Hyderabad Crime News: హైదరాబాద్-కొంపల్లిలో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. తాను చనిపోవడానికి పెదనాన్న కారణమని సుసైడ్ నోట్‌లో క్లియర్‌గా రాసుకొచ్చింది. అంతేకాదు.. వాళ్ల నాన్న జరిగినప్పుడు కొన్ని విషయాలను అందులో రాసుకొచ్చింది. ఇంతకీ యువతి ఆత్మహత్యకు దారి తీసిన కారణాలేంటి? అసలేం జరిగింది? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..
హైదరాబాద్‌లో దారుణం
హైదరాబాద్‌లోని కొంపల్లి ప్రాంతంలో అంజలి ఉంటోంది. నిజామాబాద్ జిల్లా వర్ని ప్రాంతానికి చెందినవారు కొంపల్లిలో ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె సమీపంలోని ఓ కళాశాలలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతోంది. బాధితురాలి తండ్రి ఏడాది కిందట రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.
అంతకుముందు యువతి తండ్రి-తన పెదనాన్నతో కలిసి మేడ్చల్‌లో ఫైనాన్స్ వద్ద రుణం తీసుకున్నారు. రుణం చెల్లించాలని తరచూ ఇంటికి వచ్చినప్పుడల్లా బాలికను వేధించేవాడు. వాటిని తట్టుకోలేక మనో వేదనకు గురైన బాలిక, గురువారం సాయంత్రం ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.
పెదనాన్న వేధింపులు.. యువతి ఆత్మహత్య
పోస్టుమార్టం నిమిత్తం అంజలి మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. పోలీసుల విచారణలో అంజలి రాసిన సుసైడ్ లేఖ వెలుగులోకి వచ్చింది. తనను ఇంట్లో నుంచి వెళ్లగొట్టేందుకు పెదనాన్న ప్రయత్నిస్తున్నాడని పేర్కొంది. చీటికి మాటికీ పరువు తీస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. అంజలి ఈ లోకంలో లేదని విషయం తెలియగానే కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.
గురువారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. అంజలి, తన చెల్లిని ఆమె తల్లి అల్లారుముద్దుగా పెంచిందని అంటున్నారు స్థానికులు. అంజలి రాసిన సుసైడ్ లేఖలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. నాన్న-పెదనాన్న కలిసి చేసిన అప్పులు తీర్చాల్సిన బాధ్యత పెద్దనాన్నపై ఉందని పేర్కొంది.
ALSO READ: చెన్నకేశవస్వామి రథోత్సవంలో అపశృతి, ముగ్గురు మృతి
ఆస్తి మొత్తమంతా పెదనాన్న పేరు మీద ఉందని, అయినా డబ్బులు కట్టాలంటూ ఇంటికి వచ్చి పదేపదే వేధిస్తున్నాడని ప్రస్తావించింది. తాను చనిపోవడానికి శ్రీను ప్రధాన కారణమని, నాన్న లేడన్న కనికరం లేకుండా చిత్రహింసలు పెట్టాడని మనసులోని బాధను వ్యక్తం చేసింది. తాము ఉంటున్న ఇంటికి ఖాళీ చేయించాలని ప్లాన్ చేశాడని పేర్కొంది.
పెదనాన్న తమను మనశ్శాంతిగా బతకనివ్వడని, చనిపోతున్నందుకు క్షమించాలని తల్లిని కోరింది అంజలి. తన తండ్రిని పెదనాన్న చంపాడని యువతి కొత్త విషయాన్ని బయటపెట్టింది. తన తమ్ముడ్ని చంపినవాడికి మీరెంతని పెదనాన్న అనేవాడని, అతనికి ఖచ్చితంగా శిక్ష పడాలని పేర్కొంది. తన తండ్రి చనిపోతే తీసుకున్న లోన్ క్లోజ్ అవుతుందని భావించిన పక్కాగా ప్లాన్ ప్రకారం చంపేశాడని రాసుకొచ్చింది. అంజలి ఆత్మహత్య చేసుకున్నప్పుడు ఇంట్లో అంజలి అమ్మ లేరు.