Big Stories

MG Hector Black Storm Lunching: కొత్త ఎంజీ హెక్టర్ బ్లాక్‌స్టార్మ్ ఈ రోజే లాంచ్.. ఫీచర్లు, స్పెసిఫికేషన్ల లిస్ట్ ఇదే..?

MG Hector Black Storm Launching Today in India: ప్రస్తుతం కార్లకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. అంతేకాకుండా మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా కొత్త కొత్త మోడళ్లు మార్కెట్‌లో వస్తున్నాయి. వాహన ప్రియుల సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని ప్రముఖ బ్రాండెడ్ కంపెనీలు ఎక్కడా రాజీ పడటంలేదు. అప్డేటెడ్ వెర్షన్లలో రకరకాల మార్పులు చేర్పులు చేసి మార్కెట్‌లో రిలీజ్ చేస్తూ ఆకట్టుకున్నాయి. అయితే ఇప్పటికే ఎన్నో కంపెనీలకు చెందిన కార్లు మార్కెట్‌లో రిలీజ్ అయి అట్రాక్ట్ చేశాయి. అందులో ఎంజీ మోటార్ ఇండియా కంపెనీకి చెందిన కార్లు ఒకటి.

- Advertisement -

MG మోటార్ ఇండియా గతేడాది అంటే 2023 మేలో గ్లోస్టర్ బ్లాక్‌స్టార్మ్‌ను, అదే ఏడాది 2023 సెప్టెంబర్‌లో ఆస్టర్ బ్లాక్‌స్టార్మ్ ఎడిషన్‌ను పరిచయం చేసిన సంగతి తెలిసిందే. అయితే కంపెనీ ఇప్పుడు తన బెస్ట్ సెల్లింగ్ హెక్టర్ SUVకి చెందిన స్పోర్టీ ఆల్-బ్లాక్ స్పెషల్ ఎడిషన్‌ను విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది.

- Advertisement -

‘MG హెక్టర్ బ్లాక్‌స్టార్మ్ ఎడిషన్’ పేరుతో ఈ మోడల్‌ రానుంది. ఇది ఈ రోజు అంటే 10 ఏప్రిల్ 2024న లాంచ్ కానుంది. ఈ నేపథ్యంలో కంపెనీ తన మోడల్ టీజర్‌ని విడుదల చేసింది. ఈ టీజర్ ప్రకారం.. ఈ స్పెషల్ ఎడిషన్ పూర్తిగా నలుపు రంగులో ఉంటుంది. ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు వైపులా రెడ్ హైలైట్‌లను కలిగి ఉంటుంది.

MG Hector Blackstorm
MG Hector Blackstorm

Also Read: క్రేజీ డీల్.. టాటా పంచ్ EVపై భారీ డిస్కౌంట్

ఈ MG హెక్టర్ బ్లాక్‌స్టార్మ్.. 1.5L పెట్రోల్ ఇంజన్ 143hpని 250Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే 2.0L డీజిల్ ఇంజన్‌ 170hp 350Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మాన్యువల్, CVT గేర్‌బాక్స్ ఎంపికలు రెండూ పెట్రోల్ ఇంజన్‌లో అందుబాటులో ఉంటాయి. అయితే ఇక్కడ డీజిల్ ఇంజిన్‌తో 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ మాత్రమే అందుబాటులో ఉంటుంది. ముందు భాగంలో.. హెక్టర్ బ్లాక్‌స్టార్మ్ ఎడిషన్ డార్క్ క్రోమ్ ఫినిషింగ్‌ను కలిగి ఉంది.

అలాగే పియానో ​​బ్లాక్ హెడ్‌ల్యాంప్ బెజెల్స్‌తో అద్భుతమైన గ్రిల్‌ను పొందుతుంది. ఫాగ్ ల్యాంప్ అసెంబ్లీ, ORVMలు, ఇతర బాడీ ప్యానెల్‌ల చుట్టూ రెడ్ యాక్సెంట్‌లు కనిపిస్తాయి. ఈ ప్రత్యేక ఎడిషన్ 18-అంగుళాల బ్లాక్ అల్లాయ్ వీల్స్, రెడ్ బ్రేక్ కాలిపర్స్, సైడ్ ప్యానెల్‌లో ‘బ్లాక్‌స్టార్మ్’ లోగోతో అందుబాటులో ఉంటుంది.

Also Read: థార్‌కి పోటీగా జీప్ రాంగ్లర్ ఎస్‌యూవీ.. ఆకట్టుకుంటున్న ఫీచర్స్!

అంతేకాకుండా వెనుక వైపున.. MG హెక్టర్ బ్లాక్‌స్టార్మ్ ఎడిషన్ స్మోక్డ్ ఫినిషింగ్ టెయిల్ ‌ల్యాంప్‌లను పొందుతుంది. ఈ కారు రెడ్ యాంబియంట్ లైటింగ్, రెడ్ యాక్సెంట్‌లతో పూర్తిగా బ్లాక్ ఇంటీరియర్‌ను కలిగి ఉంటుంది. సాధారణ మోడల్ లాగానే ఈ ప్రత్యేక ఎడిషన్ కూడా 360 డిగ్రీ కెమెరా, ఎయిర్ ప్యూరిఫైయర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఇన్ఫినిటీ-సోర్స్డ్ మ్యూజిక్ సిస్టమ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, పవర్డ్ టెయిల్‌గేట్ వంటి అనేక ఫీచర్లతో వచ్చినట్లు తెలుస్తోంది.

ఇది ఎలక్ట్రికల్ ఫోల్డబుల్ ORVMలు, ఆటో-డిమ్మింగ్ IRVM, వైర్‌లెస్ ఛార్జర్, 6-వే పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో కూడిన 14-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్‌తో సహా ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్‌లను కూడా కలిగి ఉండే అవకాశముందని తెలుస్తోంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News