ప్రధాని మోడీ ఇండియా కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు సాయం మరోసారి తీసుకోనున్నట్టు తెలుస్తున్నది. దక్షిణ భారతంలో ఏపీ మాత్రమే ఎన్డీయే కూటమిలో భాగస్వామిగా ఉన్నది. కర్ణాటక, తమిళనాడు, కేరళ, తమిళనాడులో ప్రాంతీయ, కాంగ్రెస్ ప్రభుత్వాలు కొలువుదీరాయి. అయితే, ఈసారి ఎలాగైనా తెలంగాణలో కమలం పార్టీ పాగా వేసేలా కేంద్రంలోని బీజేపీ పెద్దలు పావులు కదుపుతున్నట్టు సమాచారం. వచ్చే ఏడాది పంజాబ్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయి. అయితే,కర్ణాటకలో గతంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నది. ఈసారి కర్ణాటకలో మరోసారి అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ ఇప్పటికే వ్యూహాలు సిద్ధం చేస్తున్నది. అటు కర్ణాటకలో తెలుగు మాట్లాడే ప్రజలు ఎక్కువగానే ఉన్నారు. ఇటు తెలంగాణలోనూ ప్రజలు తెలుగు మాట్లాడతారు.
వచ్చే కర్ణాటక ఎన్నికల్లో ఎన్డీయే కూటమి తరఫున చంద్రబాబు బీజేపీ తరఫున తెలుగు ప్రజలు ఉండే నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తారని టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే తెలుగు ప్రజలకు చంద్రబాబు సుపరిచితుడు. ఉమ్మడి ఏపీలో రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు. అదే విధంగా పవన్ కళ్యాణ్ సైతం చంద్రబాబు బాటలోనే ప్రచారం నిర్వహిస్తారని తెలుస్తోంది. ఇక తెలంగాణ విషయానికొస్తే ఇక్కడ తెలుగుదేశం పార్టీకి మద్దతు దారులు చాలామందే ఉన్నారు.ఏపీ సెటిలర్లు సైతం హైదరాబాద్ చుట్టుపక్కల చాలామందే ఉన్నారు.కులాల పరంగాను టీడీపీకి ఇంకా మద్దతు తగ్గలేదు. అందుకే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు కొత్త వ్యూహాలను సిద్దం చేస్తున్నది. తెలంగాణ ఎన్నికలకు మరో రెండేండ్ల సమయం ఉన్నది. వచ్చే టర్ములో ఎలాగైనా అధికారంలోకి వచ్చేందుకు ఇప్పటి నుంచే కమలం పార్టీ ప్రణాళికలు వేస్తున్నది.
తెలంగాణలో ఈసారి ఎలాగైనా అధికారంలోకి వస్తామని నిన్న పరేడ్ గ్రౌండ్ సభలో మోడీ స్పష్టంచేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలనను చూసి తెలంగాణ ప్రజలు విసిగిపోయారని, ఇప్పుడు వారంతా బీజేపీ వైపు చూస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో అడుగుపెట్టకముందు సైతం ప్రధాని మోడీ తెలుగులో ఇదే విషయాన్ని తన ట్వీట్‌లో ప్రస్తావించారు. ఉత్తర తెలంగాణ, హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలు, పట్టణ ప్రాంతాల్లో బీజేపీ బలంగా ఉన్నది.ఇక కొంత గ్రామీణ ప్రాంతాల్లో నేటికి తెలుగుదేశం పార్టీకి సానుభూతిపరులు ఉన్నారు. రాష్ట్రం విడిపోయాక వారంతా గులాబీ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. కీలక నేతలు సైతం కారెక్కారు. అయినప్పటికీ టీడీపీ మీద సానుభూతి నేటికీ వారిలో ఉన్నదని తెలుస్తున్నది.
నిజామాబాద్‌లో హనీ ట్రాప్ కలకలం
అయితే, వారంతా రాబోయే జనరల్ ఎలక్షన్స్‌లో బీజేపీకి మద్దతు ఇచ్చేలా చూడాలని ప్రధాని మోడీ చంద్రబాబును కోరినట్టు ప్రచారం జరుగుతోంది. దీనికి తోడు టీడీపీలో గతంలో పనిచేసిన బలమైన క్యాండిడేట్స్ ఎవరు? వారి జాబితా కూడా రెడీ చేయించాలని ప్రచారం సాగుతోంది. ఎన్నికల సమయంలో బీజేపీకి మద్దతుగా చంద్రబాబు ప్రచారం చేస్తారని కూటా టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం కూటమి బలంగా ఉన్నందున సీఎం చంద్రబాబు సైతం..ప్రధాని మోడీ కోరిన వెంటనే ఒకే చెప్పినట్టు సమాచారం.ఇక బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి సపోర్టు చేయని కీలకనేతలపై చర్యలు తీసుకునేందుకు కేంద్రంలోని బీజేపీ పెద్దలు ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. మరో వారం లేదా రెండు వారాల్లో రాష్ట్రబీజేపీలో సమూళ మార్పులు జరుగుతాయని తెలుస్తోంది. కేంద్రంలోని మోడీ, అమిత్ షా ఆదేశాలతో ఢిల్లీ పెద్దలు రాష్ట్రానికి వచ్చి రాష్ట్ర బీజేపీ నాయకత్వంలో పలు మార్పులు చేర్పులు చేస్తారని తెలుస్తోంది.