BigTV English

Cheapest Projector: ఇంట్లోనే థియేటర్ అనుభూతి పొందాలంటే.. చీపెస్ట్ ప్రొజెక్టర్ కొనాల్సిందే!

Cheapest Projector: ఇంట్లోనే థియేటర్ అనుభూతి పొందాలంటే.. చీపెస్ట్ ప్రొజెక్టర్ కొనాల్సిందే!

Best Projector: కొత్త సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు సినీ ప్రియులు థియేటర్లకు పరుగులు తీస్తారు. మరికొందరేమో ఓటీటీలో చూసేందుకు ఇష్టపడతారు. కానీ కొందరు ఇంట్లోనే ఓ ప్రొజెక్టర్ పెట్టి థియేటర్ వలే పెద్ద స్కీన్‌ అనుభవాన్ని పొందాలని అనుకుంటారు. అలాంటి వారు ఆన్‌లైన్‌లో తక్కువ ధరలో అందుబాటులో ఉన్న ది బెస్ట్ ప్రొజెక్టర్ల గురించి నిరంతరం సెర్చ్ చేస్తూనే ఉంటారు. కానీ వారి టేస్ట్‌కి, ధరకి తగ్గ ప్రొజెక్టర్లు కనిపించకపోవడంతో నిరాశ చెందుతారు. అయితే ఇప్పుడు అలా బాధ పడాల్సిన అవసరం లేదు.


ఎందుకంటే అతి తక్కువ ధరలో అదిరిపోయే ప్రొజెక్టర్లు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ప్రముఖ ఈ -కామర్స్ ప్లాట్ ఫార్మ్ అమెజాన్‌లో ఈ ప్రొజెక్టర్లను తక్కువ ధరలో కొనుక్కోవచ్చు. ఇప్పుడు వాటి గురించి పూర్తిగా తెలుసుకుందాం.

WZATCO Full HD Projector


WZATCO ఫుల్ HD ప్రొజెక్టర్ అసలు ధర అమెజాన్‌లో రూ. 17,999 ఉండగా.. ఇప్పుడు కేవలం రూ. 9,690లకే సొంతం చేసుకోవచ్చు. ఇది గరిష్టంగా 635 సెం.మీ (250 అంగుళాల) స్క్రీన్ సైజ్‌కు మద్దతు ఇస్తుంది. ప్రొజెక్టర్‌లో 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్‌తో పాటు 5 వాట్ ఇన్‌బిల్ట్ హై-ఫై ఎన్‌క్లోస్డ్ కేవిటీ స్పీకర్‌ను కలిగి ఉంది. అంతేకాకుండా ఈ ప్రొజెక్టర్‌లోని కనెక్టివిటీ ఆప్షన్‌ల విషయానికొస్తే… ఇందులో సెట్ టాప్ బాక్స్, ఫైర్ టీవీ స్టిక్, PC/ల్యాప్‌టాప్, DVD, ప్లే స్టేషన్, USB టు పవర్ & కనెక్ట్ హార్డ్ డ్రైవ్‌లు, ఇతర USB డివైజ్‌లను కనెక్ట్ చేయడానికి 2 x HDMIని కలిగి ఉంటాయి. ఈ ప్రొజెక్టర్ కొనుగోలుపై కంపెనీ 1 ఇయర్ వారంటీని అందిస్తుంది.

Lifelong Lightbeam Smart Projector

లైఫ్‌లాంగ్ లైట్‌బీమ్ స్మార్ట్ ప్రొజెక్టర్ అమెజాన్‌లో కేవలం రూ.7,299లో అందుబాటులో ఉంది. ఇది 180° రొటేటబుల్ డిజైన్, స్మార్ట్ ఆండ్రాయిడ్ ఇంటిగ్రేషన్‌తో వస్తుంది. అలాగే Google Play Store ద్వారా Netflix, Hotstar, Amazon Prime వీడియో, YouTube, మరిన్నింటి ప్రముఖ స్ట్రీమింగ్ సేవలకు యాక్సెస్‌ను అందిస్తుంది. కనెక్టివిటీ ఆప్షన్‌లు కూడా ఉన్నాయి. సెట్ టాప్ బాక్స్, ఫైర్ టీవీ స్టిక్, PC/ల్యాప్‌టాప్, DVD, ప్లే స్టేషన్‌తో సహా 1 x HDMI వంటివి ఉన్నాయి. అందువల్ల ఒక మంచి ప్రొజెక్టర్ తక్కువ ధరలో కొనుక్కోవాలని ప్లాన్ చేసే వారికి ఇదొక మంచి అవకాశం అని చెప్పాలి.

Also Read: ఇవాళే తొలి సేల్.. ఏకంగా రూ.3,000 డిస్కౌంట్, అదిరిపోయే ఫీచర్స్!

E Gate i9 Pro Max Bluetooth Projector

E Gate i9 Pro Max బ్లూటూత్ ప్రొజెక్టర్ అసలు ధర అమెజాన్‌లో రూ.15,990 ఉండగా.. ఇప్పుడు కేవలం రూ. 8,890లకే సొంతం చేసుకోవచ్చు. ఇది 4k సపోర్ట్‌తో పూర్తి HD 1080p నేటివ్‌కు మద్దతు ఇస్తుంది. నో కాస్ట్ EMI ఆప్షన్‌ ద్వారా రూ. 400 వరకు తగ్గింపు పొందవచ్చు. అదనంగా HDFC క్రెడిట్ కార్డ్‌లపై రూ.1750 తగ్గింపు కూడా ఉంది. ఇది 3 వాట్, 3.5 మిమీ ఆడియో అవుట్ జాక్‌ని కలిగి ఉంది.

Portronics Beem 440 Smart LED Projector

పోర్ట్రోనిక్స్ బీమ్ 440 స్మార్ట్ LED ప్రొజెక్టర్ అసలు ధర అమెజాన్‌లో రూ.19,999 ఉండగా ఇప్పుడు కేవలం రూ. 6,999లకే సొంతం చేసుకోవచ్చు. ఇది 720p HD రిజల్యూషన్ అందిస్తుంది. అలాగే రొటేటబుల్ డిజైన్‌తో వస్తుంది. అదనంగా నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, హాట్‌స్టార్‌తో సహా బిల్ట్ స్ట్రీమింగ్ యాప్‌లు ఉన్నాయి. పోర్ట్రోనిక్స్ ప్రొజెక్టర్‌లో నో-కాస్ట్ EMI కూడా లభిస్తుంది. దీని ద్వారా రూ.315 వరకు ఆదా చేసుకోవచ్చు. అలాగే బ్యాంక్ ఆఫర్లు ఉన్నాయి. హెచ్‌డిఎఫ్‌సి క్రెడిట్ కార్డ్‌లపై అమెజాన్ అదనంగా రూ.1750 తగ్గింపును ఇస్తోంది. ఇది ఆండ్రాయిడ్ 11 ఆధారిత OS పై రన్ అవుతుంది.

Related News

Caviar iphone: అత్యంత ఖరీదైన ఐఫోన్.. రూ.42 లక్షలు ధర.. కొనుగోలు చేయడం అసాధ్యమే?

Infinix GT 30 5G+: రూ.20000 కంటే తక్కువ ధరలో అద్భుత గేమింగ్ ఫోన్.. ఇన్ఫినిక్స్ GT 30 5G+ లాంచ్

Vivo T4R 5G vs iQOO Z10R 5G vs OnePlus Nord CE: 5 ఢీ అంటే ఢీ.. ఈ మూడు ఫోన్లలో ఏది బెస్ట్ తెలుసా?

Galaxy A55 vs Xiaomi 14 CIVI vs OnePlus Nord 5: మూడు ఫోన్లలో ఏది బెటర్.. విన్నర్ ఎవరెంటే?

iQOO Z10 Turbo+ 5G: ప్రీమియం ఫోన్లకు పోటీనిచ్చే మిడ్ రేంజ్ సూపర్ ఫోన్.. iQOO Z10 టర్బో+ 5G లాంచ్

Instagram New Feature: అయిపాయే.. ఇన్‌స్టాలో లైక్స్ చేస్తే వాళ్లు కూడా చూసేస్తారా!

Big Stories

×