E-Paper
Advertisement

హెల్త్ కార్డ్‌ల జారీకి సర్కార్ గ్రీన్ సిగ్నల్..!

హెల్త్ కార్డ్‌ల జారీకి సర్కార్ గ్రీన్ సిగ్నల్..!
Advertisement

Health Cards: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు,పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య భద్రత కోసం తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నూతన ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ సమర్థవంతమైన అమలులో భాగంగా ప్రత్యేకంగా “ఎంప్లాయీ హెల్త్ కేర్ ట్రస్ట్” ను ఏర్పాటు చేస్తూ ఆర్థిక శాఖ మంగళవారం ప్రత్యేక ఉత్తర్వులు ఇచ్చింది. ఈ పథకం ద్వారా లబ్ధిదారులందరికీ హెల్త్ కార్డ్‌లను మంజూరు చేయనున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి డేటాను సేకరించి, ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని ప్రభుత్వం స్పష్టమైన గడువును విధించింది.మే 31 లోగా డేటా అప్‌లోడ్ తప్పనిసరి అంటూ ప్రభుత్వం సూచించింది. కొత్త హెల్త్ స్కీమ్ పరిధిలోకి వచ్చే ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు, వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యుల సమగ్ర వివరాలను సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

డేటా సేకరణలో..

1972 నాటి తెలంగాణ ఇంటిగ్రేటెడ్ మెడికల్ అటెండెన్స్ రూల్స్ (సెక్షన్-7) ప్రకారం అర్హులైన కుటుంబ సభ్యులు, డిపెండెంట్ల వివరాలను సేకరించనున్నారు. రాష్ట్రంలోని అన్ని సచివాలయ విభాగాలు, శాఖాధిపతులు, పెన్షన్ మంజూరు అధికారులు, డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ అధికారులు తక్షణమే రంగంలోకి దిగి ఈ డేటా సేకరణ ప్రక్రియను చేపట్టాలని ఆర్థిక శాఖ స్పెషల్ సెక్రటరీ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. సేకరించిన పూర్తి వివరాలను 31 మే , 2026 లోపు ఎలాంటి విఫలం కాకుండా ఐఎఫ్​ ఎమ్ ఐఎస్ హెచ్ ఆర్మోడ్యూల్ లో డీడీఓ లాగిన్ల ద్వారా అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక ఈ ప్రక్రియను అత్యంత ప్రాధాన్యత కలిగిందని ప్రభుత్వం పేర్కొంది. డేటా సేకరణలో ఎలాంటి తప్పులు దొర్లకుండా, నిర్దేశిత గడువులోగా ఆన్‌లైన్ ప్రక్రియ పూర్తయ్యేలా చూసే బాధ్యతను సంబంధిత అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్‌మెంట్లకు అప్పగించారు.

Advertisement

Also Read: మా ఇల్లే కదా.. నన్ను ఎవరు చూడరు అని అలా చేస్తున్నారా.. అయితే మీ పని ఖతం..?

సమర్పించాల్సిన ముఖ్యమైన వివరాలు..

​ఉద్యోగులు ,పెన్షనర్లు తమతో పాటు తమ కుటుంబ సభ్యులకు సంబంధించి ప్రత్యేక ప్రొఫార్మా ద్వారా వివరాలు అందించాల్సి ఉంటుంది.పేరు, ఐడీ నంబర్, ఆధార్ నంబర్, పుట్టిన తేదీ, మొదటి నియామకపు తేదీ, ప్రస్తుత/శాశ్వత చిరునామా, మొబైల్ నంబర్ మరియు మెరిటల్ స్టేటస్. ఇక పేన్షనర్లైతే పేరు, పీపీవో నంబర్, రిటైర్డ్ ఉద్యోగి హోదా, రిటైర్మెంట్ తేదీ, పెన్షన్ రకం (సర్వీస్/ఫ్యామిలీ/డిపెండెంట్), ఆధార్, అడ్రస్ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యుల పేరు, ఉద్యోగితో గల బంధుత్వం, పుట్టిన తేదీ, వయస్సు, ఆధార్ నంబర్, వారు ఉద్యోగం చేస్తున్నారా లేదా చదువుకుంటున్నారా? అనే పూర్తి వివరాలను సమర్పించాలి.

Advertisement

Also Read: కులగణన లెక్కింపు వ్యవహారం.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు, ఆపై కీలక వ్యాఖ్యలు

Related News

వినాయకుడి దర్శనానికి వెళ్లి వస్తుండగా.. ఇద్దరి ప్రాణాలు గాల్లో

ప్రభుత్వ స్కూల్ పిల్లలకు గుడ్ న్యూస్.. యూనిఫాంలో కొత్త మార్పులు!

కల్వకుంట్ల ఫ్యామిలీ భూములపై రచ్చ.. మధ్యలో రైతుల్ని ఎందుకు లాగుతున్నారు?..ఆది శ్రీనివాస్ ఫైర్

ఢిల్లీ కేంద్రంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాస్టర్ ప్లాన్.. వర్కౌట్ అయ్యేనా..?

తెలంగాణ యువతకు డెల్ సంస్థ బిగ్ ఆఫర్.. అన్నీ ఉచితం!

మూడు రోజుల డెడ్‌లైన్.. జూరాల ప్రాజెక్టు నీటిపై ఎంపీ డీకే అరుణ అల్టిమేటం?

అదనపు కట్నం కోసం కానిస్టేబుల్ వేధింపులు.. ఆత్మహత్య చేసుకున్న యువతి!

సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్.. 45 రోజుల్లో ఆ దరఖాస్తులకు పరిష్కారం..?

Big Stories

Advertisement
×