E-Paper
Advertisement

PhonePe: ఇంటర్నెట్‌ లేకున్నా ఫోన్‌ పేలో చెల్లింపులు, అదెలా సాధ్యం, సామాన్యుడు ఏమంటున్నాడు?

PhonePe: ఇంటర్నెట్‌ లేకున్నా ఫోన్‌ పేలో చెల్లింపులు, అదెలా సాధ్యం, సామాన్యుడు ఏమంటున్నాడు?
Advertisement

PhonePe: భారతదేశం అంతటా చెల్లింపులను డిజిటలైజ్ చేయడం లక్ష్యంగా పెట్టుకుంది ఫోన్ పే సంస్థ. ఈ విషయంలో మరో అడుగు ముందుకేసింది. ఇంటర్నెట్ లేకుండా చెల్లింపులు చేసే కొత్త పద్దతిని ప్రారంభించింది. అందుకోసం ఫిన్‌టెక్‌ సంస్థ ఫోన్‌పే రూపే ఆన్‌-ది-గో కార్డును అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇంతకీ ఈ కార్డు ఇంటర్నెట్ లేకుండా చెల్లింపు ఎలా సాధ్యం? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..

ఇంటర్నెట్‌ లేకున్నా ఫోన్‌ పేలో చెల్లింపులు

Advertisement

PhonePe తీసుకొచ్చిన ఆన్-ది-గో కార్డు అనేది కస్టమర్ల రోజువారీ ప్రయాణాన్ని సులభతరం చేయడానికి రూపొందించింది. ఆల్-ఇన్-వన్ ట్రాన్సిట్ కార్డ్‌గా పని చేయనుంది. మెట్రో ప్రయాణికుల కోసం దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. నేషనల్‌ కామన్‌ మొబిలిటీ కార్డు-ఎన్‌సీఎంసీ కింద ఈ సేవలను ప్రారంభించింది.

ఇంటర్నెట్‌ సదుపాయం లేకపోయినా ఆఫ్‌లైన్‌ ద్వారా సులభంగా రవాణా చెల్లింపులు చేయవచ్చు. ప్రస్తుతం హైదరాబాద్ మెట్రోలో అందుబాటులోకి తీసుకొచ్చింది. మెట్రో టికెట్ కౌంటర్ల వద్ద ఈ కార్డును వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు. ఈ తరహా పద్దతిని దేశమంతా మెట్రోలు, బస్సులు, రైళ్లు, టోల్‌లు, పార్కింగ్‌తో సహా అన్ని సేవలపై వేగంగా ట్యాప్-అండ్-పే లావాదేవీల పద్దతిలో పూర్తిగా అనుమతిస్తుంది.

Advertisement

అదెలా సాధ్యం, సామాన్యుడు ఏమంటున్నాడు?

ఆల్-ఇన్-వన్ ట్రాన్సిట్ కార్డ్‌ కొనుగోలు చేయాలి. అంతకుముందు సంబంధిత ప్రయాణికుల ఫోన్‌ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ధ్రువీకరణ తర్వాత మెట్రో ఏజెంట్‌ ద్వారా కార్డును కొనుగోలు చేయవచ్చు. యూపీఐ లేదా ఇతర కార్డుల ద్వారా డబ్బులు జమ చేసుకోవచ్చు. ఫోన్ ఫే కార్డు ప్రీపెయిడ్, స్టోర్డ్‌ వాల్యూ విధానంలో ప నిచేయనుంది. బ్యాలెన్స్‌ నేరుగా కార్డులోని చిప్‌లో స్టోర్ అవుతుంది.

దీని ద్వారా ఇంటర్నెట్‌ లేని ప్రాంతాల్లో ప్రయాణికులు పూర్తిగా ఆఫ్‌లైన్‌ పద్ధతిలో చెల్లింపులు చేయవచ్చు. కార్డులో గరిష్ఠంగా రెండువేల వరకు బ్యాలెన్స్‌ వేసుకోవచ్చు. ఆఫ్‌లైన్‌ ద్వారా గరిష్ఠంగా 500 రూపాయల వరకు లావాదేవీలు చేయవచ్చు. తొలుత హైదరాబాద్‌లో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ తర్వాత మిగతా సిటీలకు ఈ సేవలను విస్తరించనుంది.

ALSO READ: వార్ ఎఫెక్ట్.. మార్కెట్లో పతనమైన కోడిగుడ్ల ధరలు, సామాన్యుడికి రిలీఫ్ 

ఫోన్ పే తీసుకొచ్చిన సేవలపై సామాన్యుడి రకరకాల స్పందన వస్తోంది. ఆధార్, పాన్, ఏటీఎం ఇలా రకరకాల కార్డులు ఎక్కువైన ప్రస్తుత తరుణంలో ఫోన్ పే ప్రత్యేకంగా ఆఫ్‌లైన్ కార్డు తీసుకు‌రావడం కరెక్ట్ కాదనే వాదన సైతం బలంగా వినిపిస్తోంది. ఈ విధంగా కాకుండా ఫోన్ పేలో ఆఫ్‌లైన్ పద్దతి తీసుకొస్తే బాగుండేదని అంటున్నారు.

Related News

బ్యాంక్ ఖాతాదారులకు షాక్.. ఎటీఎంపై ఛార్జీలు, ఆపై తగిన బ్యాలెన్స్ లేకున్నా ఎడాపెడా బాదుడు

ఇంజినీర్లకు షాక్.. ఎంబిఏ గ్రాడ్యుయేట్లకు భారీగా పెరుగుతున్న డిమాండ్.. కారణం ఇదే

పేకమేడలా కూలిన స్టాక్‌మార్కెట్‌.. నిమిషాల వ్యవధిలో 5 లక్షల కోట్ల పైగా సంపద ఆవిరి! జపాన్ నుంచి మొదలు..

గోల్డ్ మార్కెట్‌ని దెబ్బ కొట్టిన ట్రంప్.. కొనుగోళ్లదారుల్లో ఉత్సాహం, బంగారం-వెండి ధరలు పతనం

200 అప్లికేషన్లు, 15 ఇంటర్వ్యూలు ఫెయిల్.. చివరికి డిష్‌వాషింగ్ జాబ్.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి వ్యధ

కరెన్సీ నోట్లపై గీతలకు ఇంత అర్థముందా? ఇన్నాళ్లు పిచ్చి గీతలు అనుకున్నామే..!

ఖరీదైన ఫోన్ కొనేముందు ఈ ట్రిక్ తెలుసుకోండి.. ఈఎంఐ వడ్డీ చెల్లించే బదులు రాబడి పొందండి

పతనమవుతున్న బంగారం ధర.. అంతర్జాతీయ పరిణామాలేంటి? తెలుగు రాష్ట్రాల్లో రేట్లు పరిశీలిద్దాం

Big Stories

Advertisement
×