Ola Electric bikes: ఓలా కంపెనీ మరో గుడ్ న్యూస్ చెప్పింది. అతి తక్కువ ధరకు ఎలక్ట్రిక్ బైక్ తీసుకొస్తుంది. ఇప్పటికే బడ్జెట్‌లో ఎలక్ట్రిక్ స్కూటర్లను తీసుకొచ్చి మంచి పాపులర్ అయింది. ఇప్పుడు బడ్జెట్‌లో ఎలక్ట్రిక్ బైక్స్ తీసుకొచ్చేందుకు ముందడుగు వేసింది. ఈ మేరకు అధికారికంగా మూడు కొత్త మోడళ్లను గురువారం ఓలా ఎలక్ట్రిక్ సీఈఓ భవీష్ అగర్వాల్ ఆవిష్కరించారు. ఇందులో రోడ్ స్టర్ ఎక్స్, రోడ్ స్టర్, రోడ్ స్టర్ ప్రోలను పరిచయం చేశారు. ఇందులో బేసిక్ వర్సెన్ కేవలం రూ.79,999 ఎక్స్ షోరూం ధరకే తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. వీటిని షోరూం ధరలకు ఇవ్వడం విశేషం.
రోడ్ స్టర్ సిరీస్‌లో మొత్తం మూడు మోడల్స్ ఉండగా.. రోడ్ స్టర్ సిరీస్ లుక్స్ చూస్తే ఆకర్షణీయంగా ఉన్నాయి. ఫీచర్స్ సైతం అద్భుతంగా ఉన్నాయి. ఇక మూడు మోడల్స్ లుక్స్ ఓకే మాదిరిగా ఉన్నాయి. ఫీచర్స్, స్పెసిఫికేషన్స్, ధరలు, మైలేజ్ మోడల్ ను బట్టి మారుతుంది. ఈ మోడళ్లను ఇప్పటినుంచే రిజర్వ్ చేసుకునేందుకు అవకాశం ఇచ్చారు. ఆన్ లైన్ లేదా ఓలా ఎక్స్ పీరియన్స్ సెంటర్ ను సంప్రదించి వర్చువల్ గా ఈ బైక్ రైడ్ కూడా చేసేందుకు అవకాశం ఉందని సీఈఓ వెల్లడంచారు.
రిజర్వ్ చేసుకున్న వినియోగదారులకు ఓలా ఎలక్ట్రిక్ రోడ్ స్టర్ ఎక్స్, రోడ్ స్టర్ బైక్ ల డెలివరీలు వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రారంభం కానుండగా.. రోడ్ స్టర్ ప్రో మాత్రం 2025 దీపావళి వరకు వేచి ఉండాల్సి ఉంటుందన్నారు. ఈ బైక్ గంటకు 124 కిలోమీటర్ల గరిష్ట వేగంతో పరుగులు పెడుతుంది. అంతేకాకుండా దీనికి ఒక్కసారి ఛార్జింగ్ పెడితే ఏకంగా 200 కి.మీ మైలేజీ అందిస్తుంది.
ధర విషయానికొస్తే.. రోడ్ స్టర్ సిరీస్‌లో మూడు మోడల్స్ ఉన్నాయి. ఇందులో బేసిక్ మోడల్ గా రోడ్ స్టర్ ఎక్స్ ని తీసుకొస్తున్నారు. ఈ రోడ్ స్టర్ ఎక్స్‌లో మూడు వేరియంట్స్ ఉంటాయి. 2.5కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ ధర రూ.74,999 ఉండగా, 3.5కిలోవాట్ల బ్యాటరీ ధర రూ.84,999, అలాగే 4.5 కిలో వాట్ల ధర రూ.99.999గా ఉంది.
Also Read: థార్ రాక్స్ ఇండియాలో దిగింది.. ఇక దూకుడే దూకుడు.. ధర ఎంతంటే..?
రోడ్ స్టర్ మోడల్‌లోనూ మూడు వేరియంట్స్ ఉన్నాయి. రోడ్ స్టర్ 3.5 కిలో వాట్ల బ్యాటరీ వేరియంట్ రూ.1.05 లక్షలు ఉండగా.. 4.5 కిలోవాట్ల బ్యాటరీ ధర రూ.1.20 లక్షలు, 6 కిలోవాట్ల బ్యాటరీ వేరియంట్ ధర రూ.1.49 లక్షలుగా నిర్ధారించారు. ఇక, రోడ్ స్టర్ ప్రో మోడల్ 4680 భారత్ సెల్‌తో వస్తోంది. ఇందులో రెండు వేరియంట్స్ ఉన్నాయి. 8కిలో వాట్ల బ్యాటరీ ధర రూ.1.99 లక్షలు ఉండగా..16 కిలోవాట్ల బ్యాటరీ ధర రూ.2.49లక్షలుగా నిర్ణయించారు.