E-Paper
Advertisement

Hyderabad Crime: హైదరాబాద్‌లో దారుణమైన ఘటన.. భార్యని రోకలిబండతో చంపేశాడు, ఆ తర్వాత నిందితుడు

Hyderabad Crime: హైదరాబాద్‌లో దారుణమైన ఘటన.. భార్యని రోకలిబండతో చంపేశాడు, ఆ తర్వాత నిందితుడు
Advertisement

Hyderabad Crime:  హైదరాబాద్‌లో దారుణం జరిగింది. భార్యభర్తల మధ్య ఏం జరిగిందో తెలీదు. పట్టరాని కోపంతో భార్యపై రోకలి బండతో దాడి చేసి హత మార్చాడు ఆమె భర్త. ఘటన తర్వాత అక్కడి నుంచి పరారయ్యాడు. సంచలనం రేపిన ఈ ఘటన బోరబండ ప్రాంతంలో వెలుగు చూసింది. అసలేం జరిగింది?

హైదరాబాద్‌లోని బోరబండ ప్రాంతంలో దారుణం

Advertisement

నిన్న సిద్ధిపేట్.. నేడు హైదరాబాద్. ఈ రెండు ఘటన వెనుక ఒక్కటే కారణం.  అదే అక్రమ సంబంధాల వ్యవహారం. సిద్ధిపేట్‌లో మాదిరిగా రాత్రి హైదరాబాద్‌లోని బోరబండ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. భార్యకి మరొకరితో అక్రమ సంబంధం ఉందన్న కారణంగా అత్యంత దారుణంగా హత్య చేశాడు ఆమె భర్త. ఘటన తర్వాత అక్కడి నుంచి పరారయ్యాడు.

పచ్చని సంసారంలో అక్రమ సంబంధాలు చిచ్చు పెడుతున్నాయి. అది నిజంగా జరిగిందా? లేక అనుమానం పెనుభూతమైందా? అనేది ప్రస్తుతానికి సీక్రెట్. ఈ ఘటన వెనుక గుట్టు విప్పే పనిలో పడ్డారు పోలీసులు. హైదరాబాద్ సిటీలోని బోరబండ ప్రాంతంలో ఆంజనేయులు-సరస్వతి దంపతులు నివాసం ఉంటున్నారు. వీరిద్దరు కుటుంబాన్ని పోషిస్తూ జీవనం కొనసాగిస్తున్నారు.

Advertisement

భార్యని రోకలి బండతో చంపేసిన భర్త

ఎంతో జాలీగా ఉండే ఈ దంపతుల మధ్య చిన్నపాటి కుదుపు మొదలైంది. భార్య నడవడికపై భర్తను అనుమానం మొదలైంది. తన భార్యకి మరొకరితో అక్రమ సంబంధం ఉందని భావించాడు. రోజు రోజుకూ ఆ వ్యవహారం పెరిగి ఆంజనేయులను వేధించడం మొదలుపెట్టింది. ఈ వ్యవహారంపై ఆంజనేయులు-సరస్వతి మధ్య గొడవలు జరిగేవి.

ఈ టార్చర్ తట్టుకోలేక రాత్రి భార్యపై రోకలి బండతో బలంగా దాడి చేసి హత మార్చాడు. ఘటన తర్వాత కాసేపు ఏడ్చిన ఆంజనేయులు, భయపడ్డాడు. తనను పోలీసులు అరెస్టు చేస్తారని భావించి అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికులు ఈ దంపతులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ALSO READ:  అనంతపురం జిల్లాలో తీవ్ర విషాదం.. భార్యభర్తల గొడవలకు బలైన నాలుగేళ్లు బాలుడు

వారు వచ్చేసరికి సరస్వతి విగతజీవిగా పడి ఉంది. స్థానికుల సాయంతో మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హత్యపై కేసు నమోదు చేశారు పోలీసులు. నిందితుడ్ని అరెస్టు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. ఆంజనేయులు అరెస్టయితేగానీ అసలు విషయాలు వెలుగులోకి రావు.

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×