E-Paper
Advertisement

మెటాలో లేఆఫ్స్ కలకలం.. తొలుత వర్క్ ఫ్రం హోమ్, ఆ తర్వాత 8 వేల మంది ఇంటికి

మెటాలో లేఆఫ్స్ కలకలం.. తొలుత వర్క్ ఫ్రం హోమ్, ఆ తర్వాత 8 వేల మంది ఇంటికి
Advertisement

Meta: సోషల్ మీడియా దిగ్గజం మెటాలో లేఆఫ్స్ తీవ్ర కలకలం రేపింది. ప్రపంచవ్యాప్తంగా 8 వేల మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. బుధవారం ఉదయం నుంచి ఉద్వాసన పలికే ప్రక్రియ మొదలుపెట్టేసింది. ఉన్నట్లుండి సడన్‌గా మెయిల్స్ పంపడంపై ఉద్యోగాలు ఒక్కసారిగా షాకయ్యారు.

మెటాలో లేఆఫ్స్ కలకలం

Advertisement

ప్రపంచంలోని దిగ్గజ కంపెనీలు ఉద్యోగాల తొలగింపు ప్రక్రియ తీవ్రతరం చేశాయి. రోజుకో టెక్ కంపెనీ లేఆఫ్స్ అంటూ ప్రకటన చేయడం ఉద్యోగులు గందరగోళంలో పడేసింది. వాటి బాటలో సోషల్ మీడియా దిగ్గజం మెటా కూడా చేరిపోయింది. లేఆఫ్స్‌లో భాగంగా ఇంజనీరింగ్, ప్రొడక్ట్ టీమ్‌ల్లో పని చేసే దాదాపు 8 వేలమంది ఉద్యోగులపై వేటు పడింది.

కంపెనీని సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు, అనవసరపు ఖర్చులు తగ్గించుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు మార్క్ జుకర్‌బర్గ్. ఈ నేపథ్యంలో తొలుత ఉద్యోగులను ఇంటి నుంచే పని చేయాలని కంపెనీ సూచనలు చేసింది. ఆ తర్వాత తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో సింగపూర్‌లోని ఏసియన్ హబ్ కార్యాలయం నుంచి మెయిల్‌ ద్వారా సమాచారం ఇవ్వడం మొదలుపెట్టారు.

Advertisement

తొలుత వర్క్ ఫ్రం హోమ్, ఆ తర్వాత 8 వేల మంది ఇంటికి

ఉదయం లేచి మెయిల్స్ చూసి ఒక్కసారిగా షాకయ్యారు ఉద్యోగులు . మెటా ప్లాట్‌ఫామ్స్ మొత్తం ఉద్యోగులలో దాదాపు 10 శాతం అంటే సుమారు 8,000 మందిని తొలగించింది. లేఆఫ్స్‌కు ముందు మెటాలో సుమారు 78 వేల మంది ఉద్యోగులు ఉండేవారు. వేలల్లో ఉద్యోగులు బయటకు వెళ్లిపోయారు.. పోతున్నారు కూడా.

రానున్న రోజుల్లో ఇంజనీరింగ్, ప్రొడక్ట్ విభాగాల్లో మరిన్ని కోతలు ఉండవచ్చనే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ ఏడాది ఏఐ కోసం 125-145 బిలియన్లు డాలర్లు ఖర్చు చేయాలని యోచిస్తున్నట్లు మెటా తెలిపింది.వివరాలు బయటకు పొక్కడంతో ఉద్యోగ కోతలను ధృవీకరించింది మెటా సంస్థ.

ALSO READ: భారీగా పెరిగిన బంగారం..ఈరోజు తులం గోల్డ్, కిలో వెండి రేట్లు ఇవే!

అధికారిక ప్రకటనకు ముందు కొంతమంది ఉద్యోగులు ల్యాప్‌టాప్ ఛార్జర్‌లను సేకరించడం ప్రారంభించినట్లు సమాచారం. వర్క్ ఫ్రమ్ హోమ్ ఆదేశం వల్ల ఉద్యోగాల తొలగింపులు నిశ్శబ్దంగా జరిగాయని అంటోంది. ఎలాంటి గొడవలు, సమావేశాలు లేవని చెబుతోంది.

సిస్కో సిస్టమ్స్ గత వారం 4,000 ఉద్యోగాలను తొలగించింది. మైక్రోసాఫ్ట్, అమెజాన్, డిస్నీ, ASML వంటి సంస్థలు ఉద్యోగాల్లో కోతలు విధించాయి. ఏప్రిల్‌లో ఒరాకిల్ సంస్థ వివిధ ప్రాంతాలలో తెల్లవారుజామున పంపిన ఈ-మెయిళ్ల ద్వారా సుమారు 20 వేల -30 వేల మంది ఉద్యోగులను తొలగించిన విషయం తెల్సిందే. ఒరాకిల్ దారిలో మెటా కూడా తెల్లవారుజామున మెయిన్స్ పంపించింది.

Related News

SIP ఇన్వెస్టర్లకు కొత్త సమస్య.. తగ్గుతున్న రాబడి.. కారణాలు ఇవే

బంగారం ధరలో హెచ్చుతగ్గులు, ఇవాళ మార్కెట్లో రేటు మాటేంటి?

క్లౌడ్ కిచెన్ బిజినెస్‌లో రూ.4 లక్షలు నష్టపోయిన దంపతులు.. కట్ చేస్తే 10 నెలల్లో రూ.2 కోట్ల టర్నోవర్

బ్యాంక్ ఖాతాదారులకు షాక్.. ఎటీఎంపై ఛార్జీలు, ఆపై తగిన బ్యాలెన్స్ లేకున్నా ఎడాపెడా బాదుడు

ఇంజినీర్లకు షాక్.. ఎంబిఏ గ్రాడ్యుయేట్లకు భారీగా పెరుగుతున్న డిమాండ్.. కారణం ఇదే

పేకమేడలా కూలిన స్టాక్‌మార్కెట్‌.. నిమిషాల వ్యవధిలో 5 లక్షల కోట్ల పైగా సంపద ఆవిరి! జపాన్ నుంచి మొదలు..

గోల్డ్ మార్కెట్‌ని దెబ్బ కొట్టిన ట్రంప్.. కొనుగోళ్లదారుల్లో ఉత్సాహం, బంగారం-వెండి ధరలు పతనం

200 అప్లికేషన్లు, 15 ఇంటర్వ్యూలు ఫెయిల్.. చివరికి డిష్‌వాషింగ్ జాబ్.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి వ్యధ

Big Stories

Advertisement
×