E-Paper
Advertisement

సాహసం చేయబోతున్న ఫ్లిప్‌కార్ట్.. స్విగ్గీ, జొమాటో ఆధిపత్యానికి సవాల్

సాహసం చేయబోతున్న ఫ్లిప్‌కార్ట్.. స్విగ్గీ, జొమాటో ఆధిపత్యానికి సవాల్
Advertisement

భారతదేశంలోని ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ మార్కెట్లోకి ప్రముఖ ఈ – కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతోంది. అమెరికన్ కార్పొరేట్ వాల్‌మార్ట్‌కు చెందిన ఈ సంస్థ రాబోయే కొన్ని వారాల్లో తన ఫుడ్ డెలివరీ సర్వీస్ ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం ఈ రంగంలో జొమాటో, స్విగ్గీ ఆధిపత్యం కొనసాగుతోంది. ఫ్లిప్‌కార్ట్ ప్రవేశంతో ఈ మార్కెట్లో పోటీ మరింత పెరిగే అవకాశముంది. అయితే ఫుడ్ డెలివరీ బిజినెస్‌లో రాణించడం అంత సులవు కాదు.

తొలి దశలో పరిమితంగా సేవలు

ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ సీఈఓ కల్యాణ్ కృష్ణమూర్తి ఫుడ్ డెలివరీ సేవలను త్వరలో ప్రారంభిస్తామని వెల్లడించారు. మొదట ఈ సేవలను కొద్ది మంది వినియోగదారులకు మాత్రమే అందిస్తారు. వినియోగదారుల స్పందన పరిశీలించిన తర్వాత సేవలను క్రమంగా దేశవ్యాప్తంగా విస్తరించాలని సంస్థ భావిస్తోంది.

Advertisement

ఫ్లిప్‌కార్ట్ ఇప్పటికే తన క్విక్ కామర్స్ సర్వీస్ ఫ్లిప్‌కార్ట్ మినిట్స్ ప్రారంభించినప్పుడు కూడా ఇదే విధానాన్ని అనుసరించింది. మొదట పరిమిత స్థాయిలో సేవలు అందించి, తరువాత వినియోగదారుల అభిప్రాయాల ఆధారంగా విస్తరించింది.

రెండు మార్గాల్లో అందుబాటులో సేవలు

ఫ్లిప్‌కార్ట్ ఫుడ్ డెలివరీ సేవలను కస్టమర్లు రెండు విధాలుగా ఉపయోగించుకోవచ్చు. ఇందుకోసం ప్రత్యేక మొబైల్ యాప్ అందుబాటులో ఉంటుంది. అలాగే ప్రధాన ఫ్లిప్‌కార్ట్ యాప్ నుంచే కూడా ఫుడ్ ఆర్డర్ చేసే అవకాశం కల్పించనుంది.

Advertisement

అయితే ఈ కొత్త సర్వీస్‌కు ఏ పేరు పెడతారు, మొదట ఏ నగరంలో ప్రారంభిస్తారు అనే విషయాలను ఫ్లిప్‌కార్ట్ ఇంకా వెల్లడించలేదు.

ఒఎన్‌డీసీతో భాగస్వామ్యం ఉండొచ్చు

పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం ఫ్లిప్‌కార్ట్ తన ఫుడ్ డెలివరీ సేవలను ఓపెన్ నెట్‌వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ఒఎన్‌డీసీ) ద్వారా అందించే అవకాశం ఉంది. ఈ విధానం ద్వారా అనేక వ్యాపార సంస్థలు ఒకే డిజిటల్ నెట్‌వర్క్‌లో సేవలు అందించగలుగుతాయి. అయితే ఈ అంశంపై ఫ్లిప్‌కార్ట్ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.

కస్టమర్లకు మంచి సేవలు అందించడమే లక్ష్యం

ఫ్లిప్‌కార్ట్ కొత్త రంగంలోకి అడుగుపెట్టే ముందు వినియోగదారులకు ప్రత్యేకంగా వ్యాల్యూ సర్వీస్ అందించాలని లక్ష్యంగా పెట్టుకుంటోంది. తక్కువ ధరలు మాత్రమే కాకుండా వేగవంతమైన డెలివరీ, నమ్మకమైన సేవలు, ఎక్కువ రెస్టారెంట్ ఎంపికలు కూడా వినియోగదారులకు అందించాలని భావిస్తోంది.

వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా సేవలను మెరుగుపరిచిన తర్వాత మాత్రమే దేశవ్యాప్తంగా విస్తరించాలని సంస్థ ప్రణాళిక రూపొందించింది.

మరిన్ని రెస్టారెంట్లు చేర్చే లక్ష్యం

కాలక్రమేణా ఎక్కువ సంఖ్యలో రెస్టారెంట్లను తన ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులోకి తీసుకురావాలని ఫ్లిప్‌కార్ట్ లక్ష్యంగా పెట్టుకుంది. ఇతర ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్‌లలో ఉన్న రెస్టారెంట్లు కూడా తమ ప్లాట్‌ఫామ్‌లో ఉండేలా ప్రయత్నిస్తామని సంస్థ తెలిపింది. దీంతో వినియోగదారులకు మరిన్ని ఆప్షన్లు లభించే అవకాశం ఉంటుంది.

Also Read: భార్య ఎక్కువ సంపాదిస్తే సంబంధాలపై ప్రభావం ఉంటుందా? తాజా అధ్యయనంలో తేలింది ఇదే

ఫుడ్ డెలివరీ మార్కెట్లో ఊబర్ ఈట్స్ ఉదాహరణ

ప్రస్తుతం భారత ఫుడ్ డెలివరీ మార్కెట్లో జొమాటో, స్విగ్గీ ప్రధాన సంస్థలుగా కొనసాగుతున్నాయి. ఒఎన్‌డీసీ ఆధారిత ఫుడ్ ఆర్డరింగ్ సేవలు కూడా క్రమంగా ప్రాచుర్యం పొందుతున్నాయి. ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ ప్రవేశంతో ఈ రంగంలో పోటీ మరింత పెరిగే అవకాశం ఉంది. దీని వల్ల వినియోగదారులకు మెరుగైన సేవలు, వేగవంతమైన డెలివరీలు, ఆకర్షణీయమైన ఆఫర్లు లభించే అవకాశాలు ఉన్నాయి. కానీ ఫ్లిప్‌కార్ట్ ఈ రంగంలో రాణించడం అంత సులువు కాదు. గతంలో ఊబర్ కంపెనీ కూడా ఊబర్ ఈట్స్ పేరుతో ఫుడ్ డెలివరీ సేవలు ప్రారంభించి చేతులు కాల్చుకుంది. చివరికి నష్టాలు భరించలేక జొమాటోకు ఊబర్ ఈట్స్ విక్రయించేసింది.

ఫ్లిప్‌కార్ట్‌కు ఉన్న బలాలు

ఫ్లిప్‌కార్ట్‌కు ఇప్పటికే దేశవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగదారులు ఉన్నారు. సంస్థకు బలమైన లాజిస్టిక్స్ నెట్‌వర్క్ ఉంది. అలాగే క్విక్ కామర్స్ రంగంలో కూడా అనుభవం పెరుగుతోంది. ఈ బలాలు ఫుడ్ డెలివరీ రంగంలో సంస్థకు ఉపయోగపడే అవకాశముంది. అయితే సేవల నాణ్యత, వేగం, వినియోగదారుల సంతృప్తే విజయాన్ని నిర్ణయిస్తాయి.

Related News

అప్పులు తీర్చడానికి మళ్లీ కొత్త అప్పులు.. నెల ఆదాయం మొత్తం ఈఎంఐలు తీర్చడానికే..

బంగారం కొందామనుకుంటున్నారా? తగ్గింది కదా అని సంబరపడేలోపే బిగ్ ట్విస్ట్

బంగారు ఆభరణాలపై ఈ సీక్రెట్ కోడ్స్ గమనించారా? ఈ 916, 750, 585 నెంబర్లకు అర్థమేంటి?

దిగొచ్చిన పసిడి ధరలు.. ఇది తాత్కాలిక షాకా.. కొనుగోలుకు గోల్డెన్ ఛాన్సా?

నేషనల్ పెన్షన్ సిస్టమ్ కొత్త రూల్స్.. పెన్షన్ డబ్బులకు ఫుల్ గ్యారెంటీ, ఇంకెందుకు ఆ చింత

ఆకాశానికి క్రూడ్ ఆయిల్ ధరలు.. 95 డాలర్లు పైనే, ఆయిల్ ధరలు పెరిగే ఛాన్స్

పసిడి షాక్.. కొండెక్కి కూర్చున్న బంగారం ధరలు.. ఆషాఢం ఎఫెక్టేనా!

Big Stories

Advertisement
×