Rajya Sabha Elections: తెలంగాణ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించే అవకాశం కోసం కాంగ్రెస్ పార్టీలో మునుపెన్నడూ లేనంత డిమాండ్ కనిపిస్తోంది. త్వరలో ఖాళీ కానున్న రాజ్యసభ సీటును దక్కించుకోవడంపై సీనియర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం.. దాదాపు డజనుకు పైగా నేతలు ఢిల్లీ స్థాయిలో పైరవీలు మొదలుపెట్టారు. పార్టీకి అత్యంత విధేయుడు, సుదీర్ఘ అనుభవం ఉన్న నేతగా జీవన్ రెడ్డి , బీఆర్ఎస్ నుంచి తిరిగి కాంగ్రెస్ గూటికి చేరిన కేకే,ఇరవత్రి అనిల్, సంపత్ కుమార్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరున్న వేం నరేందర్ రెడ్డి పేరు కూడా ట్రై చేస్తున్నట్లు తెలిసింది. ఇక షబ్బీర్ అలీ ,ఫిరోజ్ ఖాన్ లు కూడా మైనారిటీ కోటాలో ట్రై చేస్తున్నట్లు సమాచారం. వీరితో పాటు కోదండ రెడ్డి హర్కర వేణు గోపాల్ కూడా ప్రయత్నిస్తున్నారు .పార్టీ సీనియర్లుగా, మేధావి వర్గ ప్రతినిధులుగా వీరు తమ విజ్ఞప్తులను అధిష్టానానికి పంపినట్లు తెలిసింది.
కేవలం సామాజిక వర్గాలే కాకుండా, రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాల్లో పార్టీ బలోపేతం కోసం ఎవరిని పంపితే బాగుంటుందనే కోణంలో హైకమాండ్ ఆలోచిస్తోంది. ఈ నేపధ్యంలో కష్టకాలంలో పార్టీని నమ్ముకున్న వారికి ప్రాధాన్యత ఉంటుందా? బీసీ, ఎస్సీ, మైనారిటీ సమీకరణాలను ఎలా బ్యాలెన్స్ చేస్తారు? అనే అంశాలు సస్పెన్స్ గా మారాయి.ఇక రాష్ట్ర నాయకత్వంతో సఖ్యతగా ఉండే నేతలకు అవకాశం దక్కుతుందా? అనేది కూడా త్వరలోనే తెలియనున్నది.అయితే ఒక్క ఛాన్స్ అంటూ అభ్యర్థిస్తున్న సీనియర్ల విజ్ఞప్తులను సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే బృందం ఎలా పరిగణనలోకి తీసుకుంటుందో చూడాలి. ఎవరికి ‘హస్తం’ అభయం లభిస్తుంది? ఎవరికి రాజ్యసభ యోగం పడుతుంది? అనేది మరికొద్ది రోజుల్లోనే తేలనుంది.
తెలంగాణ కోట లో అభిషేక్ సింగ్వీ, సురేష్ రెడ్డి స్థానాలు ఖాళీ కానున్నాయి. ప్రస్తుతం టిఆర్ఎస్కు సంఖ్యాబలం లేనందున ఈ రెండు సీట్లు కాంగ్రెస్ పొందే ఛాన్స్ ఉన్నది. దీంతోనే రాజ్యసభ సీట్ల కోసం సీనియర్ నేతలు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. అసెంబ్లీలో టెక్నికల్ గా టిఆర్ఎస్కు 38 మంది శాసనసభ్యులు ఉన్నారు. ఇందులో 10 మంది కాంగ్రెస్ గూటికి చేరినట్లు ఆ పార్టీ నేతలు గతంలోనే వెల్లడించారు. ఈ నేపథ్యంలో టిఆర్ఎస్కు ఒక్క రాజ్యసభ సీటు కూడా వచ్చే ఆస్కారం లేదు. ఫుల్ ఓటింగ్ అంటే ఆ పార్టీకి చెందిన 38 మంది ఎమ్మెల్యేలు ఓటేసినా… రాజ్యసభ స్థానం గెలిచే అవకాశం లేదు. దీంతో కాంగ్రెస్ సీనియర్ నేతలు ఆ రెండు సీట్లపై గంపెడ ఆశలు పెట్టుకున్నారు.
Also Read: Hill Station: మనదేశంలోనే అత్యంత ప్రశాంతమైన హిల్ స్టేషన్ ఇది, జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే