BigTV English

Indian Railway Wool Blanket: రైల్లో బ్లాంకెట్స్ కప్పుకుంటున్నారా? జాగ్రత్త, ఓ షాకింగ్ విషయం బయటపడింది!

Indian Railway Wool Blanket: రైల్లో బ్లాంకెట్స్ కప్పుకుంటున్నారా? జాగ్రత్త, ఓ షాకింగ్ విషయం బయటపడింది!

Indian Railway Blankets: ప్రపంచంలోని అతిపెద్ద రైల్వే వ్యవస్థల్లో ఒకటైన భారతీయ రైల్వే సంస్థ, ప్రయాణీకులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంలో విఫలం అవుతుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రైళ్లలో పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని రైల్వేశాఖ వెల్లడించినా, క్షేత్రస్థాయిలో అది సాధ్యం కావట్లేదని ఎప్పటికప్పుడు బయటపడుతోంది. తాజాగా ఆర్టీఐ కింది కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సమాచారం ప్రయాణీకులను షాక్ కు గురి చేసింది. రైళ్లలో ప్యాసింజర్లకు ఇచ్చే బెడ్ షీట్లను నెలకు ఒకసారి, లేదంటే రెండుసార్లు మాత్రమే ఉతుకుతామని వెల్లడించింది.   మరకలు పడితే, లేదంటే దుర్వాసన వస్తే మాత్రమే వాష్ చేస్తామని రైల్వే సిబ్బంది వెల్లడించారు. లేదంటే చక్కగా మడిచి ప్రయాణీకులకు అవే ఇస్తామని చెప్పడంతో అందరూ అవాక్కవుతున్నారు. ఇంతకాలం దుప్పట్లు ఎప్పటికప్పుడు ఉతుకుతారని భావించిన ప్రయాణీకులకు ఇకపై రైళ్లలో దుప్పట్లు అంటేనే వామ్మో అనే పరిస్థితి ఏర్పడింది.


ఛార్జీలు వసూళు చేసినా శుభ్రతకు పాతర

స్లీపర్, ఏసీ కోచ్ లలో బెర్త్ బుక్ చేసుకున్న ప్రయాణీకులకు రైల్లో బెడ్ షీట్లు, దుప్పట్లు అందిస్తారు. వీటికి టికెట్ బుక్ చేసే సమయంలోనే ఛార్జ్ తీసుకుంటారు. దుప్పట్లు, బెడ్ షీట్లు, దిండ్లకు అదనంగా ఛార్జీ వసూలు చేస్తారు. ప్రయాణీకుల నుంచి డబ్బులు తీసుకుంటున్నా, పరిశుభ్రత పట్టించుకోవడం లేదని తెలియడంతో ప్రయాణీకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కొన్ని రైళ్లలో పరిశుభ్రతకు పెద్దపీట   

కొన్ని రైళ్లలో నెలకు ఒకటి, రెండుసార్లు వాష్ చేసినా, మరికొన్ని రైళ్లలో పరశుభ్రత విషయంలో రాజీ ఉండదని రైల్వేశాఖ అధికారులు చెప్తున్నారు. గరీబ్ రథ్, దురంతో రైళ్లలతో ప్రతి ప్రయాణం తర్వాత బెడ్ షీట్లను శుభ్రం చేస్తామని తెలిపారు.  ట్రిప్ కంప్లీట్ కాగానే, బెడ్ షీట్లు, దుప్పట్లు క్లీనింగ్ కు పంపిస్తామని తెలిపారు. చక్కగా లాండ్రీ చేసి మరో ట్రిప్ కు రెడీ చేస్తామని వెల్లడించారు.

బెడ్ షీట్లు మరింత దారుణం
కొన్ని రైళ్లలో దుప్పట్లు తరచుగా లాండ్రీకి ఇచ్చినా, బెడ్ షీట్లు మాత్రం మడత పెట్టి కోచ్ లలోనే పెట్టేస్తారు. వాటి నుంచి దుర్వాసన వస్తే, లేదంటే మరకలు పడితేనే శుభ్రం చేస్తారు. కొన్నిసార్లు ప్రయాణీకులు ఫిర్యాదు చేస్తేనే ఉతకడానికి పంపిస్తామని కొంతమంది రైల్వే అధికారులు వెల్లడించారు. దేశ వ్యాప్తంగా 46 డిపార్ట్ మెంటల్ లాండ్రీలు, 25 బూట్ లాండ్రీలు ఉన్నట్లు తెలిపారు. రైళ్లలో ఉపయోగించే బెడ్ షీట్లు, దుప్పట్లు, దిండు కవర్లను అక్కడే శుభ్రం చేయనున్నట్లు వెల్లడించారు.

నెలకు ఓసారి ఉతుకుతారన్న గ్యారెంటీ లేదు

కేంద్ర రైల్వేశాఖ ఇచ్చిన సమాచారం నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నెలకు ఓసారి కూడా ఉతుకుతారన్న గ్యారెంటీ లేదంటున్నారు. చాలా సందర్భాల్లో దుప్పట్లు అపరిశుభ్రంగా, దుర్వాసన  వస్తున్నాయంటున్నారు. డబ్బులు వసూళు చేసినా, పరిశుభ్రత పాటించకపోతే ఎలా? అంటూ మండిపడుతున్నారు. రైల్వేశాఖ ఇప్పటికైనా ప్రయాణీకులకు పరిశుభ్రమైన దుప్పట్లు, బెడ్ షీట్లు, దిండ్లు అందించాలని కోరుతున్నారు.

Read Also:: రైల్లో ముద్దు పెట్టుకుంటే ఏమవుతుందో తెలుసా? ఇవేం రూల్స్ అండి బాబు.. చంపేస్తారా?

Related News

Digital Rent Agreement: ఈ రూల్ తెలియకుండా ఇల్లు అద్దెకు ఇస్తే రూ. 5000 జరిమానా కట్టక తప్పదు..

Real Estate: ఈ విషయాలు తెలియకుండా ‌ఫార్మ్ లాండ్స్ కొంటే భారీ నష్టం తప్పుదు..అడ్వర్టయిజ్‌మెంట్స్ చూసి మోసపోకండి..

Gold Particles: మురుగునీటి నుంచి భారీగా బంగారం ఉత్పత్తి.. లక్షల్లో సంపాదన..? ఎక్కడో తెలుసా?

Free Tempered Glass: టెంపర్డ్ గ్లాస్ డబ్బులు పెట్టి కొంటున్నారా? ఇకపై ఫ్రీగా పొందండిలా!

Jio Cheapest Plan: జియో చీపెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్, దీనితో లాభమేంటో తెలుసా?

Jio Offers: జియో నుంచి అదిరిపోయే ఆఫర్, 11 నెలలకు జస్ట్ ఇంతేనా?

Big Stories

×