Personal loan: పర్సనల్ లోన్ అనేది మన జీవితంలో కొన్ని అత్యవసర పరిస్థితుల్లో ఒక బలం లాంటిది. అకస్మాత్తుగా ఎక్కువ ఖర్చులు, వైద్య సేవల అవసరం, పిల్లల చదువుల ఖర్చులు, పండగల సన్నాహాలు ఇలాంటి సందర్భాల్లో మనకు తక్షణమే డబ్బు కావాలని అనిపిస్తే, పర్సనల్ లోన్ మనకు ఒక తాత్కాలిక సహాయం చేస్తుంది.
అప్పు వెనుక కష్టాలు
కానీ ఇందులో ఒక ముఖ్యమైన విషయం మనం మర్చిపోతున్నాము. అప్పు సులభంగా వస్తుందనడం వలన దాని వెనుక ఉన్న కష్టాలు, భవిష్యత్తులో ఎదురయ్యే భారం గురించి చాలా మంది తెలియకుంటారు. పర్సనల్ లోన్ తీసుకోవడం అంటే కేవలం డబ్బు తీసుకోవడం మాత్రమే కాదు. దానితో పాటు వచ్చిన వడ్డీ, ఫీజులు, ఆలస్యం చేసిన పేమెంట్ల పరిమితులు, ముందుగానే చెల్లిస్తే వచ్చే పేమెంట్ ఇవన్నీ ముందే అర్ధం చేసుకోవాలి.
మనం చిన్న మొత్తానికి తక్కువ వడ్డీ అని ఊహించి లోన్ తీసుకుంటే, కొన్నిసార్లు అది ఎక్కువ కాలం పడితే మొత్తంగా పెద్ద ఖర్చు అవుతుంది. కొన్ని సందర్భాల్లో మనం ముందే మొత్తాన్ని చెల్లించాలనుకుంటే, దానికి అనుగుణంగా పేమెంట్ (చార్జస్) ఉంటాయి. చిన్నగా అనిపించినా, మొత్తం చూస్తే అది పెద్ద నష్టంగా మారవచ్చు.
క్రెడిట్ కార్డ్ ఆలస్యంగా చెల్లిస్తే
మరిన్ని సమస్యలు పర్సనల్ లోన్ క్రెడిట్ కార్డ్ పై ఉంటాయి. పేమెంట్లు సమయానికి జరిగితే మన ఆర్థిక స్థితి మెరుగవుతుంది, భవిష్యత్తులో అవసరమైనప్పుడు మనకు సహాయం చేస్తుంది. కానీ ఆలస్యంగా చెల్లిస్తే, భవిష్యత్తులో కొత్త లోన్, క్రెడిట్ పొందడం కష్టం అవుతుంది.
Also Read: Temple mystery: గుడి తలుపులు మూసేసిన వెంటనే వింత శబ్దాలు..! దేవతల మాటలా? అర్థం కాని మాయాజాలం!
ఒత్తిడి పెరుగుతుంది
ఎప్పుడూ మనం మన నెలవారీ ఖర్చులు, ఇతర అప్పులు, అవసరాలు చూసి లోన్ ఈఎంఐ క్రమాన్ని సరిపరిచుకోవాలి. ఒకచోట లోన్ ఈఎంఐ ఎక్కువైతే, మన జీవనశైలిలో ఒత్తిడి పెరుగుతుంది. ఒక చిన్న లోన్, సరైన పద్ధతిలో నిర్వహించకపోతే, జజీవితాన్ని ఆర్థిక సమస్యల లోతుల్లోకి తీయవచ్చు.
షరతులు పూర్తిగా తెలుసుకోవాలి
ఇంకా రుణదాత ఎంచుకోవడంలో జాగ్రత్త ఉండాలి. ఒకే రకమైన లోన్ అయినా విధానాలు, రేట్లు, ఫీజులు వేర్వేరు ఉంటాయి. కొందరు తక్షణమే డబ్బు ఇస్తారు కానీ ఫీజులు ఎక్కువగా వసూలు చేస్తారు. కొందరు మరీ నిదానంగా అంగీకరిస్తారు కానీ ఇంట్రెస్ట్ తక్కువ. ప్రతి రుణదాత యొక్క నియమాలు, షరతులు, దాచిన ఖర్చులు పూర్తిగా తెలుసుకోవాలి.
భారంగా మారే అవకాశం
పర్సనల్ లోన్ తీసుకున్న తర్వాత కూడా అప్రమత్తంగా ఉండాలి. ఏదైనా ఆకస్మిక పరిస్థితులు రావడం సాధారణం. ఆ సమయంలో ఈఎంఐ క్రమం తప్పక నిర్వహించడానికి బ్యాకప్ ప్రణాళిక ఉండాలి. లేకపోతే చిన్న సహాయం, పెద్ద భారంగా మారిపోతుంది. ప్రణాళిక ఉంటే మాత్రమే ఆ లోన్ మనకు సహాయం చేస్తుంది. లేకపోతే, తక్షణ సౌలభ్యం ఆర్థిక సంవత్సరాలు సమస్యలుగా మారుతుంది.