E-Paper
Advertisement

DELHI: రెండు ప్రభుత్వ సంస్థల విలీనం.. ఆపై రాష్ట్రపతి ఆమోదముద్ర, ఏంటి ఆ కంపెనీలు

DELHI: రెండు ప్రభుత్వ సంస్థల విలీనం.. ఆపై రాష్ట్రపతి ఆమోదముద్ర, ఏంటి ఆ కంపెనీలు
Advertisement

DELHI:  దేశంలో పెద్ద కంపెనీల విలీన ప్రక్రియ జోరందుకుంది. తాజాగా రెండు ప్రభుత్వ సంస్థల విలీనం జరిగింది. మోదీ సర్కార్ ఆమోదించడం, దానికి రాష్ట్రపతి ఆమోద‌ ముద్ర వేయడం చకచకా జరిగిపోయింది. ఇంతకీ ఆ రెండు కంపెనీలు ఏంటి? ఈ స్టోరీపై ఓ లుక్కేద్దాం.

ఎట్టకేలకు రెండు ప్రభుత్వ సంస్థల విలీనం

Advertisement

కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం ప్రభుత్వ కంపెనీలు విలీనానికి వేగంగా అడుగులు వేస్తోంది. ఓ వైపు కంపెనీలను విలీనం చేయడమే కాదు, ఇంకోవైపు ప్రభుత్వ సంస్థల్లో వాటాలను విక్రయిస్తోంది. ఒక్కమాటలో చెప్పాలంటే పెట్టుబడుల ఉపసంహరణ, విలీనాలకు సంబంధించి దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటోంది. ఇటీవల వివిధ ప్రభుత్వ బ్యాంకులను ఆఫర్ ఫర్ సేల్ విధానంలో వాటా విక్రయించడం మొదలుపెట్టింది.

అందుకు పెట్టుబడుదారుల నుంచి మాంచి రెస్పాన్స్ వస్తోంది. ఇతర సంస్థల్లోని కొన్ని కంపెనీలను విలీన ప్రక్రియ చేపడుతోంది. తాజాగా ప్రభుత్వ రంగ సంస్థ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్‌-PFC, ఆర్ఈసీని విలీనం చేసింది. ఈ ప్రతిపాదనకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదముద్ర వేశారు.

Advertisement

రాష్ట్రపతి ఆమోదముద్ర, ఈ రెండు కంపెనీలేంటి? 

ఈ విలీనం ద్వారా రూ. 10.81 లక్షల కోట్లకుపైగా అతిపెద్ద ప్రభుత్వ విద్యుత్ లెండర్లలో ఒకటిగా నిలవనుంది. ఆర్ఈసీ సంస్థలోని ప్రభుత్వానికి చెందిన మెజార్టీ వాటాను పీఎఫ్‌సీ కొనుగోలు చేసింది. దాదాపు ఏడేళ్ల తర్వాత అనుమతులు లభించాయి. 2019 మార్చిలో ఆర్‌ఈసీ కంపెనీలో ప్రభుత్వానికి చెందిన సుమారు 52 శాతం వాటాపైగానే కొనుగోలు చేసింది పీఎఫ్‌సీ.

అయితే ఈ డీల్ విలువ సుమారు రూ. 14500 కోట్లు. ఆనాటి నుంచి ఆర్ఈసీ సంస్థ- పీఎఫ్‌సీకి అనుబంధంగా కొనసాగుతోంది. రాష్ట్రపతి ఆమోదానికి సంబంధించిన సమాచారాన్ని ఆర్ఈసీ సంస్థ వెల్లడించింది. విలీనానికి ఆమోదం లభించడంతో ఆర్ఈసీ ఆస్తులు,అప్పులు.. ఇక పీఎఫ్‌సీకి బదిలీ కానున్నాయి. ఫిబ్రవరిలో పెట్టిన బడ్జెట్ సందర్భంగా ఆర్ఈసీ- పీఎఫ్‌సీ విలీనం గురించి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రస్తావించారు.

ALSO READ: బంగారం-వెండి ధరల పతనం.. కొనుగోలు ఇదే సరైన సమయం, ధరల పతనం వెనుక?

ఇప్పుడు విలీనం తర్వాత ప్రభుత్వ వాటా 51 శాతానికి తగ్గకుండా ఉండేందుకు కొత్త ప్రిఫరెన్స్ షేర్లు లేదా ఫ్రెష్ ఈక్విటీ షేర్లను ప్రభుత్వం ఇష్యూ చేసే అవకాశముంది. జూన్ 10న పీఎఫ్‌సీ షేరు ఒక శాతానికిపైగా తగ్గింది. ప్రస్తుతం రూ. 430.55 వద్ద స్థిరపడింది. మరోవైపు ఆర్ఈసీ షేరు ఒక శాతం పతనమైంది. ప్రస్తుతం రూ. 348.45 వద్ద కొనసాగుతోంది.

సంస్థల ఆదాయాన్ని స్థిరంగా ఉంచేందుకు ఇటీవల వాటాల్ని విక్రయిస్తోంది ప్రభుత్వం. ఈ ఏడాది తొలుత భెల్, IRFC సంస్థలో ఓఎఫ్ఎస్ విధానంలో షేర్లను విక్రయించింది. ఆ తర్వాత సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కోల్ ఇండియా, NHPC, NLC ఇండియా వంటి సంస్థల్లో వాటాల్ని విక్రయించింది కూడా. మొత్తానికి ప్రభుత్వ రంగ సంస్థలను విలీనం చేస్తూ, అందులోని వాటాలను క్రమంగా విక్రయించడం మొదలుపెట్టింది.

Related News

ఫుడ్ డెలివరీ బాయ్‌గా పనిచేశాడు కట్ చేస్తే ఈ రోజు కోటీశ్వరుడు.. రోజుకు రూ.6.3 లక్షల ఆదాయం

నెలకు రూ.10 లక్షల వరకు జీతం.. ప్రపంచమంతా తిరిగిరావొచ్చు.. ఇంటర్మీడియట్ ఉంటే చాలు

త్వరలో అదానీ ఎయిర్ లైన్స్.. ఆందోళన వ్యక్తం చేసిన ఇండిగో, ఎయిర్ ఇండియా

అప్పులు తీర్చడానికి మళ్లీ కొత్త అప్పులు.. నెల ఆదాయం మొత్తం ఈఎంఐలు తీర్చడానికే..

సాహసం చేయబోతున్న ఫ్లిప్‌కార్ట్.. స్విగ్గీ, జొమాటో ఆధిపత్యానికి సవాల్

బంగారం కొందామనుకుంటున్నారా? తగ్గింది కదా అని సంబరపడేలోపే బిగ్ ట్విస్ట్

బంగారు ఆభరణాలపై ఈ సీక్రెట్ కోడ్స్ గమనించారా? ఈ 916, 750, 585 నెంబర్లకు అర్థమేంటి?

దిగొచ్చిన పసిడి ధరలు.. ఇది తాత్కాలిక షాకా.. కొనుగోలుకు గోల్డెన్ ఛాన్సా?

Big Stories

Advertisement
×