Allu Sirish: గౌరవం సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు అల్లు శిరీష్. ఆ సినిమాతో మంచి కాన్సెప్ట్ ఎంచుకున్నాడు అనే గౌరవం మాత్రం దక్కింది కానీ కమర్షియల్ సక్సెస్ మాత్రం రాలేదు. మొత్తానికి మారుతి దర్శకత్వంలో వచ్చిన కొత్తజంట సినిమా మంచి సక్సెస్ సాధించింది. ఆ తర్వాత చేసిన శ్రీరస్తు శుభమస్తు సినిమా కూడా కొంతమేరకు ఆకట్టుకుంది.
అయితే అల్లు శిరీష్ సినిమా ప్రస్తావన విషయానికి వస్తే పీక్ రేంజ్ సక్సెస్ సాధించిన సినిమా అంటూ ఇప్పటివరకు లేదు. వచ్చిన సినిమాలు వచ్చినట్లే వెళ్ళిపోతున్నాయి. అయితే అల్లు శిరీష్ కేవలం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోనే కాకుండా ఇతర భాషల్లో కూడా సినిమాలు చేశారు. చాలామంది ప్రముఖ నటులతో నటించారు.
చాలామంది ప్రముఖ నటులతో నటించడంతోపాటు క్రికెటర్ రోహిత్ శర్మతో కూడా నటించాడు అల్లు శిరీష్. ఒక ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీకి సంబంధించిన అడ్వటైజ్మెంట్ లో రోహిత్ శర్మతో పాటు కలిసి నటించాడు. ప్రస్తుతం ఈ అడ్వటైజ్మెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
లైఫ్ ఇన్సూరెన్స్ గురించి జరిగే డిస్కషన్ లో సినిమా స్టార్స్ గొప్పతనాన్ని అల్లు శిరీష్ చెప్తే క్రికెటర్స్ గొప్పతనాన్ని మరోవైపు రోహిత్ శర్మ చెబుతూ ఉంటాడు. మధ్యలో ఉన్న కోసం షాక్ అవుతుంది. అతనికి క్రియేటివ్ గానే యాడ్ డిజైన్ చేశారు.
What a pleasant surprise… wow! @AlluSirish 🖤
So happy and proud of you. Truly heartwarming to see this moment & my special respect for @ImRo45 garu. https://t.co/ody6JtorZ7— Allu Arjun (@alluarjun) December 18, 2025
ఆ అడ్వర్టైజ్మెంట్లో మధ్యలో ఉన్న పర్శంట్ షాక్ అయినట్లు అల్లు అర్జున్ షాక్ అయ్యాడు. అల్లు అర్జున్కి ఇది చెప్పకుండానే చేశాడు అల్లు శిరీష్ అని అల్లు అర్జున్ ట్వీట్ చూస్తే అర్థమవుతుంది. అందుకనే ప్రజెంట్ సర్ప్రైజ్ అంటూ రాసుకొచ్చాడు. అంతేకాకుండా నీ గురించి నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను అంటూ చెప్పాడు అల్లు అర్జున్. మరోవైపు రోహిత్ శర్మ మీద ఉన్న రెస్పెక్ట్ కూడా తెలియజేశాడు.
ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లీ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పుష్ప సినిమా తర్వాత అల్లు అర్జున్ రేంజ్ కంప్లీట్ గా మారిపోయింది. పుష్ప సినిమాకి ఏకంగా నేషనల్ అవార్డు అందుకున్నారు అల్లు అర్జున్. ఇప్పుడు తన తర్వాత సినిమాల విషయంలో కూడా చాలా క్లారిటీతో ముందడుగు వేస్తున్నారు. ఇక అట్లీ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. 2026 డిసెంబర్ నెలలో ఈ సినిమా విడుదలవుతుంది. అని వార్తలు వస్తున్నాయి కానీ అధికారక ప్రకటన రాలేదు.
Also Read: Champion Movie Trailer : శ్రీకాంత్ కొడుకు నటించిన ఛాంపియన్ ట్రైలర్ వచ్చేసింది, ఎలా ఉందంటే?