BigTV English

MG Comet @ Rs 6.99 Lakhs: దేశంలో అతి తక్కువ ధరలో లభిస్తున్న బెస్ట్ ఎలక్ట్రిక్ కారు ఇదే.. వారికి చాలా బెటర్

MG Comet @ Rs 6.99 Lakhs: దేశంలో అతి తక్కువ ధరలో లభిస్తున్న బెస్ట్ ఎలక్ట్రిక్ కారు ఇదే.. వారికి చాలా బెటర్

MG Comet @ Rs 6.99 Lakhs: ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ కార్ల హవా నడుస్తోంది. పెట్రోల్, డీజిల్ ధరలు అధికంగా పెరగడంతో చాలా మంది ఎలక్ట్రిక్ వెహికల్స్‌పై ఫోకస్ పెట్టారు. ఇందులో బాగంగానే ప్రముఖ కంపెనీలు సైతం మారుతున్న టెక్నాలజీని దృష్టిలో ఉంచుకుని రకరకాల మోడళ్లను రిలీజ్ చేస్తున్నాయి. అయితే ఎన్ని మోడళ్లు రిలీజ్ అయినా.. ఫస్ట్ వాహన ప్రియులు మైలేజ్ విషయంలో వెనకడుగు వేసేవారు. కానీ ఇప్పుడు ధరల విషయంలో వెనక్కి తగ్గుతున్నారు.


ముఖ్యంగా చెప్పాలంటే మధ్యతరగతి ఉద్యోగులు తక్కువ ధరలో మంచి ఫీచర్లు గల ఒక ఎలక్ట్రిక్ కారును కొనుక్కోవాలని అనుకుంటుంటారు. కానీ వారి ఆర్థిక స్థోమతకు తగ్గ ఒక్క ఈవీ కూడా అందుబాటులో లేదు. ఈ క్రమంలో తాజాగా ఒక ఎలక్ట్రిక్ కారు తక్కువ ధరను కలిగి ఉంటూ వాహన ప్రియులను అట్రాక్ట్ చేస్తోంది.

భారత ఆటో మొబైల్ మార్కెట్‌లో ఎంతో ప్రజాదరణ అందుకున్న ప్రముఖ కార్ ఎంజీ కామెట్. ఈ కారుకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. చిన్నగా కనిపించడమే కాకుండా అద్భుతమైన లుక్, డిజైన్‌తో అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ కారు కేవలం రూ.6.99 లక్షల నుంచి రూ.9.53 లక్షల మధ్య లాంచ్ అయింది. ఇది మధ్యస్త ఉద్యోగులకు చాలా మంచి ఎంపికగా చెప్పుకోవచ్చు.


Also Read: బాబోయ్.. కాస్ట్‌లీగా మారిన ఆ చీపెస్ట్ EV కార్.. ప్రజెంట్ ప్రైస్ ఎంతో తెలుసా..?

ఇది తన సేల్స్‌లో అదరగొడుతోంది. ఈ కారు ఇప్పటికి మొత్తం 4,493 యూనిట్ల సేల్స్‌ను సాధించి దుమ్ము దులిపేసింది. గత నెలలో సుమారు 1200 యూనిట్లు సేల్ చేసిందంటే దీనికి వాహన ప్రియుల నుంచి ఆదరణ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ ఎంజీ కామెట్ ఎలక్ట్రిక్ కారు 42ps/110nm పర్మినెంట్ మాగ్నెట్ సింక్రోనస్ మోటార్‌ను కలిగి ఉంది. ఇది 17.3 kwh లిథియం అయాన్ బ్యాటరీని కలిగి ఉంది. దీనికి ఒక్కసారి ఛార్జింగ్ పెడితే దాదాపు 230 కి.మీ మైలేజీని అందిస్తుంది.

ఎంజీ కామెట్ ఎగ్జిక్యూటివ్ వేరియంట్ రూ.6.99 లక్షల ధరలో అందుబాటులో ఉంది. అలాగే ఎక్సైట్ వేరియంట్ రూ.7.98 లక్షలు, ఎక్సైట్ ఎఫ్‌సి వేరియంట్ రూ.8.45 లక్షలు, ఎంజీ కామెట్ స్పెషల్ వేరియంట్ రూ.9 లక్షలు, స్పెషల్ ఎఫ్‌సి వేరియంట్ రూ.9.37 లక్షల ధరతో అందుబాటులో ఉన్నాయి.

Tags

Related News

E20 Petrol: E20 పెట్రోల్ అంటే ఏంటి? దానివల్ల వాహనాలకు లాభమా? నష్టమా?

Income Tax Bill: ఇన్ కమ్ ట్యాక్స్ బిల్-2025 మనకు ఒరిగేదేంటి? తరిగేదేంటి?

Minimum Balance Account: బ్యాంకు మినిమమ్ బ్యాలెన్స్ కొత్త నియమాలు.. పెనాల్టీ తప్పదా?

Trump On Gold: దిగొచ్చిన పసిడి.. ‘బంగారు’ మాట చెప్పిన ట్రంప్, ఏమన్నారు?

PM-KMY Scheme: కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఈ స్కీంలో నెలకు రూ. 55 కడితే చాలు..ఉద్యోగం చేయకపోయినా పెన్షన్ గ్యారంటీ..

BSNLలో 365 రోజుల వ్యాలిడిటీ ప్లాన్స్ ఇవే…ఏకంగా 600 జీబీ డేటా పొందే ఛాన్స్…ఎంత రీచార్జ్ చేయాలంటే..?

Big Stories

×