BigTV English

Nissan X-trail Suv Launched: నిస్సాన్ నుంచి కొత్త కారు.. బోలెడన్ని ఫీచర్లు.. లాంచ్‌కి సిద్ధం..!

Nissan X-trail Suv Launched: నిస్సాన్ నుంచి కొత్త కారు.. బోలెడన్ని ఫీచర్లు.. లాంచ్‌కి సిద్ధం..!

Nissan X-trail Suv: దేశీయ మార్కెట్‌లో అతి తక్కువ కాలంలో ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది నిస్సాన్ ఇండియా. కొత్త కొత్త కార్లను మార్కెట్‌లో రిలీజ్ చేస్తూ వాహన ప్రియులను ఆకట్టుకుంటుంది. ఇక ఇప్పటికే చాలా కార్లను దేశీయ మార్కెట్‌లో పరిచయం చేసిన కంపెనీ ఇప్పుడు మరో కారును లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. ఎక్స్-ట్రైల్ పేరుతో ఓ కారును తీసుకురానుంది. దీనిని జూలై 17 నుంచి 21 మధ్య మీడియా డ్రైవ్‌లు షెడ్యూల్ అయ్యాయి. ఇది అద్భుతమైన కలర్, డిజైన్, స్పెసిఫకేషన్లను కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు వాటన్నింటికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం.


నిస్సాన్ కంపెనీ నుంచి త్వరలో దేశీయ మార్కెట్‌లో లాంచ్ కాబోతున్న ఎక్స్-ట్రైల్ ప్రీమియం ఎస్యూవీ జీప్ మెరిడియన్, స్కోడా కొడియాక్, ఫోక్స్‌వ్యాగన్ టైగన్ వంటి కార్లకు గట్టి పోటీ ఇస్తుందని భావిస్తున్నారు. ఇటీవల ఈ కారుకు సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఆ వీడియోల ప్రకారం.. నిస్సాన్ ఎక్స్-ట్రైల్ ఎస్యూవీ అల్లాయ్ వీల్స్, ఎల్‌ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్స్, లేటెస్ట్ ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, పెద్ద ఫ్రంట్ గ్రిల్‌తో సహా ఎల్‌ఈడీ ర్యాప్‌రౌండ్ ల్యాంప్స్ వంటి ఫీచర్లను కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఈ నిస్సాన్ ఎక్స్-ట్రైల్ ఎస్యూవీ 2022లో ఇండియాలో తొలి టెస్ట్ జరుపుకుంది. ఇక ఇప్పటికీ టెస్టింగ్ దశలోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఇక అన్ని పనులు పూర్తి చేసి ఈ నిస్సాన్ ఎక్స్-ట్రైల్‌ను 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో మార్కెట్‌లోకి రాబోతుందని తెలుస్తోంది. దీనిని సీఎమ్‌ఎఫ్‌-సీ ఆర్కిటెక్చర్‌పై నిర్మించే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా ప్రస్తుతం ఈ కారు ప్రపంచ మార్కెట్‌లో అందుబాటులో ఉంది.


Also Read: మారుతి సుజుకి ఆఫర్ల జాతర.. ఏకంగా రూ.1.08 లక్షలకు పైగా భారీ డిస్కౌంట్ ప్రయోజనాలు.. లాస్ట్ డేట్ ఇదే..!

అక్కడ సెల్ఫ్ ఛార్జింగ్ హైబ్రిడ్ సిస్టమ్‌తో పాటు మల్టిపుల్ పవర్‌ట్రెయిన్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇక భారతీయ మార్కెట్‌లో లాంచ్ కావడానికి సిద్ధంగా ఉన్న నిస్సాన్ ఎక్స్-ట్రైల్ ఫీచర్ల విషయానికొస్తే.. ఈ కారు లోపల 12.3 ఇంచుల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ సిస్టమ్ ఉంటుంది. అలాగే వైర్‌లెస్ ఆపిల్ కార్ ప్లే, 10.8 ఇంచులు హెడ్స్ అప్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీతో కూడిన 12.3 ఇంచుల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే వంటివి ఉన్నట్లు తెలుస్తోంది.

అలాగే అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టం (ఏడీఏస్) కూడా ఇందులో అందించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా బోస్ సౌండ్ సిస్టమ్, ప్రీమియం సూట్, ప్రీమియం సర్ఫేస్ ట్రిమ్‌లు వంటి మరెన్నో ఫీచర్లు ఇందులో ఉన్నట్లు సమాచారం. ఇక ఇంజిన్ విషయానికొస్తే.. ఇది 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో రానున్నట్లు తెలుస్తోంది. ఈ ఇంజిన్ 204 హార్స్ పవర్, 305 ఎన్ఎమ్ టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది.

Tags

Related News

SIP Investment: రిటైర్మెంట్ తర్వాత నెలకు రూ.3 లక్షలు ఐడియా.. SIPలో ఇలా పెట్టుబడి పెట్టండి చాలు!

Gold Price: ఒకేరోజు భారీగా పెరిగిన పసిడి ధర.. ఆల్ టైం రికార్డ్

EPFO Withdrawal: ఈపీఎఫ్ఓ విత్ డ్రా ఇకపై మరింత ఈజీ.. త్వరలో మారనున్న నిబంధనలు!

Postal PPF Scheme: నెలకు జస్ట్ ఇంత కడితే చాలు.. మీ చేతికి రూ.40 లక్షలు పైనే.. పోస్టాఫీస్ బెస్ట్ స్కీమ్

MyJio App: డిస్కౌంట్ నిజమా కాదా? మై జియో తో ఇప్పుడు ఈజీగా తెలుసుకోండి

JioMart Offers: రూ.99 నుంచే షాపింగ్.. జియోమార్ట్ ఫ్లాష్ డీల్ హాట్ సేల్ షురూ..

DMart Offers: దసరా పండుగ వచ్చేస్తోంది, డిమార్ట్ లో షాపింగ్ కు ఇది పర్ఫెక్ట్ టైమ్!

Jio Dasara Offers: జియో దసరా ఫెస్టివల్ ఆఫర్స్.. మీరు ఊహించని సర్ప్రైజ్‌లు వచ్చేశాయి!

Big Stories

×