Chirala Beach Accident: బాపట్ల జిల్లా చీరాలలో విషాద ఘటన చోటుచేసుకుంది. సముద్ర స్నానానికి వెళ్ళి ఐదుగురు మృత్యువాత పడ్డారు. మరో ముగ్గురిని స్థానికులు రక్షించారు.
ఆదివారం కావడంతో.. సరాదాగా చీరాల బీచ్ వద్దకు వచ్చారు. అక్కడ సముద్రంలో స్నానం చేస్తుండగా.. అలలతాకిడికి ఎనిమిది మంది గల్లంతయ్యారు. వెంటనే స్థానికు గమనించి ముగ్గురిని సురక్షితంగా బయటకు తీశారు. మరో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.
వారిలో ముగ్గురు మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. మృతిచెందిన వారంతా అమరావతిలోని విట్ యూనివర్శిటికీ చెందిన విద్యార్ధులు బృందంగా గుర్తించారు పోలీసులు.
ఇదిలా ఉంటే.. రాజేంద్రనగర్ లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. డైరీ ఫాం మూసీలో పడి ఇద్దరు గల్లంతయ్యారు. హిమాయత్ సాగర్ బ్యాక్ వాటర్ మూసీ వద్దకు ఇద్దరు యువకులు ఈతకు వచ్చారు. ఈ క్రమంలో ప్రమాదవ శాత్తు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. వీరిని గాలించేందుకు గజ ఈతగాళ్లు, ఎన్‌డిఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. యువకుల కోసం గాలిస్తున్నారు.
రాజేంద్రనగర్ డైరీ ఫాం దగ్గర మూసీ తీరానికి ఆరుగురు స్నేహితులు కలిసి వచ్చినట్లు సమాచారం. అందరూ కలసి మూసీ లో ఈతకు దిగారు. అయితే ఆ ప్రాంతంలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో.. ఇద్దరు యువకులు మధ్యలోకి వెళ్లి తిరిగి రాలేకపోయారు. ఈ దృశ్యం చూసిన స్నేహితులు భయంతో తీరానికి చేరుకున్నారు. అందులో ఇద్దరు భయంతో అక్కడి నుంచి పారిపోయారు. మరో ఇద్దరు మాత్రం వెంటనే స్థానికులకు, పోలీసులకు సమాచారం అందించారు.
Also Read: హై టెన్షన్.. అనకాపల్లి హైవే క్లోజ్! మత్స్యకారులు Vs పోలీసులు
సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ పోలీసులు, రెవెన్యూ అధికారులు, గజ ఈతగాళ్లు తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. చర్యలు ప్రారంభించారు.