Sangareddy Crime News: దాదాపు దశాబ్దం తర్వాత ఆ కుటుంబంలో పుట్టిన కొడుకుని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు తల్లిదండ్రులు. కారు రూపంలో ఆ బాలుడ్ని మృత్యువు కాటేసింది. ఆ తల్లి తీరని విషాదాన్ని మిగిల్చింది. కళ్ల ముందు కనిపించిన కొడుకు లేడన్న విషయాన్ని ఆ తల్లి జీర్ణించుకోలేక పోతోంది. ఇంతకీ ఘటనపై ఆ తల్లి ఏమంది?
సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో జరిగిన కారు ప్రమాద ఘటనకు సంబంధించి కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. సోమవారం సాయంత్రం మహేశ్వరి అనే యువతి కారు నేర్చుకుంటూ స్టీరింగ్ అదుపు తప్పింది. దాని ఫలితంగా ఖాళీ ప్రాంతంలో ఆడుకుంటున్న ఇద్దరు పిల్లలపైకి దూసుకెళ్లింది కారు.
ఈ ఘటనలో 10 ఏళ్ల మణివర్మ స్పాట్లో మృతి చెందాడు. బాలుడి అక్క ఏకవాణి తీవ్రగాయాలు అయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందిన బాలిక డిశ్చార్జ్ అయ్యింది. కారు నడిపిన యువతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జరిగిన ఘటనపై మృతుడు మణి తల్లి బిగ్ టీవీతో మాట్లాడింది.
కొడుకు-కూతురు ఆడుకునేందుకు గ్రౌండ్‌కు వెళ్లారు. యాక్సిడెంట్ విషయం తెలియగానే వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. రక్తపు మడుగులో కొడుకుని చూసి తట్టుకోలేక పోయానని కన్నీరు మున్నీరు అయ్యింది. చాలా సంవత్సరాల తర్వాత తమకు కొడుకు పుట్టాడని, అల్లారుముద్దుగా పెంచుకుంటున్నామని తెలిపింది. అంతలోనే ఆ బాలుడు మృత్యువాతపడ్డాడు. బాలుడు తండ్రి శేఖర్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులు మహేశ్వరి, రవిశేఖర్లను అదుపులోకి తీసుకున్నారు.
ALSO READ: పార్టీలో డీజే కోసం గొడవ.. టీనేజర్‌ని హత్య చేసిన యువకులు