BigTV English
Advertisement

Cyber criminals: పోలీసు డీపీ.. వేస్తారు టోపీ, సైబర్ నేరస్తుల సరికొత్త ట్రాప్

Cyber criminals: పోలీసు డీపీ.. వేస్తారు టోపీ, సైబర్ నేరస్తుల సరికొత్త ట్రాప్

Cyber criminals who have changed their route dps of police officers: సైబర్ నేరాలపై ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తున్నా..ఎప్పటికప్పుడు ప్రజలు మోసపోతునే ఉన్నారు. సైబర్ నేరాలపై ఎన్నో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు పోలీసులు. మీకు ఏదైనా అపరిచితులనుంచి కాల్స్ వస్తే ముందుగానే మిమ్మల్ని సంప్రదించండి అంటున్నా..చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందాన తాము మోసపోయాక పోలీసులకు సమాచారం ఇస్తున్నారు. ఈ లోగా నిందితులు అప్రమత్తమైపోతున్నారు. ఎప్పటికప్పుడు సాంకేతికపరంగా ఎన్నో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. సరికొత్త టెక్నాలజీని ఉపయోగించి సైబర్ నిందితులు రెచ్చిపోతున్నారు. ఒక టెక్నాలజీ పాతబడిపోగానే మరో కొత్త టెక్నాలజీని రంగంలో దించుతున్నారు. డబ్బుల కోసం సరికొత్త ఎత్తులను వేస్తూ తమ పనులు సాగించుకుంటున్నారు. రీసెంట్ గా పోలీసులమని చెబుతూ వాట్సాప్ కాల్స్ చేస్తుంటే ఎవరూ నమ్మడం లేదని..తమ డీపీలో పోలీసు అధికారుల ఫొటోలను పెట్టుకుంటున్నారు. మరి కొందరు ఆర్మీ అధికారులమంటూ డీపీలను పెట్టుకుని మరీ మోసాలకు పాల్పడుతున్నారు.


సీబీఐ టీమ్ అంటూ..

హఠాత్తుగా మీ ఫోన్ కు ఓ కాల్ వస్తుంది. తాము సీబీఐ ఆఫీసు నుంచి మాట్లాడుతున్నామని..మరికొద్ది సేపట్లో మా టీమ్ వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేస్తారంటూ బెదిరింపు కాల్స్ వస్తుంటాయి. మనకు అనుమానం వచ్చి వాళ్ల వాట్సాప్ డీపీని చెక్ చేస్తే పోలీసు టోపీతో ఓ డీపీ కనిపిస్తుంది. దాంతో ఆ వచ్చిన కాల్ నిజంగానే పోలీసుల దగ్గరనుంచే అని భయపడిపోతారు. ఫేస్ బుక్,వాట్సాప్ ట్రాప్ ద్వారా మన వ్యక్తిగత వివరాలు తెలుసుకుని మనలను ఈ రకంగా భయపెడుతూ ఉంటారు. ఇటీవల ఓ ప్రభుత్వ ఉన్నత ఉద్యోగానికి ట్రై చేసుకుంటున్న ఓ యువకుడికి డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నాడంటూ ఫోన్ కాల్ వచ్చింది. అది అంతర్జాతీయ నేరం కింద వస్తుందంటూ కాల్స్ వచ్చాయి. కేసు నమోదవ్వకుండా ఉండాలంటే కొంత డబ్బును ట్రాన్స్ పర్ చేయాలంటూ బెదిరిస్తారు. దీనితో భయపడిపోయి ఓ యువకుడు తనకు ఎక్కడ ప్రభుత్వ ఉద్యోగం రాకుండా పోతుందో అని వెంటనే వారు చెప్పిన ఎకౌంట్ నెంబర్ కు డబ్బులు ట్రాన్స్ పర్ చేశాడు.అదంతా మోసం అని తెలుసుకునేసరికి జరగాల్సిన అన్యాయం జరిగిపోయింది.


రుణ మాఫీ డబ్బులు

ఈ మధ్య రైతు రుణ మాఫీ పేరుతో రైతులకు రెండు విడతలుగా లక్ష చొప్పున రెండు లక్షలు రైతుల ఎకౌంట్లలో జమ అయ్యాయి. దీనిని ఆసరాగా తీసుకున్న సైబర్ నేరగాళ్లు మీ లోన్ కు సంబంధించి డిఫాల్ట్ అయ్యారని వెంటనే రుణమాఫీ డబ్బులను రిఫండ్ చేయాలని..లేకపోతే వారిపై సైబర్ నేరం నమోదు అవుతుందని బెదిరించారు . ఇలా చాలా మంది రైతులు తమకు నిత్యం ఏదో రకంగా ఇలాంటి ఫోన్ కాల్స్ వస్తున్నాయంటూ ఫిర్యాదు చేస్తున్నారు. అలాంటి ఫేక్ కాల్స్ నమ్మకండి అంటూ పోలీసులు వారిని అప్రమత్తం చేస్తున్నారు.

Also Read: గంగమ్మ ఒడికి గణనాథుడు.. ఆద్యంతం “జై గణేశా” నామస్మరణతో మారుమ్రోగిన భాగ్యనగర వీధులు

ముందస్తు సమాచారం

ఇలాంటి ఫోన్ కాల్స్ ను పోలీసులే ట్రాపింగ్ చేసి నిందితులను పట్టుకుని వారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. పోలీసులు కూడా పబ్లిక్ ని హెచ్చరిస్తున్నారు. సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఇకపై ఇలాంటి ఫేక్ కాల్స్ వస్తే ముందస్తుగా పోలీసులకు సమాచారం ఇవ్వాల్సిందిగా కోుతున్నారు. వెంటనే తాము రంగ ప్రవేశం చేసి సైబర్ నేరస్థులను పట్టుకునే ప్రయత్నం చేస్తామని చెబుతున్నారు

Related News

Vikarabad Crime: వేట కొడవలితో పీక కోసి భార్య-కూతుర్ని చంపిన భర్త, ఆపై ఆత్మహత్య, ఎక్కడ?

Hyderabad Crime: హుస్సేన్ సాగర్ లో గుర్తు తెలియని యువతి మృతదేహం కలకలం

Nizamabad Crime: నిజామాబాద్ జిల్లాలో ఘోరం.. నగ్నంగా మహిళను చంపి.. తల, చేయి తీసేసి..

Road Accident: స్కూటీని ఢీకొట్టిన లారీ.. డ్యాన్సర్ మృతి

Food Poisoning: షాకింగ్‌.. కలుషిత ఆహారం తిని 86 మంది విద్యార్థులకు అస్వస్థత

Kama Reddy News: పాపం.. అత్త, మామల వేధింపులు తట్టుకోలేక అల్లుడు ఆత్మహత్య..

crime News: దారుణం.. ఆర్టీసీ బస్సు కింద పడి వ్యక్తి ఆత్మహత్య.. వీడియో వైరల్

Visakha News: రాష్ట్రంలో దారుణ ఘటన.. కాలేజీలో మేడం లైంగిక వేధింపులు, స్టూడెంట్ సూసైడ్

Big Stories

×