వ్యాపారం.. Mutual Funds యాడ్స్ స్పీడ్ వెనుక ఉన్న మైండ్ గేమ్ ఇదే!

కూతురు ఉందా? రూపాయి ఖర్చు లేకుండా ఆమె పెళ్లి, చదువు బాధ్యతలు తీరిపోయే సూపర్ స్కీమ్ ఇదే!

ధర ఏమో ఆకాశానికి.. సైజు ఏమో చిన్నగా.. భాగ్యనగరంలో గుడ్డు రేట్ల ఘాటు!

ప్రైవేట్ జాబ్ చేస్తున్నారా? రిటైర్మెంట్ తర్వాత కూడా రాజాలా బతకాలంటే ఇప్పుడే ఇలా చేయండి!

సైబర్ వలలో కార్పొరేట్ కంపెనీలు.. అలజడి రేపుతోన్న ‘బాస్ స్కామ్’!

Big Stories

Advertisement
×