Guntur Crime News: తెలుగు రాష్ట్రాల్లో దొంగలు రెచ్చిపోతున్నారు. గుంటూరు జిల్లాలో వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రెండు ఘటనల్లో 20 లక్షల బంగారు ఆభరణాలు, దాదాపు 10 లక్షల వరకు క్యాష్ చోరీ చేశారు. తెనాలిలో ఓ ఫంక్షన్‌కు హాజరైన ఐఆర్‌ఎస్ అధికారి కారులో చోరీ జరగడం కలకలం రేపింది. అసలేం జరిగింది?
గుంటూరు జిల్లాలో దొంగల బీభత్సం
గుంటూరు జిల్లా తెనాలిలోని చెంచుపేటలో ఓ ప్రైవేటు కార్యాక్రమానికి హాజరయ్యారు తెలంగాణకు చెందిన ఓ ఐఆర్‌ఎస్. ఫంక్షన్ తర్వాత హైదరాబాద్ వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో పార్కింగ్ చేసిన కారు వద్దకు వెళ్లారు. కారుని చూసి ఒక్కసారిగా ఆయన షాకయ్యారు. కారు అద్దం పగిలి ఉండటం చూసి నోటి మాట రాలేదు. కారు లోపల ఉంచిన బ్యాగ్ కోసం వెతికారు.
ఎక్కడా కనిపించలేదు. ఆ బ్యాగులో ఐదు లక్షల నగదు, సుమారు 10 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు ఉన్నాయి. అంతేకాదు మూడు ఐ ఫోన్‌లు, పాస్‌పోర్ట్, క్రెడిట్ కార్డులు ఉన్నాయి. ఫంక్షన్ ఇంటివారికి ఈ విషయాన్ని చెప్పారు. ఈ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే తెనాలి మూడో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు పోలీసులు.
తెలంగాణ ఐఆర్ఎస్ అధికారి బ్యాగ్ కూడా
మరోవైపు అదే నియోజకవర్గంలో తూములూరు గ్రామంలో మరో చోరీ జరిగింది. స్థానికంగా ఉండే మధుసూదనరావు ఇంట్లోకి దొంగలు చొరబడ్డారు. బీరువా తాళాలు పగలగొట్టి అందులో దాదాపు 10 లక్షల విలువ చేసే బంగారు నగలు ఎత్తుకెళ్లారు. మధుసూదనరావు తూర్పుగోదావరి జిల్లా రాజోలులో రైస్ మిల్ నడుపుతున్నారు. పండగ కోసం నరసరావుపేటకు వెళ్లింది ఆయన ఫ్యామిలీ.
ఇంట్లో ఎవరూ లేని విషయం తెలుసుకున్న దొంగలు, ప్లాన్ ప్రకారం చోరీకి పాల్పడ్డారు. ఇంటికి తిరిగి వచ్చాక చోరీ జరిగినట్లు గుర్తించారు ఆయన. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. తెనాలి నియోజకవర్గంలో రెండు భారీ చోరీలు జరగడం తీవ్ర కలకలం రేపింది. వీటికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.
ALSO READ: పెదనాన్న పరువు తీస్తున్నాడని యువతి సూసైడ్