E-Paper
Advertisement

Mobile Recharges Hike: కొత్త ఏడాదిలో కస్టమర్లకు భారీ షాక్.. మొబైల్ రీఛార్జ్‌లు 20 శాతం పెరిగే ఛాన్స్

Mobile Recharges Hike: కొత్త ఏడాదిలో కస్టమర్లకు భారీ షాక్.. మొబైల్ రీఛార్జ్‌లు 20 శాతం పెరిగే ఛాన్స్
Advertisement

Mobile Recharges Hike: కొత్త సంవత్సరంలో టెలికాం కంపెనీలు కస్టమర్లకు షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాయి. జియో, ఎయిర్ టెన్, వీఐ మొబైల్ రీఛార్జ్ ప్లాన్ల ధరలను పెంచేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. 2026లో ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ టారిఫ్‌లను 16-20% వరకు పెంచే అవకాశం ఉందని గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ “మోర్గాన్ స్టాన్లీ” తన నివేదికలో పేర్కొంది. చివరిగా 2024 జులైలో మొబైల్ టారిఫ్ లు పెరగగా రెండేళ్ల తర్వాత 2026లో మరోసారి ధరలు పెంచనున్నట్లు తెలుస్తోంది. కస్టమర్ల నెత్తిన టారిఫ్ బాంబు ప్రకటన త్వరలోనే వచ్చే ఛాన్స్ ఉందని సమాచారం.

మొబైల్ రీఛార్జ్ ధరలు 20 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని సమాచారం. టెలికాం కంపెనీలు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి రేట్లు పెంచుతున్నట్లు తెలుస్తోంది. 2026లో మరోసారి వినియోగదారుల జేబులపై భారం పడే సూచనలు కనిపిస్తున్నాయి.

2026లోనే ఎందుకు?

Advertisement

మోర్గాన్ స్టాన్లీ నివేదిక ప్రకారం, టెలికాం కంపెనీలు 2026లో 4G, 5G ప్లాన్‌ల ధరలను 16 నుంచి 20 శాతం పెంచనున్నాయి. ధరల పెరుగుదలకు ప్రధాన కారణం.. 5G నెట్‌వర్క్‌లలో భారీ పెట్టుబడులు, కంపెనీల ఆర్థిక స్థితిని బలోపేతం చేసే ప్రయత్నాలని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం టెలికాం కంపెనీలు కీలక ప్లాన్‌లు, ఓటీటీ యాప్ లతో కలిపి ఉన్న ప్లాన్లు, పరిమిత డేటాతో 5G ప్లాన్లపై ధరలను పెంచే అవకాశం ఉంది. 5G ప్లాన్‌లు ప్రస్తుతం రోజుకు 2GB డేటాను మాత్రమే అందిస్తున్నాయి. భవిష్యత్తులో ఈ ప్లాన్లు మరింత ఖరీదు కావొచ్చు.

ఎప్పుడంటే?

మోర్గాన్ స్టాన్లీ అంచనాల ప్రకారం, 2026 ఏప్రిల్, జూన్ మధ్య టారిఫ్ పెంపు అమల్లోకి రావచ్చు. చాలా టెలికాం కంపెనీలు 2026-27 మొదటి త్రైమాసికంలోనే టారిఫ్ పెంపు ప్రకటించే అవకాశం ఉంది. ఈ పెంపు ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ కస్టమర్లందరికీ వర్తించనుంది.

Advertisement

Also Read: India Rupee: ఫలించిన ఆర్బీఐ జోక్యం.. తిరిగి పుంజుకున్న రూపాయి.. ఏడు నెలల్లో తొలిసారిగా

Related News

మార్కెట్లో ఎగిసిన ముడి చమురు ధర.. బ్రెంట్ క్రూడ్ 102 డాలర్లు, భారత్‌‌లో ధరలు పెరిగే ఛాన్స్

పసిడి ప్రియులకు పంగడే.. దిగొస్తున్న లోహాల ధరలు, తులం ఎంతంటే..

ఫోన్, కారు కంటే ఇల్లు ముఖ్యం? ఆర్థికపరంగా భారతీయుల ఆలోచనల్లో మార్పు

నిర్మాణ ఖర్చుల కంటే వేగంగా పెరుగుతున్న ఇళ్ల ధరలు.. కారణాలు ఇవే

ఎక్కువ షుగర్, సాల్ట్ ఉన్న ఫుడ్ ప్యాకెట్స్‌పై వార్నింగ్ లేబుల్స్ స్పష్టంగా ఉండాలి.. వినియోగదారుల డిమాండ్

రైతులకు కీలక కబురు.. పీఎం కిసాన్ స్కీమ్ 24వ విడత నిధులు, నవరాత్రుల సమయంలో

దిగొస్తున్న పసిడి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ధరలు మాటేంటి?

ఇండియాలో వారసత్వ ఆస్తుల బదిలీ అంత ఈజీ కాదు.. అన్నీ సవ్యంగా ఉన్నా లంచాలు ఇవ్వాల్సిందే

Big Stories

Advertisement
×