BigTV English

Daughter Kills Father: కూతురిని దారిలో పెట్టాలనుకున్న తండ్రి.. ప్రాణానికే శాపమైన పేగుబంధం!

Daughter Kills Father: కూతురిని దారిలో పెట్టాలనుకున్న తండ్రి.. ప్రాణానికే శాపమైన పేగుబంధం!

Daughter kills Father in Madanapalle: పిల్లలు జీవితంలో ఉన్నతస్థాయిలో ఉంటే, జీవిత భాగస్వామితో ఆనందంగా ఉంటే చూసి ఆనందిస్తారు తల్లిదండ్రులు. కనిపెంచిన బిడ్డల సంతోషాన్ని కోరుకుంటారు. కానీ.. చాలామంది తల్లిదండ్రుల బాధను అర్థం చేసుకోకుండా.. ఏ విషయంలోనైనా తమను చిన్న ఇబ్బందికి గురిచేసినట్లు అనిపించినా క్షణికావేశంలో వారిపాలిట మృత్యువు అవుతున్నారు. మదనపల్లెలో ఓ తండ్రి తన కూతురి చేతిలో హతమయ్యాడు. ఆమెను పెళ్లిచేసుకోమని అడగడమే అతనికి శాపమైంది. ఇష్టంలేని పెళ్లి చేసుకోమంటున్నారన్న కోపంతో కన్నతండ్రిపైనే దాడి చేసిందామె.


జూన్ 13న అన్నమయ్య జిల్లా మదనపల్లెలో జరిగిన ఈ హత్యకేసు వివరాలని డీఎస్పీ ప్రసాదరెడ్డి వెల్లడించారు. మదనపల్లెలోని పీఅండ్ టీ కాలనీకి చెందిన దొరస్వామి (62) అనే వ్యక్తి.. దిగువ కురవంకలో ఉన్న ఒక ప్రాథమికోన్నత స్కూల్ లో టీచర్ గా పనిచేస్తున్నారు. ఆయన భార్య ఏడాదిన్నత క్రితం అనారోగ్యంతో కన్నుమూశారు. అప్పటి నుంచి కుమార్తె హరితతో కలిసి ఉంటున్నారు. హరిత బీఎస్సీ పూర్తి చేసి బీఈడీ కూడా చేసింది. పెళ్లినిమిత్తం దాచిన డబ్బును ఆమె బ్యాంకు ఖాతాలోనే వేయడంతో పాటు.. తల్లి నగలను ఆమెకే ఇచ్చారు.

కాగా.. మదనపల్లెకు చెందిన రమేశ్ అనే వ్యక్తితో హరిత సన్నిహితంగా మెలుగుతూ ఉంది. అతను అడగ్గానే బంగారు నగలను ఇవ్వగా.. వాటిని తాకట్టు పెట్టి రూ.11.40 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. మరో యువకుడు సాయికృష్ణకు కూడా రూ.8 లక్షలిచ్చింది. హరీశ్ రెడ్డి అనే ఇంకో యువకుడితోనూ హరిత సన్నిహితంగా ఉంటోంది. ఇదంతా గమనించిన తండ్రి దొరస్వామి.. హరితకు పెళ్లిచేయాలని నిర్ణయించుకున్నారు. మంచి సంబంధం కోసం చూస్తుండగా.. పెళ్లికి నిరాకరించింది.


Also Read: నర్సాపూర్ డబుల్ మర్డర్ కేసులో వీడిన మిస్టరీ.. కొడుకే హంతకుడు

నెలరోజులపాటు ఇద్దరికీ ఈ విషయంలోనే గొడవలు జరుగుతున్నాయి. 13న కూడా పెళ్లి ప్రస్తావన రాగా.. హరిత తీవ్రఆగ్రహానికి గురైంది. క్షణికావేశంలో తండ్రిపై విచక్షణా రహితంగా దాడి చేసింది. చపాతీ కర్ర, ఎగ్జామ్ ప్యాడ్, తాళంకప్ప, కర్రతో తలపై దాడి చేయడంతో ఆయన అక్కడికక్కడే మరణించారు. దొరస్వామి కేకలు విన్న చుట్టుపక్కలవారు ఆ ఇంటికెళ్లి చూడగా రక్తపు మడుగులో పడి ఉన్నాడు. కాలుజారి కిందపడ్డారని, అందుకే గాయాలయ్యాయని చెప్పింది హరిత. పోలీసులకు కూడా అదే కథ చెప్పింది. హరితపై అనుమానం వచ్చిన పోలీసులు.. తమదైన శైలిలో విచారణ చేయగా.. తండ్రిని తానే చంపినట్లు అంగీకరించింది. 17న హరితను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

Tags

Related News

Mysore News: వీడు ఎంత నీచుడంటే.. లవర్ నోట్లో బాంబు పెట్టి చంపేశాడు.. చివరకు..?

Chevella News: ఘోర రోడ్డుప్రమాదం.. తండ్రీకూతుళ్లు స్పాట్‌లో మృతి

Nagarkurnool News: దంపతుల మధ్య చిచ్చు.. అడవిలోకి తీసుకెళ్లి భార్యని పొడిచి, నిప్పుపెట్టాడు

Uttar Pradesh: ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి!

Medipally murder case: ముక్కలు చేసిన భర్త.. మేడిపల్లి స్వాతి హత్యపై డీసీపీ షాకింగ్ కామెంట్స్!

Bhadradri crime: యువతిపై సామూహిక అత్యాచారం.. భద్రాద్రి జిల్లాలో దారుణ ఘటన!

Big Stories

×