E-Paper
Advertisement

Farmer Welfare Schemes: రైతుల ఖాతాల్లో రూ.6 వేలు, ప్రతి నెలా రూ.3 వేల పెన్షన్.. కేంద్ర ప్రభుత్వ టాప్ 6 సంక్షేమ పథకాలివే

Farmer Welfare Schemes: రైతుల ఖాతాల్లో రూ.6 వేలు, ప్రతి నెలా రూ.3 వేల పెన్షన్.. కేంద్ర ప్రభుత్వ టాప్ 6 సంక్షేమ పథకాలివే
Advertisement

Farmer Welfare Schemes: కేంద్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తుంది. రైతుల ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చేందుకు, వ్యవసాయ రంగానికి సంబంధించి కీలక పథకాలను ప్రారంభించింది. రైతులకు ఎంతగానో ఉపయోగపడుతున్న ఆరు ముఖ్యమైన పథకాలు గురించి తెలుసుకుందాం.

పీఎం కిసాన్ సమ్మాన్ నిధి

పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా నేరుగా రైతుల ఖాతాల్లో సంవత్సరానికి రూ. 6,000 జమ చేస్తుంది. అర్హులైన చిన్న, సన్నకారు రైతులకు ఈ పథకం కింద పెట్టుబడి సాయం రూ.6000 అందిస్తుంది. ఏడాదికి మూడు విడతలుగా రూ. 2,000 చొప్పున ఆధార్ లింక్ అయిన బ్యాంకు ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేస్తారు.

ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన

Advertisement

ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన క్రాప్-ఇన్సూరెన్స్ పథకం. 2016 ఫిబ్రవరిలో ఈ స్కీమ్ ను ప్రారంభించారు. ప్రకృతి వైపరీత్యాలు, తెగుళ్ల వల్ల జరిగే పంట నష్టాల నుంచి రైతులను రక్షించేందుకు ఈ బీమా పథకాన్ని అమలు చేస్తున్నారు. PMFBY కింద చాలా తక్కువ ప్రీమియంతో పంట బీమా అందిస్తున్నారు. పంట నష్టపోయిన రైతులకు ఈ పథకం కింద పరిహారం అందజేస్తారు.

కిసాన్ క్రెడిట్ కార్డు

కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా రైతులకు కేంద్రం క్రెడిట్ సపోర్ట్ అందిస్తుంది. రైతులతో పాటు మత్స్య, పాడి పరిశ్రమలకు ఈ పథకాన్ని విస్తరించింది. కేసీసీ పథకం కింద రైతులకు పెట్టుబడి సాయం అందిస్తారు. నీటిపారుదల, పంపులు, విత్తనాల కొనుగోలుకు బ్యాంకుల ద్వారా రుణాలు అందిస్తారు. వీటిపై వడ్డీ రాయితీ ఉంటుంది. కేసీసీ ద్వారా రూ.5 లక్షల వరకు స్వల్పకాలిక రుణాలను పొందే రైతులు 7% వరకు వడ్డీ సబ్సిడీ పొందుతారు.

వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి

Advertisement

వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి పథకం ద్వారా వ్యవసాయ అనుబంధ సంస్థలు, రైతు సంఘాలు, స్టార్టప్, కోల్డ్ స్టోరేజీ, గిడ్డంగులు, ప్యాకేజింగ్, వ్యవసాయ యంత్రాలకు మద్దతు ఇచ్చేందుకు రూ.1 లక్ష కోట్లు కేంద్రం కేటాయించింది. ఈ పథకం ద్వారా రైతులకు రాయితీపై రుణాలు పొందవచ్చు.

సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్

ఈ పథకం ద్వారా Soil Health కార్డులను జారీ చేస్తారు. భూసార పరీక్షలు చేసి, వాటి ఆధారంగా పంటల వారీగా పోషకాలు, లోపాలను రైతులకు తెలియజేస్తారు. ఎరువుల వాడకాన్ని తగ్గించడం, తక్కువ ఖర్చుతో మెరుగైన దిగుబడిని ప్రోత్సహిస్తారు.

Also Read: ఇలా చేస్తే ప్రతి నెలా రూ.5000 అకౌంట్లోకి.. ఈ సూపర్ స్కీమ్ గురించి తెలుసా?

ప్రధాన మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన

పీఎం కిసాన్ మాన్ ధన్ పథకం ద్వారా రైతులకు పెన్షన్ అందిస్తారు. 18 నుంచి 40 సంవత్సరాల వయస్సు గల రైతులు స్వచ్ఛందంగా ఈ పథకంలో చేరవచ్చు. నెలకు రూ.55 నుంచి రూ.200 మధ్య ప్రీమియం చెల్లిస్తే.. 60 ఏళ్లు తర్వాత నెలకు రూ.3,000 పెన్షన్‌కు అందుతుంది.

Related News

డీజీపీ అనురాగ్‌ సూసైడ్‌, విచారణకు ప్రభుత్వ ఆదేశం, ఆఫీసులో ఏం జరిగింది?

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

రన్నింగ్‌ బస్సులో జుట్టు పట్టుకొని కొట్టుకున్న లేడి కండక్టర్, మహిళా ప్యాసింజర్.. ఇదిగో వీడియో!

తమిళనాడులో వేడెక్కిన రాజకీయం.. సీఎం విజయ్‌కు బెదిరింపులు, డీఎంకె ఎమ్మెల్యే అరెస్ట్

ట్రీట్‌మెంట్‌కి వచ్చిన పేషెంట్.. ఫ్యాన్ చంపేసింది, ఆసుపత్రిలో ఆ రాత్రి ఏం జరిగిందంటే..

కేంద్రానికి ఆఖరి గడువు.. మూడు ఆప్షన్లలో ఏది ఎంచుకున్నా దీక్ష విరమిస్తా: సోనమ్ వాంగ్‌చుక్

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

Big Stories

Advertisement
×