IPOs: వచ్చే వారం ప్రైమరీ మార్కెట్ లో ఐపీవోల సందడి నెలకొంది. వరుసగా 11 కంపెనీలు ఐపీఓలకు వస్తున్నాయి. ఐసీఐసీఐ ఏఎంసీ, కరోనా రెమిడీస్, వేక్‌ఫిట్ ఇన్నోవేషన్ వంటి లిస్టింగ్ కంపెనీలతో పాటు కేఎస్‌హెచ్ ఇంటర్నేషనల్ ఐపీఓ సబ్‌స్క్రిప్షన్‌తో వచ్చే వారం ప్రైమరీ మార్కెట్‌లో సందడి నెలకొంది. డిసెంబర్ 22 నుంచి 26 మధ్య మొత్తం 11 ఐపీఓలు సబ్‌స్క్రిప్షన్ కు రానున్నాయి. వీటిల్లో ఒకటి మెయిన్ బోర్డు కాగా, మిగిలినవి ఎస్‌ఎంఈ కేటగిరీ.
2025 ముగియడానికి ఇంకా కేవలం పది రోజులు మాత్రమే మిగిలి ఉంది. కానీ దేశంలో ఐపీఓల ఫీవర్ ఎక్కడా తగ్గడంలేదు. గత కొన్ని రోజులుగా స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారులు ఐసీఐసీఐ ఏఎంసీ, మీషో, గ్రో మొదలైన బంపర్ లిస్టింగ్ వరుసగా ఉన్నాయి. గుజరాత్ కిడ్నీ అండ్ సూపర్ స్పెషాలిటీ లిమిటెడ్, ధారా రైల్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్, సుండ్రెక్స్ ఆయిల్ కంపెనీ లిమిటెడ్, ఈపీడబ్ల్యూ ఇండియా లిమిటెడ్ మొదలైన ఐపీఓలు వచ్చే వారం సబ్‌స్క్రిప్షన్ మొదలుకానున్నాయి.
నిఫ్టీ 50 ఈ వారాన్ని 47 పాయింట్ల స్వల్ప లాభంతో 25,966.4 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 70 పాయింట్లు తగ్గి 84,929 వద్ద ఉంది. భారతీయ ఈక్విటీ మార్కెట్ ఈ వారం ఒడిదుడుకులు ఎదుర్కొంది. చివరి ట్రేడింగ్ సెషన్‌లో బెంచ్‌మార్క్ సూచీలు నష్టాలను తగ్గించుకుని, మార్పు లేకుండా వారాన్ని ముగించాయి.
గుజరాత్ కిడ్నీ సూపర్ స్పెషాలిటీ ఐపీఓ డిసెంబర్ 22న సబ్‌స్క్రిప్షన్ ప్రారంభం కానుంది. మెయిన్‌బోర్డ్ ఐపీఓ రూ. 250.8 కోట్ల విలువైన బుక్‌బిల్డ్ ఇష్యూ కానుంది. రూ. 250.8 కోట్ల విలువైన 2.2 కోట్ల షేర్లను ఇష్యూ చేయనున్నారు. ఐపీఓ సబ్‌స్క్రిప్షన్ డిసెంబర్ 24న ముగుస్తుంది. షేర్ల కేటాయింపు డిసెంబర్ 26 ఉంటుంది. ఈ ఐపీఓ బ్యాండ్ ధరను ఒక్కో షేరుకు రూ. 108 నుండి రూ. 114గా నిర్ణయించారు. దరఖాస్తు లాట్ సైజు 128గా నిర్ణయించారు. రిటైల్ పెట్టుబడిదారులు రూ. 14,592తో లాట్ కొనుగోలు చేయవచ్చు.
ధారా రైల్ ప్రాజెక్ట్స్ ఎస్ఎంఈ ఐపీఓ డిసెంబర్ 23న సబ్‌స్క్రిప్షన్ ప్రారంభమవుతుంది. డిసెంబర్ 26న ముగుస్తుంది. ఈ ఐపీఓ రూ. 50.2 కోట్ల విలువైన బుక్ బిల్డ్, 0.4 కోట్ల షేర్లు ఇష్యూ చేయనున్నారు. ఐపీఓ డిసెంబర్ 26న ముగుస్తుంది. ఐపీఓ కేటాయింపు డిసెంబర్ 29, 2025న ఖరారు కానుంది. డిసెంబర్ 31న తాత్కాలిక లిస్టింగ్ తేదీతో IPO NSE-SMEలో లిస్ట్ చేస్తారు. IPO రేట్ బ్యాండ్ ఒక్కో షేరుకు రూ. 120-126గా నిర్ణయించారు. దరఖాస్తు లాట్ సైజు 1,000 కాగా కనీస పెట్టుబడి మొత్తం రూ. 2,52,000 (2,000 షేర్లు) నిర్ణయించారు. సన్‌డ్రెక్స్ ఆయిల్, శ్యామ్ ధని ఇండస్ట్రీస్ వచ్చే వారమే ఐపీఓలకు రానున్నాయి.
Also Read: Gold Rates Dropped: ఆకాశం నుంచి నేలకు.. భారీగా పతనమైన బంగారం ధర.. నేడు తులం ఎంతంటే?
భాయ్ కాకాజీ పాలిమర్స్ రూ.105.17 కోట్లు, అపోలో టెక్నో ఇండస్ట్రీస్ రూ.47.96 కోట్లు చొప్పున డిసెంబర్ 23న సబ్‌స్క్రిప్షన్‌కు రానున్నాయి. 26న ముగుస్తాయి. ఈ టు ఈ ట్రాన్స్‌పోర్టేషన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రూ.84.22 కోట్లు సమీకరించేందుకు డిసెంబర్ 26న సబ్‌స్క్రిప్షన్‌కు వస్తుంది. డిసెంబర్ 30న సబ్‌స్క్రిప్షన్ ముగుస్తుంది.