E-Paper
Advertisement

SpaceX IPO: ఐపీఓకు స్పేస్‌ ఎక్స్.. 4400 మంది ఉద్యోగులు రాత్రికి రాత్రే కోటీశ్వరులు, మరో 400 మంది అయితే..

SpaceX IPO: ఐపీఓకు  స్పేస్‌ ఎక్స్..  4400 మంది ఉద్యోగులు రాత్రికి రాత్రే కోటీశ్వరులు,  మరో 400 మంది అయితే..
Advertisement

SpaceX IPO: నేడో రేపో స్పేస్‌ ఎక్స్ పబ్లిక్ ఇష్యూకు-ఐపీఓ రాబోతోంది. ఇది విజయవంతమైతే ఆ సంస్థలో పని చేస్తున్న వేలాది మంది ఉద్యోగులు రాత్రికి రాత్రే కోటీశ్వరులు కావడం ఖాయం. అదే జరిగితే కార్పొరేట్ ప్రపంచంలో అదొక సంచలనం. స్టాక్ మార్కెట్ చరిత్రలో ఇది అతిపెద్ద ఐపీఓగా నిలిచిపోయే అవకాశాలున్నాయని మార్కెట్ వర్గాల అంచనా.

ఐపీఓకు స్పేస్‌ ఎక్స్ కంపెనీ

Advertisement

ఎలాన్ మస్క్ స్థాపించిన స్పేస్‌ ఎక్స్ రాకెట్ తయారీ సంస్థ ఒక్కో షేరుకు 135 డాలర్ల చొప్పున ధర నిర్ణయించే అవకాశముంది. అదే జరిగితే ఆ కంపెనీ విలువ దాదాపు 1.77 ట్రిలియన్ల డాలర్లకు చేరుకోవచ్చ. ఆ సంస్థలోని ప్రస్తుత, మాజీ ఉద్యోగుల్లో సుమారు 4,400 మంది మిలియనీర్లు (ఒక మిలియన్ డాలర్లకు పైగా సంపద) అవుతారని న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది.

అందులో దాదాపు 400 మంది ఉద్యోగుల సంపద 100 మిలియన్ డాలర్ల కంటే ఎక్కువగా ఉండే అవకాశముందని ఓ అంచనా. ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద ఐపీఓల్లో ఇది ఒకటిగా నిలవనుంది. ఏదైనా కంపెనీ ఐపీఓకి వెళ్తే.. అందులోని వ్యవస్థాపకులు, ఉన్నతస్థాయికి చెందిన ఉద్యోగులు అధికంగా లాభపడతారు. కానీ స్పేస్‌ఎక్స్ విషయంలో భిన్నంగా ఉందని హిల్. కామ్ సీఈఓ ఆండ్రూ బెన్సన్ చెప్పుకొచ్చారు.

Advertisement

అంచనాలు అందుకుంటే 4400 మంది ఉద్యోగులు కోటీశ్వరులు

ఒకే కంపెనీలో 400 మందికి పైగా 100 మిలియన్ డాలర్ల సంపదను కలిగి ఉండటం అరుదైన విషయమని పేర్కొన్నారు. స్పేస్‌ ఎక్స్ ఎంత భారీ సంపదను సృష్టించిందో తెలియజేస్తుందని వివరించారు. ఐపీఓ ద్వారా స్పేస్‌ ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ సంపద భారీగా పెరగడం ఖాయం. ఆ కంపెనీలో 42 శాతం వాటా ఆయన సొంతం.

ఐపీఓ తర్వాత కంపెనీ విలువ 1.77 ట్రిలియన్ డాలర్లకు చేరితే మస్క్ వాటా విలువ 740 బిలియన్ డాలర్లు. గతేడాది స్పేస్‌ఎక్స్ విలువ 800 బిలియన్ డాలర్లు. ఫిబ్రవరిలో మస్క్‌కు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ విలీనం తర్వాత 1.25 ట్రిలియన్ డాలర్లకు పెరిగింది. ఐపీఓ ద్వారా ఆ కంపెనీ 75 బిలియన్ డాలర్ల వరకు నిధులను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వ్యాపారవర్గాలు చెబుతున్నాయి.

ALSO READ: రెండు ప్రభుత్వ సంస్థల విలీనం.. ఆపై రాష్ట్రపతి ఆమోదముద్ర, ఏంటి ఆ కంపెనీలు 

2011లో స్పేస్‌ఎక్స్‌లో చేరాడు ట్రెవర్ హైస్ అనే ఉద్యోగి. ఆనాడు చిన్న కంపెనీ ఇది. ఆ సమయంలో ఆయనకు 1,00,000 షేర్లను ఇచ్చారు. ఐపీఓ ధర 135 డాలర్లుగా లెక్కిస్తే ఆయన షేర్ల విలువ ఏకంగా 13.5 మిలియన్ డాలర్లు. అంటే భారత కరెన్సీలో సుమారు రూ. 129 కోట్లు. స్పేస్‌ ఎక్స్ ఉద్యోగులకు నగదు కంటే ఎక్కువగా ఈక్విటీ రూపంలో ఎక్కువగా ఇచ్చింది.

అనుకున్నట్లుగా జరిగితే ఐపీఓ తర్వాత ఈ సంపదంతా రియల్ ఎస్టేట్ మార్కెట్లోకి వచ్చే అవకాముందని లెక్కలు వేస్తున్నారు. సాధారణంగా బడా ఐపీఓల్లో రిటైల్ ఇన్వెస్టర్లకు 5 నుంచి 10 శాతం షేర్లు కేటాయిస్తారు. స్పేస్‌ఎక్స్ ఐపీఓలో ఏకంగా 30 శాతం షేర్లను రిటైల్ ఇన్వెస్టర్ల కోసం రిజర్వ్ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఫిడిలిటీ సంస్థల ద్వారా కేవలం 2,000 డాలర్ల పెట్టుబడితో ఐపీఓలో పాల్గొనే అర్హత కల్పించనున్నారు.

Related News

ఫుడ్ డెలివరీ బాయ్‌గా పనిచేశాడు కట్ చేస్తే ఈ రోజు కోటీశ్వరుడు.. రోజుకు రూ.6.3 లక్షల ఆదాయం

నెలకు రూ.10 లక్షల వరకు జీతం.. ప్రపంచమంతా తిరిగిరావొచ్చు.. ఇంటర్మీడియట్ ఉంటే చాలు

త్వరలో అదానీ ఎయిర్ లైన్స్.. ఆందోళన వ్యక్తం చేసిన ఇండిగో, ఎయిర్ ఇండియా

అప్పులు తీర్చడానికి మళ్లీ కొత్త అప్పులు.. నెల ఆదాయం మొత్తం ఈఎంఐలు తీర్చడానికే..

సాహసం చేయబోతున్న ఫ్లిప్‌కార్ట్.. స్విగ్గీ, జొమాటో ఆధిపత్యానికి సవాల్

బంగారం కొందామనుకుంటున్నారా? తగ్గింది కదా అని సంబరపడేలోపే బిగ్ ట్విస్ట్

బంగారు ఆభరణాలపై ఈ సీక్రెట్ కోడ్స్ గమనించారా? ఈ 916, 750, 585 నెంబర్లకు అర్థమేంటి?

దిగొచ్చిన పసిడి ధరలు.. ఇది తాత్కాలిక షాకా.. కొనుగోలుకు గోల్డెన్ ఛాన్సా?

Big Stories

Advertisement
×