BigTV English

Prabhas : నెక్స్ట్ ఇయర్ కు నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్, రెండు సినిమాలు సిద్ధం

Prabhas : నెక్స్ట్ ఇయర్ కు నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్, రెండు సినిమాలు సిద్ధం

Prabhas : ఒకప్పుడు పెద్ద హీరోల సినిమాలు సంవత్సరానికి కనీసం రెండు వచ్చేవి. అవి బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి సక్సెస్ సాధించాయి అనే విషయం పక్కన పెడితే. చాలామంది స్టార్ హీరోలు తమ అభిమానులకు సంవత్సరంలో రెండు సినిమాలు తో ముందుకు వస్తున్నారు అంటే దానికి మించిన ఆనందం ఇంకోటి లేదు.


ఇప్పుడు మాత్రం స్టార్ హీరో ఒక సినిమా కోసం దాదాపు రెండు నుంచి మూడు ఏళ్లు తీసుకుంటున్నారు. ఇటువంటి తరుణంలో ప్రభాస్ మాత్రం సంవత్సరానికి రెండు సినిమాలు వచ్చేలా ప్లాన్ చేస్తున్నాడు. 2026 సంవత్సరం ప్రభాస్ అభిమానులకు బాగా కలిసొస్తుంది అని చెప్పాలి. ఎందుకంటే ప్రభాస్ 2026లో తను నటిస్తున్న రెండు సినిమాలను విడుదల చేసే ప్లానింగ్ లో ఉన్నాడు.

సంక్రాంతి రాజా సాబ్

మారుతి దర్శకత్వంలో ప్రభాస్ రాజా సాబ్ (The Raja Saab) అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. దీనికి కారణం బాహుబలి (Bahubali) సినిమా తర్వాత అన్ని సీరియస్ సినిమాలు మాత్రమే చేసిన ప్రభాస్, ఈసారి ఎంటర్టైన్మెంట్ సినిమాతో ప్రేక్షకులు ముందుకు వస్తున్నాడు.


మొదట ఈ సినిమాని డిసెంబర్ నెలలో విడుదల చేయడానికి ప్లాన్ చేశారు. కానీ సంక్రాంతి సీజన్ బాగా కలిసి వస్తుంది కాబట్టి వాయిదా వేశారు. ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ కూడా విడుదల అయిపోయింది. ట్రైలర్ చూసిన తర్వాత ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ. ఒక సినిమా రిలీజ్ కి మూడు నెలల ముందు ట్రైలర్ వదలడం అనేది మామూలు విషయం కాదు. సినిమా మీద కూడా చాలా నమ్మకం ఉండి ఉండాలి. ట్రైలర్ అయితే వదిలారు కానీ కథ మాత్రం ఎవరికీ అంతుచిక్కలేదు.

దసరా ఫౌజీ 

హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ ఫౌజీ అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మీద కూడా భారీ అంచనాలు ఉన్నాయి. సీతారామం వంటి సక్సెస్ఫుల్ సినిమా తర్వాత హను చేస్తున్న సినిమా ఇది. ఈ సినిమా ఒక యుద్ధ నేపథ్యంలో జరుగుతుంది అని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో ప్రభాస్ సరసన ఇమాన్వి నటిస్తుంది.

ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానుంది. ప్రేమ కథ సినిమాలను హను బాగా డీల్ చేస్తాడు అని అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమాను ఎలా డీల్ చేయబోతున్నాడు అని అందరికీ ఒక రకమైన క్యూరియాసిటీ ఉంది. ఏదేమైనా ప్రాజెక్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అని అంచనాలైతే ఉన్నాయి.

Also Read: Akhanda2 Thaandavam : థియేటర్స్ లో శివతాండవం, తమన్ మామూలోడు కాదు

Related News

Siddu Jonnalagadda : తెలుసు కదా ట్రైలర్ కు ఎలివేషన్స్. నాగ వంశీ, సుమ ఆసక్తికర ట్విట్స్

Akhanda2 Thaandavam : థియేటర్స్ లో శివతాండవం, తమన్ మామూలోడు కాదు

AA 22xA6: అట్లీ సినిమా కోసం అల్లు అర్జున్ కళ్ళు చెదిరే రెమ్యూనరేషన్..  ఇండస్ట్రీలోనే రికార్డు!

Director Teja : బుర్ర లేని డైరెక్టర్ లతో పని చేయడం వల్ల నేను డైరెక్టర్ అయ్యాను

Samantha: సమంత ఇంట ప్రత్యేక పూజలు..అదే కారణమా… ఫోటోలు వైరల్!

Devi Sri Prasad: దేవీశ్రీ ఎక్కడ? కొంపదీసి ఇండస్ట్రీ దూరం పెడుతోందా?

Jai hanuman: జై హనుమాన్ సినిమాపై బిగ్ అప్డేట్ ఇచ్చిన రిషబ్.. ఎదురుచూపులు తప్పవా?

Big Stories

×