Kurukshetra on OTT : ఓటిటిలో యానిమేటెడ్ స్టోరీలు హల్చల్ చేస్తున్నాయి. ‘మహావతార్ నరసింహ’ థియేటర్లలో ఒక సెన్సేషన్ సృష్టించింది. ఇప్పుడు ఒత్తిడిలో కూడా ట్రెండ్ సెట్ గా మారింది. ఇప్పుడు అదే తరహాలో ‘కురుక్షేత్ర పార్ట్ 1’ అనే యానిమేటెడ్ వెబ్ సిరీస్ ఓటీటీలో కి ఎంట్రీ ఇచ్చింది. ఈ కథ మహాభారతంలో జరిగే కురుక్షేత్ర యుద్ధం చుట్టూ తిరుగుతుంది. విజువల్ ఎఫక్ట్స్ తో ఈ సిరీస్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటోంది. ఇది ఏ ఓటీటీలో ఉంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే …
‘కురుక్షేత్ర పార్ట్ 1’ అనిమేటెడ్ యాక్షన్ సిరీస్. దీనిని ఉజాన్ గంగూలీ, అను సిక్కా దర్శకత్వం వహించారు. 9 ఎపిసోడ్ లతో వచ్చిన ఈ సిరీస్ 2025 అక్టోబర్ 10 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అయింది. హిందీ, ఇంగ్లీష్, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం డబ్బింగ్‌లో అందుబాటులో ఉంది. IMDbలో 8.1/10 రేటింగ్ తో దూసుకుపోతోంది.
పాండవులను, కౌరవులు కుట్ర చేసి జూదంలో ఓడించిన తరువాత, 12 సంవత్సరాలు అరణ్యవాసం, ఓక సంవత్సరం అజ్ఞాతవాసం చేస్తారు. ఆ తరువాత కేవలం నాలుగు ఊర్లు ఇవ్వమని, కౌరవుల వద్దకి పాండవులు రాయబారం పంపుతారు. అయితే దీనికి ఒప్పుకోకపోవడంతో ఈ కురుక్షేత్ర యుద్ధం మొదలవుతుంది. దీనిని ప్రధాన అంశంగా చేసుకునే ఈ ‘కురుక్షేత్ర పార్ట్ 1’ తెరకెక్కింది. ఇక వందమంది కౌరవులతో, ఐదు మంది పాండవులు యుద్ధానికి సై అంటారు. ఈ రణరంగం ఒక అద్భుతం. ప్రపంచంలో ఏ యుద్ధానికి ఇంత ప్రత్యేకత లేదు.
Read Also : ఏం సిరీస్ గురూ… సరస్సులో అమ్మాయి మృతదేహం… ప్రైవేట్ వీడియో లీక్… క్షణక్షణం ఉత్కంఠ, బుర్రబద్దలయ్యే ట్విస్టులు
ఈ యానిమేటెడ్ సిరీస్ మహాభారతంలోని కురుక్షేత్ర యుద్ధాన్ని, 18 వీరుల పోరాటాలను చూపిస్తుంది. 18 రోజుల పాటు సాగే ఈ కురుక్షేత్ర యుద్ధంలో పాండవులు, కౌరవులు, ద్రౌపది తో పాటు మిగతా పవర్ ఫుల్ పాత్రలు కూడా ఉంటాయి. ప్రతి ఎపిసోడ్ ఒక వీరుడి యుద్ధ శైలిని చూపిస్తుంది. మొదటి ఎపిసోడ్ భీష్ముని కథతో మొదలవుతుంది. ఇందులో పాండవులు అతన్ని ఎలా ఓడించాలో ఆలోచిస్తారు. భీష్ముని శక్తి కూడా వాళ్లకి తెలిసి వస్తుంది. ఈ వీరులతో యుద్ధం 18 రోజులు ఎలా సాగిందో క్రమంగా చూపిస్తుంది. పార్ట్ 1లో 9 ఎపిసోడ్‌లు ముగిసిన తర్వాత పార్ట్ 2 కోసం ఆడియన్స్ లో క్యూరియాసిటీ పెరిగిపోతోంది.