Low Cost Plans: ఇంటర్నెట్ డేటాతో పనిలేకుండా మెుబైల్ నెంబర్లను యాక్టివ్ ఉంచే ప్లాన్ లను విడుదల చేయాలని టెలికాం సంస్థలను TRAI ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎయిర్ టెల్, జియో, విఐ.. బడ్జెట్ లో సరికొత్త సిమ్ యాక్టివ్ ప్లాన్స్ ను తీసుకొచ్చాయి. ఒకసారి రీఛార్జ్ చేయడం ద్వారా నిర్దేశిత కాలం వరకూ డేటా లేకపోయినా.. ఫోన్ కాల్స్, ఎస్ఎంస్ లు చేసుకోవచ్చు.
రూ.469 రీఛార్జ్ ప్లాన్: జియో తన ఫీచర్ ఫోన్ యూజర్ల కోసం రూ.469 నయా రీఛార్జ్ ప్లాన్ ను తీసుకొచ్చింది. దీనిని రీఛార్జ్ చేసుకోవడం ద్వారా 84 రోజుల పాటు అపరిమిత కాల్స్ పొందవచ్చు. అలాగే 900 ఫ్రీ ఎస్ఎంఎస్ లను సొంతం చేసుకోవచ్చు. ఈ రీఛార్జ్ ప్లాన్ లో రోమింగ్ కాల్స్ సైతం ఫ్రీగా పొందవచ్చు.
రూ.1,748 ప్లాన్: దాదాపు ఏడాది వరకూ అన్ లిమిటెడ్ కాల్స్ కోరుకునే వారు ఈ ప్లాన్ ను రీఛార్జ్ చేసుకోవచ్చు. 336 రోజుల అపరిమిత కాల్స్ కు ఈ ప్లాన్ అవకాశం కల్పిస్తుంది. అదే విధంగా 3600 ఫ్రీ ఎస్ఎంస్ లు పొందవచ్చు.
రూ. 103 ప్లాన్: సిమ్ యాక్టివ్ ప్లాన్స్ కు సంబంధించి గతంలోనే ఈ చౌకైనా ప్లాన్ ను జియో తీసుకొచ్చింది. దీని ద్వారా 28 రోజుల పాటు అపరిమిత కాల్స్ పొందవచ్చు. అలాగే 5GB డేటా కూడా రానుంది.
రూ.469 ప్లాన్: భారతీ ఎయిర్ టెల్ కొత్తగా ఈ ప్లాన్ లాంచ్ చేసింది. దీని కింద 84 రోజుల పాటు అపరిమిత కాల్స్, 900 ఉచిత ఎస్ఎంస్ లు పొందవచ్చు.
రూ.1849 ప్లాన్: సంవత్సర కాలం పాటు ఉండే సిమ్ యాక్టివ్ ప్లాన్ కావాలనుకుంటే దీనిని పరిశీలించవచ్చు. 365 ఫ్రీ కాల్స్, 3600 ఎస్ఎంస్ లు, ఫ్రీ రోమింగ్ కాల్స్ పొందవచ్చు.
Also Read: Air Coolers Launch Mar 2026: ఏసీలు ఎందుకు దండగా.. ఈ కూలర్లు ఉండగా.. మార్చిలో క్రేజీ కూలర్లు లాంచ్!
రూ.470 ప్లాన్: వొడాఫోన్ ఇండియా సైతం జియో, ఎయిర్ టెల్ తరహాలోనే కొత్తగా సిమ్ యాక్టివ్ ప్లాన్స్ ను విడుదల చేసింది. రూ.470 రీఛార్చ్ చేసుకుంటే 84 రోజుల పాటు అన్ లిమిటెడ్ కాల్స్, ఉచిత ఎస్ఎంస్ లు పొందవచ్చు.
రూ.1849 ప్లాన్: ఏడాది పొడవునా రీఛార్జ్ ప్లాన్ కావాలనుకుంటే ఈ ప్లాన్ ట్రై చేయండి. దీని ద్వారా 365 రోజుల పాటు అపరిమిత కాల్స్, ఎస్ఎస్ఎస్ లు సొంతం చేసుకోవచ్చు.
Also Read: Hyderabad Crime: రూ.56 లక్షల ఏటీఎం డబ్బుతో జంప్.. ఎట్టకేలకు చిక్కిన వ్యాన్ డ్రైవర్