E-Paper
Advertisement

DJ Dispute Murder: పార్టీలో డిజె కోసం గొడవ.. టీనేజర్‌ను హత్య చేసిన యువకులు

DJ Dispute Murder: పార్టీలో డిజె కోసం గొడవ.. టీనేజర్‌ను హత్య చేసిన యువకులు
Advertisement

DJ Dispute Murder| కేవలం చిన్న గొడవ కారణంగా ఒక 18 ఏళ్ల అబ్బాయిని కొందరు యువకులు హత్య చేశారు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. ఉత్తర్ ఢిల్లీలోని మహేంద్ర పార్క్ లో ఒక హత్య జరిగింది. వాయువ్య ఢిల్లీ సమీపంలోని బఢోలా గ్రామానికి చెందిన భీమ్ సేన్ అనే 18 ఏళ్ల యువకుడు శనివరాం మే 17న రాత్రి ఒక కార్యక్రమంలో కొందరు యువకులు కత్తులతో పొడిచేశారు. ఆ తరువాత స్థానికులు భీమ్ సేన్ ని ఆస్పత్రికి తీసుకెళ్లగా ఆ యువకుడు చికిత్స పొందుతూ మరణించాడు.

సమాచారం అందడంతో ఢిల్లీలోని మహేంద్ర పార్క్ పోలీస్ స్టేషన్ పోలీసులు బిజెఆర్‌ఎం ఆస్పత్రికి చేరుకోగా.. 18 ఏళ్ల భీమ్ సేన్ శరీరంపై రెండు కత్తిపోట్ల గాయాలున్నాయి. చికిత్స పొందుతూ భీమ్ సేన్ ఆస్పత్రిలో చనిపోయాడు. పోలీసులు ఈ విషయాన్ని ధృవీకరించారు. మహేంద్ర పార్క్ పోలీసులు భారతీయ న్యాయ సంహిత చట్టం సెక్షన్ 103 ప్రకారం.. హత్య కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. హత్య జరిగిన ప్రదేశంలో ఫోరెన్సిక్ నిపుణులు ఆధారాలు సేకరిస్తున్నారు.

Advertisement

ఎందుకు చంపారంటే..
పోలీసుల కథనం ప్రకారం.. హత్య జరిగిన ఒక రోజు ముందు 18 ఏళ్ల భీమ్ సేన్ తన పార్టీలో డిజె బుకింగ్ చేసుకోవడానికి వెళ్లాడు. అయితే అక్కడ మరో మైనర్ బాలుడితో అతనికి వాగ్వాదం జరిగింది. భీమ్ సేన్ అతడిని అక్కడ తోసేశాడు. తరువాత రోజు అంటే మే 17న పార్టీలో ఆ మైనర్ మరో ముగ్గురు స్నేహితులతో కలిసి వెళ్లాడు. అక్కడ భీమ్ సేన్ డాన్స్ చేస్తుండగా.. అతడిపై దాడి చేశారు. ఈ క్రమంలో భీమ్ సేన్ వారిపై ఎదురు దాడి చేయగా.. ఈ క్రమంలో భీమ్ సేన్ కడుపులో రెండు సార్లు కత్తితో పొడిచేశారు.

ప్రస్తుతం విచారణ కోసం పోలీసులు ఆ నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. అయితే పోలీసుల చేతికి ఇంకా హత్య చేసిన ఆయుధం లభించలేదు. విచారణ కొనసాగుతోంది.

Advertisement

Also Read: వివాహం జరిగిన వారం రోజులకే మూడో భార్యను చంపిన భర్త.. ఏం జరిగిందంటే?..

హత్య లేక ఆత్మహత్య?

మరోవైపు ఉత్తర్ ప్రదేశ్ పరిధిలో ఢిల్లీ సమీపంలోని ప్రాంతంలో సూట్ కేసులో ఒక మహిళ మృతదేహం లభించింది. పోలీసులు విచారణ చేయగా.. ఆ మృతదేహం సవిత అనే మహిళది అనే తేలింది. ఆమె భర్త అశోక్ కుమార్ కి పోలీసులు అరెస్ట్ చేయగా.. షాకింగ్ విషయం తెలిసింది. నిజానికి సవిత ఉరి వేసుకొని ఆత్మ హత్య చేసుకోగా.. శవాన్ని ఆమె భర్త అశోక్ కుమార్ సూట్ కేసులో పెట్టి ఊరి చివర పడేశాడు. అశోక్ కుమార్ పై అనుమానంతో పోలీసులు సవిత శవానికి పోస్ట్ మార్టం కోసం తరలించారు.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×