IPL 2026-SSMB 29 : సాధారణంగా ఐపీఎల్ వేలం అంటే ఉండే క్రేజ్ అలాంటిది. వేలం వేస్తున్నారంటే అభిమానులు ఎంతో ఆసక్తిగా టీవీలకు అత్తుకుపోయి వీక్షిస్తుంటారు. ఏ ఆటగాడు ఏ టీమ్ లో ఉంటాడనేది వేలం ద్వారానే తెలుస్తోంది. అయితే ఐపీఎల్ 2026 వేలానికి ప్రాంఛైజీలు ఇప్పటికే సిద్ధం అవుతున్నాయి. డిసెంబర్ 15న మినీ వేలం జరుగనున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా అన్నీ తమ రిటెన్షన్ లిస్ట్ ను మరో వారం రోజుల్లో అనగా నవంబర్ 15 వరకు ఐపీఎల్ కి అందజేయనున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఏ ఫ్రాంచైజీ ఎవరినీ రిటైన్ చేసుకుంటుంది. ఎవరినీ వదులుకుంటుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Also Read : IPL 2026: సంజు ఎఫెక్ట్..జడేజా అకౌంట్ పై బ్యాక్, ఐపీఎల్ 2026కు ముందే సంచలనం !
వాస్తవానికి ఐపీఎల్ మినీ వేలం డిసెంబర్ 15న నిర్వహించే అవకాశం ఉందని TOI పేర్కొంది. గత రెండు వేలం పాటలను దుబాయ్, సౌదీ అరేబియాలో జరపగా.. ఈ సారి ఇండియాలోనే నిర్వహించే అవకాశం ఉందని తెలిపింది. అయితే రిటెన్షన్ డెడ్ లైన్ ఈనెల 15న ముగియనుంది. ఈలోపు ఫ్రాంచైజీలు తాము అంటిపెట్టుకునే ప్లేయర్లను ప్రకటించాలి. చెన్నై సూపర్ కింగ్స్ రవీంద్ర జడేజా, శాంసన్ ను ట్రేడ్ చేసుకోవచ్చని ప్రచారం జరుగుతోంది. ఐపీఎల్ రిటెన్షన్ చివరి తేదీ నవంబర్ 15, అలాగే ఎస్.ఎస్.రాజమౌళి-సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా అప్ డేట్ కూడా నవంబర్ 15న ఉండటం విశేషం. అదేరోజు హైదరాబాద్ లోని రామోజీ ఫిలింసిటీలో ఓ ఈవెంట్ ఏర్పాటు చేసి రాజమౌళి-మహేష్ బాబు మూవీ గురించి అప్డేట్ ఇవ్వనున్నట్టు సమాచారం.
మహేష్ బాబు-రాజమౌళి మూవీకి సంబంధించి సినిమాకి టైటిల్ ఏంటి..? హీరో ఎలా ఉండబోతున్నాడు. ఎలా కనిపించబోతున్నాడు..? హీరోయిన్, విలన్ ఇలా అన్ని విషయాలపై నవంబర్ 15న క్లారిటీ ఇవ్వనున్నాడు దర్శక ధీరుడు. నవంబర్ 15న హైదరాబాద్ లోని ఫిలింసిటీలో జరిగే భారీ ఈవెంట్ కి చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. అందులో భాగంగానే ఈ మూవీలో విలన్ గా చేస్తున్న పృథ్వీరాజన్ సుకుమారన్ పోస్టర్ ను ఇటీవల రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ పై సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. 24 మూవీలో సూర్య కనిపించిన గెటప్ లా ఉందని.. స్పైడర్ మ్యాన్ మూవీలో విలన్ క్యారెక్టర్ కి దగ్గరగా ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే నవంబర్ 15న ఐపీఎల్ రిటెన్షన్ అలాగే మహేష్ బాబు సినిమా ఈవెంట్ ఉన్న నేపథ్యంలో ఫ్యాన్స్ పిచ్చోళ్ళు అవుతున్నారు. ఆ రోజు తమ ఇష్టమైనా ఐపీఎల్ రిటెన్షన్ విశేషాలు చూడాలా..? తమకు ఇష్టమైన మహేష్ బాబు-రాజమౌళి మూవీ అప్ డేట్ వీక్షించాలా..? అని తెగ టెన్షన్ పడుతున్నారు. ఒకే రోజు రెండు ఉండటంతో ఇలా ఎందుకు పెట్టారో ఏమో అని కొందరూ చర్చించుకుంటున్నారు. ఈ రెండింటిలో ఏది చూడాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది అని ఫ్యాన్స్ పేర్కొంటున్నారు.