E-Paper
Advertisement

Rafale Jets Deal: భారత్-ఫ్రాన్స్ మధ్య భారీ డిఫెన్స్ డీల్… 114 రాఫెల్ జెట్స్ కొనుగోలుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

Rafale Jets Deal: భారత్-ఫ్రాన్స్ మధ్య భారీ డిఫెన్స్ డీల్… 114 రాఫెల్ జెట్స్ కొనుగోలుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
Advertisement

Rafale Jets Deal: భారత్ మరో భారీ డిఫెన్స్ డీల్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఫ్రాన్స్ నుంచి 114 డస్సాల్ట్ రాఫెల్ ఫైటర్ జెట్స్ కొనుగోలు చేసేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలోని డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ (DAC) గురువారం ఈ మేరకు ప్రకటన చేసింది. ఈ డీల్‌తో భారత ఎయిర్ ఫోర్స్ సామర్థ్యం మరింత పెరుగుతుంది. ఈ నెలలో ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ భారత పర్యటనకు రానున్నారు. ఈ పర్యటనలో భారత్-ఫ్రాన్స్ మధ్య రూ. 3.25 లక్షల కోట్ల మెగా డీల్ పై సంతకాలు చేసే అవకాశం ఉంది.

96 జెట్స్ భారత్ లో తయారీ

భారతీయ పైలట్లు, ప్లానర్లకు.. ఈ డీల్ కీలకం కానుంది. రాఫెల్ లో ఇంటిగ్రేటెడ్ ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ సిస్టమ్‌లు, అధునాతన సెన్సార్లు, కచ్చితమైన ఆయుధాలతో 4.5-జనరేషన్ మల్టీ-లెవల్ కలిగిన ఫైటర్ జెట్. ప్రస్తుత ప్రతిపాదన ప్రకారం, 18 రాఫెల్ విమానాలు ఫ్రాన్స్ నుంచి డెలివరీ చేస్తారు. మిగిలిన 96 విమానాలను భారతదేశంలో తయారు చేయనున్నారు. ఈ ఒప్పందం భారత యుద్ధ విమానాలను మెరుగుపరచడమే కాకుండా నైపుణ్యం కలిగిన ఉద్యోగాలు, దేశీయ జెట్ తయారీ సామర్థ్యా్న్ని పెంచుతుందని అధికారులు తెలిపారు.

రూ.3.25 లక్షల కోట్ల డీల్

Advertisement

ఈ ఒప్పందం భారతీయ ఆయుధ వ్యవస్థలను రాఫెల్ ప్లాట్‌ఫామ్‌లో అనుసంధానిస్తుంది. బిలియన్ డాలర్ల డీల్‌కు డీఏసీ అంగీకారం తెలిపినట్లు రక్షణ రంగ వర్గాలు పేర్కొన్నాయి. రక్షణ కార్యదర్శి అధ్యక్షతన ఉన్న డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ బోర్డ్ గత నెలలో రాఫెల్ జెట్స్ కొనుగోలు ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సుమారు రూ.3.25 లక్షల కోట్ల విలువైన ఈ ఒప్పందం అతిపెద్ద యుద్ధ విమానాల సేకరణలలో ఒకటిగా నిలుస్తుంది. పాకిస్తాన్‌, బంగ్లాదేశ్, చైనాతో ఉద్రిక్తతలు పెరుగుతున్న సమయంలో ఈ డీల్ కీలకం కానుంది.

Also Read: రైతుల ఖాతాల్లో రూ.6 వేలు, ప్రతి నెలా రూ.3 వేల పెన్షన్.. కేంద్ర ప్రభుత్వ టాప్ 6 సంక్షేమ పథకాలివే

80 శాతం జెట్స్ భారత్ లో తయారీ

Advertisement

భారత ఎయిర్ ఫోర్స్ కు 42 స్వ్కాడ్రన్లు అవసరం, కానీ ప్రస్తుతం 29 యుద్ధ విమానాలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో రాఫెల్ జెట్స్ కొనుగోలుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాఫెల్ జెట్లను ఫ్రెంచ్ రక్షణ సంస్థ డస్సాల్ట్ ఏవియేషన్ తయారు చేస్తుంది. ఈ డీల్ లో దాదాపు 80 శాతం జెట్ లను భారత్ లో తయారు చేయాలని నిర్ణయించారు. మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ లో భాగంగా 60 శాతం దేశీయ పరికరాలను ఉపయోగించనున్నారు.

Related News

ఎన్ని ఈఎంఐలు చెల్లించకపోతే ఇల్లు సీజ్ చేస్తారు? బ్యాంకు రూల్స్ ఏం చెబుతున్నాయ్!

అమ్మమ్మ వంటతో అద్భుతం.. రూ.5 లక్షలతో మెుదలై రూ.కోట్లల్లో వ్యాపారం.. ఈ సిస్టర్స్ అదరగొట్టేశారు!

అవినీతి ఆరోపణలపై ఉద్యోగి తొలగింపు.. పెన్షన్ కోసం 37 ఏళ్ల పోరాటం.. మరణం తరువాత న్యాయం

జీతం చేతికి రాగానే ఖర్చయిపోతోందా? ఈ 9 చిన్న మార్పులతో.. భారీగా డబ్బులు ఆదా!

8 ఏళ్లలో రూ.1 కోటి సంపాదించాలా? తిరుగులేని పెట్టుబడి ప్లాన్ ఇదే.. పక్కా వర్కౌట్ అవుద్ది మామ!

పర్సనల్ లోన్ EMI కట్టలేకపోయారా? క్రెడిట్ స్కోర్‌ తగ్గకుండా ఎలా సరిచేయాలి?

పండుగ షాపింగ్ అంతంతమాత్రమే.. వెనుకడుగు వేస్తున భారతీయులు.. కారణాలివే

మళ్లీ రీఛార్జ్ ధరలు పెంచనున్న జియో.. అంబానీ కీలక వ్యాఖ్యలు

Big Stories

Advertisement
×