Bengaluru : సినిమాలు, వెబ్ సిరీస్ లు ఒకప్పుడు ప్రేక్షకులకు ఆనందాన్ని పంచేవి.. కానీ ఈ మధ్య మాత్రం ఆత్మహత్య చేసుకోవడానికి ప్రేరేపిస్తున్నాయి అని కొన్ని వార్తలు చూస్తే నిజం అనే అనిపిస్తుంది.. మొన్న ఈ మధ్య సూక్ష్మ దర్శిని అనే తమిళ సినిమాను చూసి హైదరాబాదులో హత్య చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు అలాంటి తరహాలోనే మరో ఘటన వెలుగు చూసింది. వెబ్ సిరీస్ ని చూసి బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఏంటి నమ్మలేకపోతున్నారా? కానీ ఇది నిజమే.. ఈ ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. బెంగళూరులోని గాంధార్ అనే ఓ 14 ఏళ్ల కుర్రాడు జపనీస్ వెబ్ సిరీస్ ని చూసి ప్రాణాలు తీసుకున్నాడని పోలీసులు వెల్లడించారు. వార్త విన్న ఆ కుర్రాడు తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. వెబ్ సిరీస్ లో చూసిన ఓ బొమ్మని తన గదిలో గోడ మీద రాసి సూసైడ్ చేసుకున్నారు.. ప్రస్తుతం ఈ వార్త కలకలం రేపుతుంది.. దీనిపై పూర్తి వివరాలు త్వరలోనే తెలిసే అవకాశం ఉంది ..
గాంధార్ డెత్ నోట్ లో ఏముందంటే..?
బెంగళూరులో జరిగిన ఈ సూసైడ్ ఘటన దేశ వ్యాప్తంగా భయ బ్రాంతులకు గురి చేస్తుంది. మూడు రోజుల క్రితం జరిగిన ఘటన పై పోలీసులు ఆసక్తి విషయాలను వెల్లడించారు. డెత్ నోట్ లో అతని ఆత్మ హత్యకు గల కారణాలను ఆ నోట్ లో పేర్కొనలేదు. కానీ నేను స్వర్గానికి వెళ్లాను, నా కోసం ఎవరూ ఏడవొద్దు. గుడ్ బై అమ్మా అని చాలా చక్కగా రాసి 13 ఏళ్ల బాలుడు ఆత్మహత్య చేసుకోవడం అతని కుటుంబానికే కాదు, రాష్ట్రం మొత్తానికి షాక్‌నిచ్చింది. అందరితో రాత్రి భోజనం చేసి గుడ్ నైట్ చెప్పి తన ప్రియమైన కుక్క తో కలిసి గదిలోకి వెళ్లాడు. ఆ తర్వాత అన్నయ్య గిటార్‌ను మంచం మీద ఉంచి, దానిపై దుప్పటి కప్పుకుని తానే పడుకున్నట్లు అనిపించేలా చేశాడు. ఆగస్టు 4న ఉదయం 6 గంటలకు వాళ్ల అన్నయ్య వచ్చి చూస్తే మంచం మీద గిటార్ ఉంది.. ఆ గిటార్ ను తగిలిస్తున్న ప్లేస్ లో అతను వేలాడి కనిపించడం అందరిని షాక్ కి గురి చేసింది.
ప్రాణాలను తీస్తున్న వెబ్ సిరీస్ లు..?
గాంధార్ జపనీస్ భాషలో విడుదలైన ఓ వెబ్ సిరీస్‌లోని అన్ని ఎపిసోడ్‌లను క్రమం తప్పకుండా చూసేవాడని కుటుంబ సభ్యులు పోలీసులకు చెప్పారు. ఆ కోణంలో పోలీసులు దర్యాప్తు చేశారు. చివరికి విస్తూపోయే నిజాలను బయట పెట్టారు. దానివల్లే ఆత్మహత్య చేసుకొని చనిపోయి ఉంటారని వెల్లడించారు. ఈమధ్య సినిమాలను చూసి హత్యలు చేస్తున్న విషయం తెలిసిందే. ఎందుకు ఉదాహరణ హైదరాబాదులో ఇటీవల జరిగిన కుక్కర్ ఘటనే ఉదాహరణ. ఇప్పుడు వెబ్ సిరీస్ వల్ల మరో ప్రాణం పోయింది.. ఈ వార్త ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనాన్ని సృష్టిస్తుంది. ఆత్మహత్యకు ప్రేరేపించేలా ప్రజలను మార్చే వెబ్ సిరీస్ లను ప్రసారం చేయొద్దు అంటూ ఓటీటీ సంస్థలకు కొందరు వార్నింగ్ ఇస్తున్నారు. ప్రభుత్వాలు ఇలాంటి వాటిని ప్రోత్సహించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.