Big Stories

The Goat Life @ Rs 100 Crores: రూ.100 కోట్లు రాబట్టిన లేటెస్ట్ మూవీ.. ఆ పాత్ర కోసం 15 రోజులు ఆహారం లేకుండా..

The Goat Life: కొందరు నటులు సినిమాలో తన పాత్ర కోసం ప్రాణాలను కూడా లెక్కచేయరు. ప్రేక్షకుల్ని మెప్పించేందుకు ఎంతటి కష్టం, సవాళ్లనైనా ఎదుర్కొంటారు. అలాంటిదే తాజాగా ఓ నటుడు ఒక మూవీ కోసం చేసిన సాహసం అతడి ప్రాణాలమీదకు తెచ్చింది. రీసెంట్‌గా ఆ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చి రూ.100 కోట్లు కలెక్ట్ చేసింది. అయితే మరి ఆ సినిమా ఏంటా..? అని అనుకుంటున్నారా.. అయితే ఇప్పుడు దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

- Advertisement -

గతేడాది ‘సలార్’ మూవీలో ప్రభాస్‌కి ఫ్రెండ్‌గా నటించి అద్భుతమైన క్రేజ్ సంపాదించుకున్న మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ రీసెంట్‌గా ‘ది గోట్ లైఫ్’ మూవీతో వచ్చాడు. తెలుగులో ‘ఆడుజీవితం’ పేరుతో రిలీజ్ అయింది. దాదాపు 2008లో పట్టాలెక్కిన ఈ సినిమా చివరకి 2024లో రిలీజ్ అయింది. అంటే సుమారు 16 ఏళ్ల తర్వాత ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

- Advertisement -
The Goat Life
The Goat Life

బ్లెస్సీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో పృథ్వీరాజ్ సుకుమారన్ మూడు విభిన్న పాత్రల్లో నటించి అదరగొట్టేశాడు. నిజజీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని కలెక్షన్ల వర్షం కురిపించింది. దాదాపు రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి అబ్బురపరచింది. అయితే ఈ సినిమా కోసం పృథ్వీరాజ్‌ చాలా చెమటోడ్చినట్లు కొన్ని ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చాడు. ఇందులో తన పాత్రలకు తగ్గట్టుగా తన బాడీని మార్చుకోవడానికి చాలా కష్టపడినట్లు తెలిపాడు. అయితే ఆయనతో పాటు మరో నటుడు కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో నటించి మెప్పించాడు.

Also Read: ప్రభాస్ ‘స్పిరిట్’ మూవీపై దర్శకుడు సందీప్ రెడ్డి సాలిడ్ అప్డేట్.. ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?

హకీమ్ అనే పాత్రలో పూర్తిగా బక్కచిక్కిపోయినట్లుగా కనిపించి కేఆర్‌ గోకుల్‌ అదరగొట్టేశాడు. అయితే అతడు కూడా తన పాత్ర కోసం ఎంతో కష్టపడినట్లు తాజాగా తెలిపాడు. ఈ సినిమాకి ముందు బందోబస్తుగా ఉన్న అతడు ఈ సినిమాలో తన పాత్ర కోసం తన బాడీని అలా మార్చేందుకు పడిన కష్టాన్ని వెల్లడించాడు.

పృథ్వీరాజ్ సుకుమారన్‌ మాదిరిగానే తాను కూడా తన పాత్ర కోసం ఎంతో శ్రమించానని.. దాదాపు కొన్ని రోజుల పాటు ఆహారం తినకుండా ఉన్నట్లు చెప్పాడు. ఈ మూవీలో హకీమ్ పాత్ర కోసం బరువు తగ్గడానికి ప్రయోగాలు చేశానని అన్నాడు. ఆ ప్రయోగం ఆ పాత్రను రియాలిటీగా ఉండేందుకు తనకు సహాయపడిందని తెలిపాడు.

అయితే అది తనను శారీరకంగానూ.. మానసికంగానూ బాగా దెబ్బతీసిందని చెప్పాడు. ఆ పాత్ర కోసం కేవలం నీళ్లు తాగి బతికానని.. దాంతో శరీరంలోని కేలరీలను క్రమంగా తగ్గించుకోగలిగానని అన్నాడు. దాదాపు 15 రోజుల పాటు ఏమీ తినకుండా కేవలం బ్లాక్ కాఫీ తాగానని.. అందువల్ల మూడో రోజే ఒక్కసారిగా కుప్పకూలిపోయానని చెప్పుకొచ్చాడు. అది నిజంగా తన మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీసిందని తెలిపాడు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News